శశి- మీరు తీసుకున్న శ్రద్ధకు చాల వందనాలు. ఆయనకి ప్రాణదానం చేశారు.
రామ - నేను కాదు. రాత్రింబవళ్ళు అతని అదృష్ట దేవత నిద్రాహరాలు లేకుండా అతన్ని కాపాడకపోతే నా మందులెం చేసేవి? ఇంకనేను ప్రతిరోజూ రానక్కర్లేదు. అవసరమ్తేతే కబురు పంపండి.
శశిరేఖ కొంచెం సేపు వూరుకుంది. ఒకరివంక ఒకరు చూస్తోనుంచున్నారు.శశిరేఖ నిశ్చయం చేసుకుంది.
శశి - డాక్టరుగారూ!మీ నివాస స్ధలము గోవిందపురమా?
రామ - అవును, మీ కెట్ల తెలుసు?
శశి - అక్కడి వాల్లెవరన్నా జ్ఞాపకమున్నారా?
రామ - నేనక్కన్నించి వచ్చేసి చాలా రోజులయింది. అప్పడున్న వాళ్ళందరూ జ్ఞాపకమున్నారు.
శశి - అందరూ?
రామ - ఏమి? అడగండి, చేపుతానో లేదో.
శశి- శశిరేఖ అనే పిల్ల జ్ఞపకం వుందీ?
రామారావు మాట్లాడలేదు.ముఖమును ప్రక్కకు తిప్పకోనేను. అతని కళ్ళలో నీళ్ళు గిర్రున తిరిగెను.
రామ - జ్ఞాపకం వుంది, ఆమె ఎక్కడుందో మీకు తెలుసునా?
శశి - ఆమె నిప్పుడు చూస్తే మీరు గుర్తు పడతారా?
రామ - ఎక్కడ, ఎంత మందిలోనైనా గుర్తు పడతాను.ఆమె రూపము నా హృదయంలో శాశ్వతముగా ముద్రింప బడినది.
శశిరేఖ అతడి ప్రకారము మాట్లాడు ననుకోనలేదు.ఏదో చిన్నప్పటి సంగతులు కొంచెము మాట్లాడ వచ్చుననియు, తనవలెనే అతడును తనను మరిచేననియును అనుకొనెను. అతని తన ఆవేశమును చూచి భయము కలిగెను. చెప్పవలెనా అక్కరలేదా? అతడు తన నింకను ప్రేమించుచుండెను. తానేనని తెలుపగలదా?
శశి - మీ కామె పై అంత ప్రేమయని ఎరగను. తెలిస్తే యింత దుఃఖము కలిగించే విషయాన్ని ఎత్తివుండను.క్షమించండి.
రామ - క్షమించడానికి ఏమిలేదు. ఒకసారి ప్రేమిస్తే మరిచిపోయే స్వభావం నాదికాదు. మీరు ఆమె ఎక్కడున్నదో చెపితే చాలా సహాయము చేసిన వాళ్ళవుతారు.
శశి - ఎక్కడుందో తెలిదు చిన్నప్పుడు మీరు,ఆమె స్నేహంగా వుంటే చూసేదాన్ని గోవిందపురంలో. పోనీ,మీర వూళ్ళో ఆమె కోసం విచారించాలేదూ,ఏమయిందో?
రామ - అక్కడి నా స్నేహితుల కుత్తరం వ్రాశారు.కనక ఇంకేంలాభామని వెళ్ళలేదు. అదిగాక,ఆమెకు పెళ్ళియిందట . ఇంకా అమర్యాద పని చేసిందని కూడా విన్నాను. కాని నాకు సంగతులు బాగా తెలివు.
శశి -నాకు తెలిసును.లోకం అభిప్రాయం ప్రకారం ఆమెఅదమ స్ధితికి వచ్చింది. కాని ఆమె మాత్రము తను చేసినపని చాలా అన్యాయమను కుంటోంది.సరికాని,ఇంక ఆమెతో మీకేం పని?
రామ - ఏమిలేదు.ఆమె మొదటి భర్తను నేను. ఆమెకి నేను భర్తను కాకపోయినా, ఆజన్మాంతమూ ఆమెయే నాభార్య.ఒక్కసారి చూడాలని, ఎత్లవుందో తెలుసుకోవాలనీ, సహాయం చెయ్యడానికి విలైతే చేసి ఆ దుస్దితిలో నుంచి తప్పించాలని వుంటుంది.
రామారావుకు బొటబొట కన్నీళ్ళు కారును.
రామ - రేయుంబగళ్ళు ఆ మోహం తప్ప ఇంకేమి స్మరణ లేదు. నా అంత దురదృష్టవంతు డేక్కడాలేడు.ఒక్కసారి ఆమెను చూస్తేచాలు, ఇంకేమి అక్కర్లేదు.నా జన్మ సఫలమౌతుంది. ఈ లోకంలో కాకపోతే వొచ్చే లోకంలో కలుసుకుంటాను. ఆమె సౌఖ్యము కోసం ప్రతిరోజూ ప్రార్ధన చేస్తూ వుంటాను,ఆమె దుస్దితికి నేనే కారనమేమోనని, ఆమెను దాంట్లోంచి నేను తప్పించాగలిగి, నా విధిని చెయ్యకుండా వున్నానేమోనని విచారం.మీకు ఎప్పడన్నా ఆమె సంగతి విన్నప్పుడు నాకు తెలియచేస్తే ఆజన్మాంతము కృతజ్ఞత చూపుతారు.
ఇంక శశిరేఖ ఎట్లు దాచగలదు?
"రామా, నన్నప్పడే మరిచిపోయినావా?" అనెను. రామారావామె వంక చూచెను.కొంచెము సేపట్లేయుండి చివరకు-
"తల తిరిగి పోతుంది. శశిరేఖ మీరా ? మీరేనా? తరవాత వొస్తాను, క్షమించండి." అని వెళ్ళిపోయెను.
శశిరేఖ యీ విచిత్రమగు విషయము నాలోచించుకోనుచు కూర్చుని సుందరరావును, పరిచర్యను,సమస్తమును మరచెను.ఇంతలో అతనికి కాఫి వేళ అయినదని సేవకుడు జ్ఞాపకము చెయ్యగా గది లోనికి పోయెను. సుందరరావు కండ్లు తెరచి చూచుచుండెను.
శశి కాఫి సిద్ధమయింది.తేనా?
సుంధరరావామె చెయ్యి పట్టుకొనెను.
సుంద - ఇట్లా కూర్చో. వేడిగా వుందే వళ్ళు? జ్వరము వచ్చింది. ఎంత చిక్కిపోయినావు? ఇదంతా నాకోసమే? నేను నీకు ఏం చేశానని నాకింత ఉపకారం చేశావు? నువ్వు ప్రాణదానం చేశావు నాకు. నిన్ను చూస్తూ,ని వున్నావుకదా బతకడానికనే తలపు లేకపోతే నేను బతక్కపొయ్యేవాణ్ణి, నీ శ్రద్ధవల్లగాని,లేకపోతే యీ రోగం ఎప్పుడో మింగేసేది నన్ను. నీ సౌఖ్యాన్ని, సంతోషాన్ని, ఆరోగ్యాని నా కోసం ఇచ్చేశావు. ఇంత దయ,ప్రేమ, ఎప్పడూ ఎరగను. ఇన్నాళ్ళనుంచి నిన్నెంత క్రూరంగా చూశాను! నీ ప్రేమను తృణికరిచి నిన్నేంతో ఎదిపించాను.కాని నా అదృష్టదేవతవ్తే, ఏమి మనస్సులో పెట్టుకోకూండా నన్నుద్ధరిం చావు నీ ఋణం ఎట్లా తీర్చుకోను?
