Previous Page Next Page 
రాజ హంస పేజి 27

 

    "ఎందుకమ్మా తన గురించి ఆరాటపడతావు?"
    "అది కాదు రా, కొంత దూకుడు స్వభావం గల మనిషేననుకో. ఎంతయినా ఆడపిల్ల."
    "రాజహంస గురించి ఇహ మరచిపో అమ్మా."
    ఆమె ఉలికిపడింది. కొడుకు తననుంచి ఏదో దాస్తున్నాడు. నిజం చెప్పటం లేదు.
    "ఎందుకురా అలా అంటున్నావు. నాకేదో భయంగా వుందిరా."
    "భయమెందుకమ్మా! అసలు నువ్వీ విషయాలన్నీ మనసులో పెట్టుకోకమ్మా. రెండు మూడు రోజుల్లో నా ఆఫీసు వేళల్లో నీ కిబ్బంది కలక్కుండా వుండటానికి అనీల్ ని చూడటానికి పనిమనిషి నేవర్నయినా చూస్తాను."
    "అసలేం జరిగింది రా? రాజహంస ఎందుకని రాదు?"
    "రాజహంస ....."
    "చెప్పరా."
    "మనందర్నీ విడిచి వెళ్ళిపోయిందమ్మా."
    'అంటే తనకేదన్నా ప్రమాదం...."
    "నా ఉద్దేశ్యం అది కాదమ్మా. భర్తగా తను నాతొ రాజీపడలేక పోయింది. అందుకని తన కిష్టమైన వ్యక్తిని ఎంచుకుని అతనితో .....అంతే'" తల్లి ముందు నిలబడలేక బయటకు వెళ్ళిపోయాడు.
    మీనాక్షమ్మగారు ఈ షాక్ కు తట్టుకోలేక స్మృతి హీనురాలాయి పోయింది.

