Previous Page Next Page 
శశిరేఖ పేజి 24

"అమ్మ! అదృష్టమే మీరు వెళ్ళలేదు. అయ్యగారి బండిపడినది. స్మృతిలేదు. ఇంట్లో పడుకోపెట్టినము."అని  చెప్పెను. శశిరేఖ ఇంక సందేహింపలేదు. ఇంటికి బయలుదేరెను.  ఈ స్ధితిలో తానతనిని వదలినచో ఎంత దుఃఖించునో!అతనికి  దిక్కెవరు? తనను నమ్మి పెండ్లయినను చేసి కొనలేదు కదా?
ఇంటికి వెళ్ళునప్పటికి సుందరరావుకు   స్మృతిలేదు. పెద్ద డాక్టరునకు కబురు చేసియుండిరి. డాక్టరును  ఎట్లున్నదని శశిరేఖ అడిగెను.
డాక్ట - మిరితని భార్యా?
శశిరేఖ కేమి చేప్పటకును తోచలేదు.తనవంక ఆశ్చర్యముతో  చూచు అతని చూపులామెమనస్సు  నాందోళన
పరచుచుండెను.
డాక్ట - సుందరరావుగారు  మిక్కిలి ఆపాయ స్ధితిలో నున్నారు.  ఏమి చెప్పటకును వీలులేదు. వారము  రోజులు గడచిన కాని ఆశలేదు. రేయుంబవళ్ళు   ఆయన్ని బహు  జాగ్రత్తతో చూస్తో వుండాలి. మీరు చూడగలరా?  నేనాయన్ని  ఆస్పత్రికి  తిసుకోనిపోతే బాగుండును. కాని  కదిలించడం అపాయకరము. మీరా భారము తీసుకుంటారా? లేకపోతే నేనేవరినన్నా  పంపనా?
శశి - నే నసమర్దురాలనని ఎందుకనుకున్నారు?
డాక్ట - కోపము వద్దు. మీకు ర్తెలు  తప్పిపోవడంచేత  యీ సాయంత్రం మిమ్మల్ని చూసే భాగ్యం నాకు కలిగింది.
శశి - ఉహు, సుందరరావుగారి విషయమై  తగిన జాగ్రత్త నేను  తీసుకోగలను.
డాక్ట- అట్లా  అయితే సరే. అతని ప్రాణాలు మీ చేతుల్లో పెడుతున్నాను.
శశి - మరేమి భయపడనక్కర్లేదు.
డాక్టరు వెళ్ళిపోయెను. శశిరేఖ కతనికంఠము, మాటలూ,ఏవో తెలిసిన వానివలె నుండెను. ఆమె నౌకర్ల  నతని   విషయమై యడిగెను. అతనింగ్లాండు వెళ్ళివచ్చుటచే ఇంత పెద్ద పని  మయ్యెను. అతడు బ్రాహ్మ సమాజమున చేరినవాడు. అతని అసలు నివాస స్ధలము గోవిందపురము. పేరు రామారావు.
ఆహ విచిథ్రము! తాను పెండ్లికి పూర్వము  చిన్నప్పుడు ప్రేమించిన రామారావే యితడు!
                                                                           10
పది రోజుల వరకును సుందరరావు ప్రాణాపాయస్ధితిలో నుండెను. రేయింబవళ్ళు  ఒక్క నిముషమ్తెన నేమరక   శశిరేఖ అతనిని కాచుకొని  కూర్చుండెను.  ఎప్పడాతడు   కండ్లు తెరచి చూచినను,ఆమె మృదుహస్తము, సుందర నేత్రములు,    అతనికి ద్తేర్యము నిచ్చుచుండెను. ఇంకొకరి నెవ్వరిని దరిజేరనిక ఆమె తానే స్వయముగ నన్ని సౌఖ్యముల సమకూర్చెను. కాని ఆమె మనసు మాత్రము అనేకాలోచనలతో నున్నది. తిరిగి ఇతని వద్ద చిక్కుకుంటేనే యని ఆలోచించెను.స్వస్ద్హత చెందిన తరువాత ఇతడేట్లుండునో కదా? ఎట్లుండిన నేమి, తాను వెళ్ళుట కేమి యటంకము? డాక్టరు వచ్చినపుడెల్ల అతని పై తలపులు  తిరుగుచుండెను. అతడు తనను గుర్తు పట్టలేదు, అసలు చిన్నప్పటి శశిరేఖనే   మరచి యుండును.అతనికి తనను జ్ఞాపకము చెయ్యవలేనా లేదా? అతనికి వివాహమ్తెనదో లేదో? అతని భార్య ఎట్లుండునో?ఎంత పొడుగుగా,బలముగా నుండెను అతడు? ఎంత జ్ఞానవంతముగా, ఉదారముగా, శాంతముగా, సుస్దిరముగా, నుండెను అతని ముఖము!ఎంత  గౌరవముగా, మృదువుగా నుండే నాతని మాటలు! ఎంత అధికార మాతనికి!సుందరరావు కన్న ఎంతో అత్యుత్తమ పురుషుడుగా కన్పడెను. అతని యందే  కళంకమును కానరాదు.
అతడును తానును పసితనమున ఆడుకోనిన ఆటలు, చేసిన స్నేహము, పొందిన సౌఖ్యములు కండ్లకు   కట్టినట్లు జ్ఞప్తికి  వచ్చుచుండెను. ఒకనాటి సాయంకాలము రామారావామెను  ముద్దు పెట్టుకొని "నిన్ను తప్ప ఇంకెవరిని    పెళ్ళి చేసికొను. నువ్వు నన్ను చేసుకుంటావా?"  అని అడిగియుండెను. సిగ్గుతో "నిన్ను తప్ప ఎవరిని చేసుకో"నని ఆమె    చెప్పెను. అతను ఎండాకాలము, శలవలకు వచ్చినప్పుడు, వూళ్ళో అందరూ,అతని చాదువుసంగతి చెప్పుకొని ఆశ్చర్యపడు  టయును, అతడు చిన్నవాడయినను అతని తెలివిని బుద్ధిమంత తనాన్ని మేచ్చుకోనుటయు  జ్ఞాపకముండెను.అతడు రాగానే  కొంటెపిల్ల కాయలు అతడు ఇంగ్లండు  వెళ్ళాక  పూర్వము తనకోసరమువచ్చి "శశి, నేను  సముధ్రముదటి  దూరదేశం వెడుతున్నాను.కాని నిన్నెప్పడూ  మరిచిపోను. ఈ జన్మలో మరిచిపోను. నా ప్రాణముననంతవరకు  నివే నా భార్యవు. నేను వచ్చిందాకా  నా కోసం పెళ్ళి చేసుకోకుండా వుంటానని వోట్టేయ్యి "  అని ఏమి తెలియని తన చేత వొట్టు వేయించుకొని, తన చేతినున్న చిన్న గాజును జ్ఞపకార్ధము తీసుకుని వెళ్ళుటయు, అప్పుడు జరిగినట్లు తోచెను.కానీ తానెంత అతనిని ప్రేమించి పెళ్ళి   వద్దని యేడ్చుచున్నను , బలవంతముగా తన నేవడికో పెళ్ళి చేసి యుండిరి.అటు తరువాత తాను అతనిని మరిచి యెన్నాల్లో    అయినది. ఈ ఆలోచన లిప్పడెందుకు?
నెల దినముల తరవాత డాక్టరు రామారావు  రోగిని పరిక్ష చేసి వెళ్ళి పోవుచు, శశిరేఖతో మాట్లాడేను.
రామ - ఇంక అపాయము లేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS