Previous Page Next Page 
శశిరేఖ పేజి 27

శశి - ఎందుక్కాదూ? తప్పేమిటి? పెళ్ళికి నాకభ్యంతరం లేదు. కాని చేసుకోనివ్వరుగా?
రామ - అవును. రోజుకోకన్ని చేస్తూ వుంటారా?
శశి - అయితే  మా వాళ్ళు చేసిన  వాడితో వుండాలంటావా, నువ్వ  నేది? అదిగాక పెళ్ళి అయినా యిష్టం వచ్చినప్పుడు వదలకూడదుటగా? తరవాత యిష్టం లేకపోతే ఏం చెయ్యాలి?
రామ - ముందరే  ఆలోచించి చేసుకోవాలి. వాడు యిష్టం లేకుండా వస్తే వూరికే వుండాలి.
శశి - ఊరికే ఎక్కడ వుండాలి? ఎట్లా బతకాలి?
రామ - నీవు సరిగ్గా వుంటే ఎక్కడన్నా వుండొచ్చు.
శశి - అప్పుడు నన్ను ప్రేమించేందు కేవరుంటారు?
రామ -ఇంక మళ్ళి ప్రేమేమిటి?అదే కూడదంటున్నాను.
శశి - అయితే ఎక్కడో యిక బతకడమెందుకు?
రామ - ఊరికేనే.
శశి - ఊరికే ఉండేబదులు హాయిగా ప్రేమిస్తో సంతోషంగా బతికితేనేం?
రామ -  ఇట్లా బతకడం పాపం కదూ?
శశి - అంటారు కాని ఎందుకు పాపమో ఎవరూ చెప్పరు. నాకు తప్పని తోచించాకా నెనందుకు నా జీవనం వృధా చేసుకోవాలో తెలీటం లేదు.
ఇంక  వాదించి లాభంలేదని రామారావు తెలుసుకొనెను.
రామ - పోనిగాని యీ  సుందర్రావువంటి  వాడిమీద నీకు ప్రేమ యెట్లా కుదిరిందో నాకు తెలీడంలేదు.వీడి చరిత్ర  నీ కేమన్నా తెలుసునా?
శశి - నాకు తెలిదు.తెలినక్కర్ను లేదు. నామీద ఆయనకీ ప్రేమ ఉండేది అంతే చాలును.
 రామ - నీకు అతనిమీద ప్రేమ లేదన్నావుగదా యిప్పుడు? ఎందుకున్నావిక్కడ?
శశి - ఉండక  చేసే దేముంది?
రామ - పోనీ,  నేనోకరి దగ్గరికి పంపుతాను. అక్కడ  స్వతంత్రంగా సన్మార్గంలో జీవించు.
శశి - జీవించి-
రామ - ఏమిలేదు. హాయిగా ఉండు.
శశి - ఇక్కడ నేను పడుతున్న కష్టమేముంది? ఒక్కరి కానంద మిస్తూన్నాను.నేను సౌఖ్యంగా వున్నాను. అక్కడ నాకు పనేముంది? ఏం తోస్తుంది?
రామారావు మాట్లాడక కూర్చునెను.కొంచెము సేపుండి.
రామ - నేనొకటి చెపుతాను. ఎన్నాళ్ళనుంచో  చెప్పాలనుకుంటున్నాను. నీ కిష్టమైతే సరే. లేకపోతే నేను చెప్పలేదనుకో. నీకు తెలీదూ! నీమీద  ప్రేమ నాకు  పోలేదని? నిన్నిక్కడ చూచినప్పటినుంచి  నాకు నిధ్ధరలేదు.  ఎంత అనచుకుందామన్నా అణక్కుండా వుంది.  నా మీద నికేమ్తెనా ప్రేమ వుందా?
శశి - ఆ విధంగా నేనెప్పుడూ ఆలోచించలేదు.తెలిదు.అయితే యిదంతా మీరు తప్పంటున్నారుగా?
రామ - అదికాదు, నా వుద్దేశ్యం నువ్వు నన్ను పెళ్లిచేసుకోవాలని. ఇంతకన్న చెడ్డ  సమయం  రామారావుకు  దొరికి వుండేదికాదు. తన  బ్రతుకు చేడ్డదన్నందుకు అతని పై కోపం ఆమె కింకను పోలేదు.
శశి - పెళ్ళి? ఇప్పుడేం పెళ్ళి?
రామ - ఏం?
శశి - ఇంత పెద్దవాళ్ళకా?
రామ - బ్రాహ్మసమాజంలో  తప్పలేదు.
శశి- మీ వాళ్ళందరూ అట్లాంటి  చెడ్డదాన్ని చేసుకున్నా వేమనరూ?
రామ - అంటే అన్నారులే! కవ్ష్టం నాకేగా?
శశి - పోనీ, మరి యిదివరకొక మొగుడు  గోవిందపురంలో ఉన్నాడుగా?
రామ - నేను కనుక్కున్నాను.అతడు పోయి మూన్నెల్లయింది.
శశి-   పోయినాడూ  ఆఖరికి  పాపం!  ఈ పాటికి   వెధవముండని  చేసేవాళ్ళే నన్ను ఈ జుట్టూగిట్టూ  గోరిగేవాళ్ళు గావును. అప్పుడు నువ్వు వచ్చి పెళ్ళి చేసుకుంటానని జుట్టు పెంచేవాడివి.ఈ నాటికి
కొంచెం పెరిగి, నీ తలమల్లే  వుండేది  నాతలకూడా.
అని బిగ్గరగా నవ్వి చాపమీద పోర్లేను. రామారావునకు కోపము వచ్చెను.తనంత ప్రేమతో పెళ్ళి  చేసుకోనమని అడగగా ఈ నవ్వులు అతనికి అర్ధము కాలేదు.
రామ - సరేలే.చెప్పుమరి.
శశి - పెళ్ళంటే  యేం చేస్తారు? ఊరేగడం అవన్నీ ఉన్నాయా! పిటలమీద ఎవరు కూచుంటారు? సుందర్రావుగారా?
అని తిరిగి బిగ్గరగా  నవ్వ నారంభించెను. రామారావుకు చాలా కోపము వచ్చెను.
రామ - అవన్నిలేవు.పదిహేను రోజులు  ముందరచెప్పిరిజిస్టరు చేయించుకోవాలి.
శశి - ఏదో కొత్తగా వుంది. చూడవలసిందే.కాని అన్ని పెళ్ళిళ్ళ మల్లే యీలోకంలో ఆ లోకంలో నిదాన్నే కావాలా?
రామ - ఆ. నా ఆత్మ నీ ఆత్మ  ఒకటి అవుతాయని అర్ధం?
శశి - మరి కాకపోతే?
రామ - నామీద ప్రేమ నీకు, నీ మీద  ప్రేమ నాకు వుంటే ఎందుక్కావూ?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS