శశిరేఖ తిరిగి తిరిగి తానేమి చేయగలనా యని ఆలోచించెను. ఏత్రోవయును కనబడదు. తననగలమ్మి యెట్లయినను స్వతంత్రముగ జివింపవలేనని నిశ్చయించుకొనెను. గోవిందపురమునకు పోయిన కృష్ణుని దూరముననుండి చూచుచుండవచ్చును. అతనికి తన సామీప్యము దుఃఖము కలిగించిన ఇంక నేక్కదికైన పోవచ్చును. అదిగాక తన పుట్టినింతినుండి తనకు రావలసిన యాస్తి కలదు. అది తనస్వతంత్ర జీవనమునకు తోడ్పడ వచ్చును. సుందరరావును వదలుట ఆమెకు సంతాప మేమాత్రమును కలిగించుటలేదు. ముందటి తన జీవితమును తలచుకోన్నప్పడెల్ల ఆమె కానందము కల్గుచుండెను. ఎవరో తనను ప్రేమింతురనియును, తానును ప్రేమింతుననియు, నామె అనేకసార్లాలోచించుకొనుచుండును. ఇంకను అనేక దేశముల సుందరప్రదేశముల, ప్రేమతోగూడి సంచారము చేయు చుందు ననుకోనుచుండును.
సుందరరావు పొరుగూరికి, ఒక రోగిని చూచుటకు వెళ్ళియుండెను.మరునాడుదయము వరకును రాడు. సాయంత్రమారు గంటలకుర్తెలు. దాని మీద సుందరరావును వదలి వెళ్ళిపోవుటకు నిశ్చయించుకొని , శశిరేఖ తన వస్తువులను పెట్టెలో నుంచుకొని సుంధరరవునకుత్తరామువ్రాసి, సేవకుని చేతికిచ్చి, తొందర ప్రయాణము తగులుటచే వెళ్ళుచున్నానని చెప్పెను. బండిలో పెట్టె నుంచుకొని రైలునకు బయలుదేరెను. ఆరుగంటలు కావచ్చినది.
సుందరారావింటివద్ద కాంబోట్టను నతడు కాపురముండును. అతనికి కోర్టులో చిన్న యుద్యోగము. సుందరరావు వద్దకు మందుకు వచ్చి నప్పుడు శశిరేఖను చాలాసార్లు చూచియుండును.గాని , ఆమెతో మాట్లాడి యెరుగడు. మొదట చూచినప్పటి నుండియు,శశిరేఖ కతని పై యాసహ్యము సుందరరావుతో నతనింటికి రానివ్వద్దని కూడ చెప్పియుండెను. ఇప్పుడు కాంబొట్టు తన బండి వెనుక రోజుచు పరుగెత్తుకొని వచ్చుచుండుటనుచూచెను.అతని దగ్గరకు వచ్చెను.
కాం - ఎక్కడకో వేడుతున్నారే?
శశి - అవును.
కాం - రైలుకా?
శశి - ఊ.
కాం - పనిమీదనా?
శశిరేఖ తలయుగించెను. తనతోననవసరముగ మాట్లడుచున్నాందులకు కోపమును,అతని ముఖమును జూచిన నసహ్యము నేక్కువగు చుండెను.అతడు బండి వెనకనే నడుచుచుండెను.
కాం - ఏం, పంతులుగారు లేనప్పడేడుతున్నారేం?
శశి - పని తొందర.
కాం - పంతులుగా రేమంటారో!
శశి- నీ కెందుకూ?
కాం - ఏ వూరెడుతున్నారు?
శశి - మీకేం పని?
కాం - ఊరికే అడుగుతున్నాను.
శశి - అనవసరంగా అడగక్కర్లేదు.
కాం - పోనీ, రేపు పంతులుగారు వచ్చిన తరువాత వేల్లకూడదూ? ఇతని మాటలు విచిత్రముగా నుండెను. భయము వేయుచుండెను.
కాం - మీ రిప్పుడు వెళ్ళడం బాగుండలేదు.
శశి - ఎవరికీ?
కాం - ఎవరికిని.
శశి - నాకేం, బాగుండకపోతే?
కాం - నా కనుమానంగా వుంది. మీరు వెళ్ళడానికి వీల్లేదు.
శశి - మీ రేవరాజ్జ్ఞ పెట్టడానికి?
కాం - నా కనుమానంగా వుంది. మీరు వెళ్ళడానికి వీల్లేదు.
శశి - మీ రేవరాజ్జ్ఞ పెట్టడానికి?
కాం - భర్త వూళ్ళో లేనప్పుడు మిరుమిటో తీసుకు వేళ్ళుతోవుంటే చుట్టూ ప్రక్కల వాళ్ళూరు కుంటారా? మీరిప్పుడు వెళ్ళడానికి వీల్లేదు.
శశి - నేను స్వతంత్రురల్ని. మీకుగాని, మీ పంతులుగారికి గాని నన్నపడాని కదికారములేదు. వెళ్ళండి.
కాం - బండివాడా!ఆపరా!
శశి - ఆపకురా, వెళ్ళు.
కాం - ఒరేయ్. నా మాటలు వింటున్నాపుకదా?తరవాత తంటాలు వస్తే నీమీది కొస్తుంది.
శశిరేఖకు యింటికి వెళ్ళడానికి అభ్యంతరంలేదు.సుంధరరావుతో చెప్పి మరునాడు వెళ్లవచ్చుననుకోనేను కాని వీడు తన పంతమే నేగ్గించుకోనవలేనను కొనెను. బండివానికెక్కువ డబ్బిచ్చేదననేను. కానీ వాడు భయపడి బండి తోలలేదు. ఇంతలో బండి చుట్టును జనులు మూగిరి. కూలియిచ్చేదను ఎవరైన తన పెట్టెను రైలువద్దకు తేచ్చేదరేమోనని యడిగెను.కాని కాంబొట్టు మాటవిని ఎవరును సహాయము చెయ్యలేదు. ఇంక యింటికి పోవుట కామెకుమనసు కాలేదు. సుందరరావున కవమానముకాదా? అది గాక వీరందరి ఎదుటను వోడిపోయినటుల యింటికి పోవలేనా? పెట్టె నచటనే వదలి వక్కతేయురైలు స్టేషనుకు బోయెను. కాంబోట్టును వెంటవెళ్ళను. కాని రైలు తప్పిపోయినది.ఏమి చేతునాయని ఆలోచించు కొనుచు అచటనే నిలువబడెను. ఇంతలో ఆస్పత్రి నౌకరు పరుగెత్తుకొని వచ్చెను.
