ఒక గంట అయిన తరువాత మెల్లగ తలుపు తెరచుకొని సుందరరావు తన పరుపు బయటకు తీసుకొని పోవుటకు వచ్చెను. శశిరేఖ త్వరగా ముఖము తుడుచుకొని చిరునవ్వు నవ్వుటకు ప్రయత్నము చేయుచు కూర్చుండెను.
సుంద - ఎంపన్లేదూ? ఏడవడం తప్ప? అ కృష్ణుని తలుచుకొని యేడుస్తూ నన్నుచూచి ఏమిలేనిదానివలె
దొంగావేషం వేసుక్కూచుంటావా?
శశి - మీకు తెలీదూ, నేను ఎవరి కోసం ఏడుస్తానో?
సుంద - జ్ఞాపకం వచ్చింది. నిన్న తమరికొక వుత్తరం వచ్చింది, తమ వితుడి దగ్గిరనుంచి, చదువుకోండి.
అని కోటు జేబులో వెతకి ఒక చించిన కవరును ఆమెపైపడవేసెను.దానిపైచిరునామా ఆమె చూచెను.కృష్ణుని వద్దనుండి.గుండెలు కొట్టుకొనెను.ఎట్లున్నాడో? అతని పై ప్రేమ అణగియున్నాను, జాలి మాత్రము విశేషముగా నుండెను . అతని పేరువిన్నప్పడేల్లను కన్నీళ్ళు కారును. అతడు తన కృతఘ్నతకుచివాట్లు పెట్టెను కాబోలు.లేక ప్రేమ తెల్పుచూ వ్రాసెను కాబోలు ! దానిని సుందరరావేల చదువవలెను?ఇంక నావేశము నాపుకోనలేకపోయేను.
శశి - నా పుత్త్రర మెందుకు చదివారు?
సుంద - (నవ్వి) ఈ పతివ్రతలు వుత్తరాలు చదవకూడదుగావును? వెళ్ళేయేత్తేస్తున్నా వెంటి? శీఘ్రముగా దయచేయ్యి. యోగ్యతాపత్రం కూడా యిచ్చి పంపిస్తాను.
శశి- నాకు వచ్చిన వుత్తరం చదవడానికి మీకు సిగ్గేయ్యలేదూ? ఇంకా మాట్లాడతారు!
సుంద - ఏం, మాటలు మిరుతున్నాయి,నోరుముయ్యి? ఎందుకూ పనికిరానివాడు ఎవడో యింత మహావుత్తరాన్ని....
శశి - అట్టే మాట్లాడకండి. అతని కాలిగోరికి సరికారు మీరు ప్రవర్తనలో.
సుందరరావు కన్ను లేర్రచేసి ఆమెను కొత్తబోయేను. ఆమె చేతులు కట్టుకొని నిల్చుని చిన్న నవ్వు నవ్వుచు -
"కొట్టండి అదొక్కటే తక్కువగా వుంది. కొట్టడమే"
ఆమె చూపులలో దైర్యముచూచి అతని మాట్లాడక వెనుకకు తగ్గి వెళ్ళిపోయెను. ఆమె ఉత్తరము చదువుకోనేను.
శశి,
నిన్ను మరచిపోజాలను. ఎటుచూచినా నీ జ్ఞాపోకమే. ప్రయత్నించుచున్నాను గాని మరుచుటకు దుర్బరమైన వెడనను పోందుచున్నాను. నీపై నాకు కోపముండదు. నీవు మాత్రమేమి చెయ్యగలవు? నీ దగ్గిరకు నేను రావడానికి వీలులేకుండా చేసినావు. ఇంక యవజ్జన్మమున దర్శనమ్తేనలేదు. కదా మనకు?నీ వైనను నన్ను మరచిపోయి సౌఖ్యముగా నున్నావని తల చేదను. నాకు కలిగించిన బాధవంటి బాధను నీ వెన్నడును పొందకుండ యీశ్వరుని ప్రార్దించుచున్నాను.
నిన్ను మరవలేక దుఃఖించు
కృష్ణుడు
శశిరేఖ ఉత్త్రమును హృదయమును నద్దుకొని దుఃఖించెను అయ్యో! ఎంత బాధపడుచున్నాడో అనుతలపు వేదనను కలిగించుచుండెను.ఒక్క కునుకులేక రేయి యంతయును అట్లే నిశ్చేష్టితయ్తే నేలపైపదియున్నది. తెల్లవారకట్ట చల్లని గాలికి కొంచెము నిధ్రపట్టేను. ఇంతలో సుందరరావు కాలితో ఆమెను త్రోసి
" లే, లే, బళ్ళు వచ్చాయి" అన్నాడు.
శశి- అబ్బా, కోంచేముండరూ, తల బాధ్దలవుతోంది.నిద్ధర్లేదు. కళ్ళుమండిపోతున్నాయి.
కోంచేముందురూ?
సుంద- నీవెవణ్ణి తలుచుకుంటూ, రాత్రంతా జాగరణచేస్తే రాణి గారి కోసం నేనాగి వుండాలి
కాబోలు?
శశి - నామీద అంత మాత్రం దయలేదూ. నాకు మీమీద తప్ప ఎవరి మీద ప్రేమ?ఇట్లా
కూచోండి ఒక్కసారి.
సుంద - పో , పో , నీ దోంగావేషాలన్ని? లే, ముందు.
9
ఒక్క సంవత్సరము గడచెను. శశిరేఖ సుందరరావు భార్య కాదని యూరివారు గ్రహించి వారినొక యింటినుండి యింకొక యింటికి వెళ్ళ కొట్టిరి. నౌకర్లు దొరకరు. సహాయమేవరును లేరు.మాటలాడు -టకును మనుష్యుల్తేనను లేరు.ఈ కష్టములలో సుందరరావు క్రూరత్వ మెక్కువయ్యెను. సంభవించుచున్న యీ కష్టములన్నియు శశిరేఖవలననే కలుగుచున్నవని తుదకు అతడు తలచెను.కాని ఆమెను మాత్రమాత డువదలలేదు. ఆమె సౌందర్యమును చూచినఅతనికతితృష్ణ. ఆమె మనసును స్వభావమును అర్ధము చేసికో -నలేక అతడు ఆమెను బాధించుటలో తన అసహయత్వమును చూపుకోనుచుండెను.
తుదకు శశిరేఖకు కూడా ప్రేమ నశింప నారంభించెను. ఇప్పడాతడు తన నేమన్ననులక్ష్యము లేదు.అతడు తనతో దినములకు దినములు మాట్లాడకుండ గడిపిన భయములేదు.కాని ఆమెకు జీవన మేమాత్రమును తృప్తికరముగ లేకపోయెను. శశిరేఖకు సౌందర్య మాహారము. ప్రేమ ప్రాణము ప్రేమలేనిది ఆమెకు సమస్తమును శూన్యముగను, అర్ధవిహినముగను కాన్పించును. ప్రేమ కొరకామె యేమ్తెన సమర్పించును.
ఆమె ప్రేమనంత ప్రేమించుటచే కళారహితమగు జీవితమును గడుపుట దుస్సహముగ తలచెను.అతనికి తన పై ప్రేమ లేనపుడు అతని యింట తానెందు కుండవలెను? ప్రేమ దివ్వమగు ప్రేమ, ఆత్మ నందకర మగు ప్రేమ వదలి యేల నోక్కదినమ్తెన జివింపవలెను? అను తలపులు ఆమెను బాధింపజోచ్చెను. ఇతనినుండివెళ్ళిపోవలేను. కాని యెట్లు? ఎక్కడికి? ఎట్లు బతుకుట? స్వతంత్రముగా జీవించుటకు ఆధారము లేదు కదా? సంఘము తనకే మాత్రమును సహాయము చేయదు కదా?