    
                                                          15

    రాజహంస కొత్త జీవితంలో కడుగు పెట్టింది.
    హైదరాబాద్ లో దిలీప్ ఇల్లు చిన్నదయినా చాలా విలాసవంతంగా, ముద్దుగా, ముచ్చటగా వుంది. ఎక్కడ  కక్కడ సౌకర్యాలు,....ఫోన్ దానికి ఎక్కడ కక్కడ కనెక్షన్ లు , హల్లో ఓ టివి, బెడ్ రూమ్ లో ఒక టి.వి , వి.సి.ఆర్  చాలా అందమయిన అత్యంతాధునీకమయిన కిచెన్ బెడ్ రూం , హాలు ఎయిర్ కండిషన్డ్ టైల్స్ అంటించి మిలామిలలాడే బాత్ రూంలో స్నానం కోసమని టబ్....
    టటబ్ లో రాజహంస నీళ్ళలో కూర్చుని ఆ నీళ్ళని కదిలిస్తూ కెరటాల మధ్య ఊగిసలాడుతున్నల్టు అనుభూతి చెందుతుంటే ....ఎంతసేపయినా టైము తెలిసేది కాదు.
    రోజులు నిమిషాల్లా గడిచిపోతున్నాయి.
    దిలీప్ ఉదయం పదిగంటలకు ఆఫీసు కెళ్ళి అయిదు గంటలకల్లా తిరిగోచ్చేవాడు. ఆఫీసు టైములో అతన్నుంచి ఫోను కూడా వచ్చేది కాదు.
    ఆఫీసు ఫోన్ నెంబరు ఆమె కిచ్చాడు గాని, "రాజా! ఎంతో అత్యవసరమయితే గాని ఫోన్ చెయ్యకు, ఎందుకంటె అక్కడ నేను చాలా బిజీగా వుంటాను. నా చుట్టూ పదిమంది మనుషులుంటారు. అలాంటి వాతావరణంలో నీతో యాంత్రికంగా మాట్లాడి నీ మనసు కష్టపెట్టలేను.' అన్నాడు.
    ఆమె అర్ధం చేసుకుంది. అది అతని డ్యూటీ టైము, ఆఫీసు మొగవాడిలో ఇద్దరు మనుషులుంటారు. ఒకడు - భర్తగా , ఇంటి యజమానిగా, గృహస్థ బాధ్యతలు నిర్వర్తించే వ్యక్తీ రెండవవాడు ఉద్యోగంలోనో , వృత్తి లోనో, వ్యాపారంలోనో తన డ్యూటీని నిర్వర్తించే వ్యక్తీ. డ్యూటీ అతనికి అన్నం పెడుతుంది. అది అతని జీవనోపాధి. సమాజంలో స్థానం, ప్రతిష్ట , స్థాయి కలిగించేదదే. అర్ధం , పర్ధం , డిసిప్లిన్ లేకుండా ఈ రెండూ ఒక దాంట్లో ఒకటి జోక్యం చేసుకోకూడదు. ఏ స్థానం విలువ , గౌరవం ఆ స్తానానికిస్తూ అక్కడి మూడ్స్ కి ప్రాధాన్యత నిస్తూ వుండాలి.
    "దిలీప్! నువ్వు నన్ను ప్రాణప్రదంగా , దేవతలా చూసుకుంటున్నావు. నిన్ను అర్ధం చేసుకోలేననుకున్నావా? నీ ఆఫీసు నిర్వహణ , బిజినెస్ అది నీ ప్రధమ కర్తవ్యమ్ , వాటికి నేనెప్పుడు సిల్లీగా అడ్డురాను." అంది రాజహంస.
    అతడు ఆమెకు కారు డ్రయివింగ్ నేర్పించాడు. చాలా చురుకుతనమున్న మనిషేమో పది  పదిహేను రోజుల్లోనే డ్రయివింగ్ క్షుణ్ణంగా వచ్చేసింది. సాయంత్రాలు పార్టీలకు గానీ, స్నేహితుల ఇంటికి విజిట్ కు గాని లేకపోతే సరదాగా తిరిగి రావటానికి షికారుకు గాని వెళ్ళినప్పుడు ఆమెతోనే డ్రైవ్ చేయ్యనిస్తూ తాను ప్రక్కనే కూర్చునేవాడు.
    పార్టీకో, చేంజ్ కోసమని డిన్నర్ కి వెళ్ళినప్పుడు తప్ప రాజహంసే స్వయంగా వంట చేసేది. ఉదయం కాఫీ తనే కాచి , టిఫిన్ తయారుచేసేది.
    "రాజా! నీకెందుకీ శ్రమ? నేను వంట మనిషిని పెడతాను" అన్నాడు దిలీప్.
    "వద్దు దిలీప్! నడయిన జీవితం, నేను అనుభవించాలనుకున్నాను గాని భేషజాలకు , అతిశయాలకు పొడల్చుకోవటం నా అభిమతం కాదు. అవసరం కోసం , ఎంజాయ్ మెంట్ కోసం ఎంతయినా ఖర్చు పెట్టుకోవచ్చు. కాని కొన్ని పనులు సొంతంగా చేసుకోవటంలో అనందముంది. ఇదివరకు నా స్వభావం వేరుగా వుంటే వుండవచ్చు. అప్పుడు ....నేను గడిపింది నా జీవితం కాదు. ఆ అక్కసుతో కసిగా ప్రవర్తించాను. ఇప్పుడు నేను కోరుకున్న ప్రాంగణంలోకి నేను ప్రవేశించాను. ఈ స్వేచ్చను దుర్వినియోగం చేసుకునే శక్తి నాకు లేదు."
    "రాజా! నీలో ఎంత మంచితనముంది.
    

                                                           *    *    *

    ఓ అర్ధరాత్రి రాజహంసకు మెలకువ వచ్చింది. దిలీప్ చేతులమెను చుట్టుకుని వున్నాయి.
    ఎందుకనో.....ఎంత వద్దనుకున్నా తానిక్కడికి వచ్చే ముందు జరిగిన ఒకటి రెండు సంఘటనలు గుర్తుకొస్తున్నాయి.
    ఆరోజు ఉదయం పాండురంగానికి ఊర్వశితో కబురు చేసింది. ఇద్దరూ దిలీప్ ఎపార్ట్ మెంట్ లో కలుసుకున్నారు. అతను ఇంటిలో లేడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS