Previous Page Next Page 
రాజ హంస పేజి 26

 

    ఆమె మనసు మౌనంగా ఉపశమనం పొందుతోంది.
    "రాజా!"
    "ఊ!"
    "ఇలా దగ్గరకు వచ్చేస్తానని భయపడే ఎన్ని పనులు వున్నా రాకుండా నిగ్రహించుకుంటూ వచ్చాను. కాని చివరకు పరిణామాలెలా వున్నా నిన్ను పోగొట్టుకోలేనని  తెలుసుకున్నాను."
    ముఖం క్రిందకు వంచి తన పెదవులతో ఆమె పెదమల్ని తాకాడు.
    పెదవీ, పెదవీ కలుసుకుంటూ ఉండగానే, అలా వుండే వాళ్ళిద్దరూ అతి చిన్నగా , రహస్యంగా మాట్లాడుకుంటున్నారు.
    "రాజా!"
    "ఊ!"
    "ఇన్నాళ్ళూ వంటరితనంలోని బాధను భరించాను. ఇప్పుడు వంటరితనంలోని ప్రేమ తాపాన్ని అనుభవిస్తున్నాను."
    "వద్దు దిలీప్. మనిద్దరి మధ్యా ఇహ వంటరితన మొద్దు."
    "కాని...."
    "నీ ప్రేమనూ , గొప్పతనాన్నీ అర్ధం చేసుకున్నాను. దిలీప్ ఇహ ఒక్క క్షణం నిన్ను విడిచి వుండలేను."
    ఇద్దరి మధ్యా నిస్సంకోచం, పొంగిపొరలుతున్న ప్రేమప్రవాహం, ఆర్తి ....ఒకరి కొకరు ఇంకా దగ్గరగా పెనవేసుకు పోతున్నారు.
    ఇలా.....ఇలా వుంటుందా ఇష్టమైన పురుషుడి గాడ పరిష్వాగం!
    అలా...... స్పందనలు అలలు అలలుగా ఎక్కడికో తెలిపోతున్నాయి.
    ఎప్పుడు బెడ్ మీద వాలిపోయారో తెలీదు.


                                                            *    *    *

    రాజహంసకు మెలకువ వచ్చింది . గదంతా చీకటి వ్యాపించి వుంది. మధ్యలో ఎప్పుడో దిలీప్ లైటార్పేసిన సంగతి లీలగా గుర్తొచ్చింది.
    తాను పూర్తిగా నగ్నంగా వుంది. అతను నిద్రలో మునిగివున్నా అతని చేతులామెను చుట్టుకుని వున్నాయి.
    కదలాలనిపించ లేదు. ఆ చీకట్లో కళ్ళు తెరచి చూస్తూ మెదలకుండా పడుకుంది.
    ఎన్ని నిమిషాలు ముందుకు పరిగెడుతున్నా ఆమెకు విసుగనిపించలేదు.
    నిద్రట్లో అతని చెయ్యి కదిలి గుండెల మీద నుంచి పెదవుల మీద కొచ్చింది.
    ఆ చేతిని ముద్దు పెట్టుకుంది.
    అతనికి మెలకువ వచ్చింది. "రాజా" అన్నాడు.
    "దిలీప్"
    "కోపమొచ్చిందా?"
    "దేనికి?"    
    "నేనిలా నిన్ను...."
    "నేను మనస్పూర్తిగా ఇష్టపడినప్పుడు కోపం దేనికి?"
    "పోనీ బాధ అన్పిస్తోందా?"
    "లేదు దిలీప్! పుట్టిన ఇన్నాళ్ళకు.....నా జీవితంలో మనసులోని భావాలకు అనుగుణంగా జరిగిన సంఘటన ఇది. నాకు తెలియని జీవితం ఇప్పుడు తెలుసుకున్నాను. నాదయినా జీవితం ఇప్పుడు నా అధీనంలో కొచ్చింది. నేనేదో పోగొట్టుకున్నాననీ, నా నుంచి విలువలు జరిపోయని నేననుకోవటం లేదు. ఇన్నాళ్ళూ జరిగినదంతా అబద్ధం ఇదే నిజం అని తెలుసుకున్నాను . దిలీప్! నువ్వూ నాకు కావాలి. ఈ సత్యం తప్ప ప్రపంచంలో మరొకటి కనబడటం లేదు."
    ఈ మాటలు వింటూ ఏదో తన్మయత్వంలోకి వెళ్ళి పోయినట్లు అతడామెను దగ్గరగా పొదువుకుని చెంపల మీదా, పెదవుల మీద పదే పదే ముద్దు పెట్ట్టుకుంటున్నాడు.
    "దీలిప్ టైమెంతయింది?"
    "తెలియదు. బహుశా వంటిగంట దాటి వుండవచ్చు."
    రాజహంస విని మెదలకుండా వూరుకుంది.
    "ఇంట్లో.....ఏమన్నా గొడవ జరుగుతుందని భయమా?"
    "అలాంటి భయాన్ని దాటిపోయాను దిలీప్. అందుకే ఈ నిర్ణయానికి కొచ్చాను."
    "రాజా!"
    "అవును దిలీప్! నువ్వు నాక్కావాలి. నేను నీ దాన్ని. ఆ ప్రపంచంలోకి మళ్ళీ వెళ్ళే ప్రసక్తి లేదు. నేన్నీతో వచ్చేస్తున్నాను. నన్ను తీసుకెళ్ళిపో."
    అతనప్రభుతుదయ్యాడో, విభ్రంతుడాయ్యాడో ఒక్క నిముషం పాటు మాట్లాడలేకపోయాడు.
    "దిలీప్! ఇష్టం లేదా?"
    "రాజా! యెంత మాట! నువ్వు హటాత్తుగా అలా బయట కొచ్చేసరికి నాలో కలిగిన ఆనందోద్రేకం. నేను ఎలా అడగాలా అని తటపటాయిస్తూన్నాను. నువ్వే చెప్పెగలిగేసరికి.....నేను నిజంగా సంతోషంతో ఈ పరిణామానానికి తట్టుకోలేకుండా వున్నాను. ఇంత ఆకస్మికంగా నన్నెందుకు కింత అదృష్టవంతుడ్ని చేశావు?"
    'దిలీప్! దిలీప్!"
    ఆమె అతన్ని పెనవేసుకుపోయింది.


                                                               14

    "పాండూ " అని పిలిచింది మీనాక్షమ్మగారు.
    'అమ్మా!"
    "రాజహంస...."
    రాత్రంతా ఆమె ఇంటికి రాలేదు. మర్నాడు కూడా చాలా భాగం గడిచిపోయింది. ఆమె ఆందోళన అనుచుకోలేకపోతోంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS