శశి - ఋణంలేదు. ఏమిలేదు. అట్టే మాట్లాడకండి. ఆయాసం వస్తుంది.
సుంద - శశి, నేనా సాయంత్రం జరిగిందంతా విన్నాను.అంత తొందరెందుకు పడ్డావు?నేను వచ్చేదాకా వుండక పోయినావా?
శశి - ఎవరు చెప్పారు మీకు? ఆ కాంబోట్లేనా? వాడు మళ్ళి ఇంటికి రావడం మొదలు పెట్టాడూ?
సుంద - వాడి సంగతి మన కేందుకులే. నీమీద నాకు కోపంలేదు. ఇంకొకళ్ళయితేఎప్పుడో వెళ్ళిపోయ్యే వాళ్ళు. నేనేమీ సౌఖ్య మిచ్చానని నా దగ్గర వుంటావు? నారత్నాన్ని, నా ప్రాణాన్ని, పోగొట్టుకొనేవాణ్ణి. నేపడడమే నన్ను రక్షించించిది. నిన్ను మళ్ళితీసుకొచ్చింది.నాకు, బాధ పడ్డందుకు ఇక దిగుల్లేదు.
శశిరేఖకు సిగ్గువేసింది. తన తలపులేక్కడ?ఇతని తలపు లేక్కడా?
సుంద - ఇంక ఎన్నడూ ఆ ప్రకారం నిన్ను చెయ్యను. నా వళ్ళు నేను మరిచాను,క్షమించాగలవా?నా జన్మామంతా నీ సేవలో గడిపి, నిన్ను నా అపరాధం మరిచేట్టు చెయ్యడానికి ప్రయత్నిస్తాను.యింక నన్ను విడిచి పోవాలనకోవుకదా!
శశిరేఖ మాట్లాడలేదు.
సుంద - నామీద యింకా నీకు నమ్మకం రాలేదు.పోనీ నాతో చెప్పకండా వెళ్ళిపోనని వాగ్దానం చెయ్యి.
శశి - సరే.
సుంద - అంతేచాలు.
శశిరేఖకు యీ ప్రేమ యేమి సంతోషం కలుగ చెయ్యలేదు. అతని పై ఆమె ప్రేమ అంతయు నశించినది. తనను గోవిందపురం వెళ్ళ నియ్యాడు కాబోలు అని దిగులు కలిగినది. సుందరరావుకు శశిరేఖ తన వద్ద నుండి వెళ్ళకలదన్న మాట కలలోన్తెనా తోచలేదు. తనను వదలిన ఆమెకు దిక్కులేదు గనుక తానెంత భాధపెట్టినను తనను వదలదని అతనికి నిశ్చయముండెను.కాని శశిరేఖ స్వతంత్ర మార్గమును వెదకి కొన్న దనుట తోడనే అతని స్వభావమే మారినది. తన చేతిలో నుండి జారిపోవునట్లుండునప్పటికి,ఆ మనిషి అమూల్యత్వము జ్ఞపకమునకు వచ్చినది. అప్పటినుండి అతడు శశిరేఖతో చాలా జాగ్రత్తగా మెలగుట నేర్చుకోనేను. మిగుల దయయు ప్రేమయు చూపుట తిరిగి నేర్చుకోనేను.
11
రెండు నెలలు గడిచినవి. డాక్టరు రామారావు ప్రతి మధ్యాహ్నమును సుందరావింటికి వచ్చుచుండేను. తన పని ముగించుకొని సుందరరావు సాయంత్రము వచ్చుచుండును. శశిరేఖకు, రామారావునకును మిక్కిలి స్నేహమని అతడేరుంగును. కాని ఇప్పుడు పూర్వమువలె బందించుతకతనీకి ద్తేర్యము లేదు.శశిరేఖ తనపై నెక్కువ ప్రేమ చూపుటలేదని అతనికి తెలియుచునే యుండెను. కాని తానామె ప్రేమ నేట్లు కోరగలడు? రామారావు శశిరేఖ పై మిక్కిలి యభిమానం చూపుచుండెను. అతనికి శశిరేఖ తన కధనంతను చెప్పెను. అతడు మిక్కిలి చింతించెను. కాని శశిరేఖ ఏమియు సిగ్గును కనపరచలేదు. తాను చేసినదంతాయు న్యాయుమును ధర్మము అని విశ్వసించుచున్నటుల కనబడెను.తన తల్లిదండ్రులకు, కృష్ణునకు కలిగించిన దుఃఖమునక్తే వగవు తెల్పేనే కాని, తానధర్మమును చేసితినని తెలిసినట్లయిన కనబలేదు. అందుచే రామారావేమియు మాట్లాడ సాహసింపలేదు. కాని ఆమె జీవనం అతనికి అధికమ్తెన విషాధమును కలిగించుచుండెను.ఆమె కథనిని చూచినా అధికమగు ప్రీతి అతను ఆమెకు స్నేహమయిన తరువాత ఆమె భయమును, సందేహమును పోయెను. అతడు లేకున్న యెడల తిరిగి సుందరరావును వదలిపోయి యుండెడిది.కాని ఇది పరకటి అశాంతి పోయినది.తనను రక్షింపగల సోదరుడొకడు దొరికినట్లుండెను. అతని కొరకేప్పడును ఎదురు చూచుచుండును. తిరిగి చిన్నప్పటి సంగతులు వారేప్పడును మాట్లాడలేదు.
మధ్యాహ్నమున సూర్యుడు తోటయందలి ఆకులను తన ముద్దుల వేడిమిచతత్తరిల్లునట్లు చేయుచుండెను. గాలియు అలసి చెట్ల క్రింద నీడలో మెల్లగా ఉయ్యల లూగుచుండెను. ఇంక సౌఖ్యములు కోరని విధవలవలె పువ్వులు వడిలి చెట్ల క్రింద రాలేను. సంపెంగ చెట్టు క్రింద చాప పై శశిరేఖయు రామారావును కూర్చుండిరి. శశిరేఖ పగడ పువ్వుల దండను పూర్తిచేసి రామారావు చేతికిచ్చెను.
రామ - నేనోక్కటడగాలనుకుంటున్నాను. నీకు కోపం రాదు గదా?
శశి - అడుగు. నీ మీద నాకు కోపమేమిటి?
రామ- నీవు బ్రతికే ఇట్లాంటి బ్రతుకు అసహ్యమేయ్యడం లేదూ?
శశి - అసహ్యమేమున్నది?
రామ - నీకు తెలిడంలేదూ నేననేది?
శశి - తెలీడంలేదు.
రామ - సుందర్రావుకి నీకూ ఏం సంబంధం?
శశి - నీతో చెప్పలేదూ ఏం సంబంధమో?
రామ - చెప్పినావులే.కాని ఇట్లా వుండడం తప్పు కాదూ?
శశి - ఏం తప్పు ?
రామ- పెళ్లికంది ఇట్లా ఎట్లా అంటే అట్లా వుండడం మంచిదేనా?
శశి - నువ్వుకూడా అందరిమల్లేనా యేమిటి? మూర్ఖం వదిలేశామంటారే?
రామ - అవును.కాని పెళ్ళిచేసుకోంది ఒకణ్ని విడిచి ఇంకొకడితో విచ్చలవిడిగా వుండోద్దనడం మూర్ఖమేనా?
