అతను చిన్నగా నవ్వాడు.
ఒక్కో అడుగు మెల్లగా వేస్తూ ఆమె మంచం దగ్గరగా వచ్చాడు.
తలతిప్పి బెదిరినట్టుగా చూచింది అతనివైపు.
"ఎందుకా భయం"" అడిగాడు.
ఆమె మాట్లాడలేదు.
కృష్ణమౌళి ఆమె భుజంమీద చేతులువేసి గట్టిగా పట్టుకున్నాడు.
"ఏమిటిది! ముందు చేతులు తియ్యండి" కోపంగా, విసురుగా అతని చేతులు తోసేయబోయింది.
కాని అతను వదిలిపెట్టలేదు.
నా చేతుల్లోంచి ఎలా తప్పించుకుంటావు! అన్నట్టు మరింత పట్టుదల పెరిగిపోయింది అతనిలో.
ఇంద్రసేన కోపంగా లేస్తూ అతని పట్టు విడిపించుకోడానికి చూసింది.
"మర్యాదగా వదలండి" అందే ఆవేశంగా.
"వదలకపోతే!" రెట్టిస్తూనే కోపంగా అడిగాడు.
"చంపేస్తాను" అంది పళ్ళు బిగించి కళ్ళెర్రజేసి చూస్తూ.
"ఆహా" అన్నాడు అతని కనుబొమ్మలు ఆశ్చర్యంతో కుతూహలంగా పైకి లేచాయి.
"పిచ్చి పిచ్చి వేషాలు మానేసి మర్యాదగా బయటకు నడవండి" అంది చేత్తో బయటకు దారి చూపిస్తూ.
"నన్ను ఆజ్ఞాపిస్తున్నావా!" అంటూ ఆమెను విసురుగా దగ్గరకు లాక్కున్నాడు.
అతను లాగిన విసురుకి వెళ్ళి అతని గుండెలమీద పడింది.
అతను నవ్వి రెండు చేతులతో ఆమెను చుట్టేసి దగ్గరకు లాక్కున్నాడు.
"వదలండి ఏమిటిది? ఎవరూలేరని ఇంత ధైర్యం చేస్తారా! నా దగ్గర మీ ఆటలు సాగవు. చంపేస్తాను ముందు బయటకు పోతారా పోరా" అంటూ అరిచింది.
నేను ఏం పరాయివాడ్ని కాదు" సూటిగా చూశాడు ఆమె కళ్ళల్లోకి.
మరి! అన్నట్టు కళ్ళు విప్పార్చి ఆశ్చర్యంగా చూసింది.
"నేను నీ కాబోయే భర్తని, పరాయివాడినని భయపడటం అనవసరం. నువ్వు నా దానివి. నేను నీవాడ్ని."
"గాలిలో మేడలు కట్టకండి" అంది అతని చేతుల్లోంచి బయట పడడానికి గింజికుంటూ.
"అంటే!" నుదురు చిట్లించి అడిగాడు.
"అంతస్తుల విషయం మరిచిపోతున్నావ్" రోషంగా అంది.
"అంతస్తుల విషయం గుర్తుతెచ్చుకుంటే నా దగ్గర నా డబ్బుదగ్గర ఏం కారు."
"మీరనుకుని అలా గర్వపడుతున్నారు. మీది నడమంత్రపు సిరి"
"మీది నీ నాన్నది!" వెటకారంగా చూశాడు.
ఇంద్రసేన కోపంగా చూసింది.
"ఒక్కసారి నువ్వూ, నీ తండ్రి వెనుతిరిగి చూసుకోండి. బ్రతికి చెడి మళ్ళీ పుంజుకున్న వాడ్ని నేను. అందర్నీ కాకాపట్టి చేతులు నులుముకుంటూ ఉంటూ అందరి కాళ్ళక్రిందా గ్రోతులు తవ్వి వాళ్ళని అధః పాతాళానికి తొక్కేసి పుంజుకుని పైకి వచ్చిన మహానుభావుడు నీ తండ్రి! నడమంత్రపు సిరి నీదా, నాదా!" అన్నాడు కోపంగా.
అతని కళ్లు చింతనిప్పుల్లా అయ్యాయి.
"మా సంగతి మీకు ఏం తెలుసు!" రోషంగా అడిగింది.
"తెలుసు గనుకనే చెపుతున్నాను" కటువుగా చెప్పాడు.
"తెలుసు" కోపంగా ప్రతి అక్షరం నొక్కి పలుకుతూ.
"ఏం తెలుసు? ఒకరు అయిశ్వర్యంతో ఉన్నారని లేనిపోని కబుర్లు చెప్పి ఈర్ష్యతో బుకాయించకండి."
"ఎవరిది ఈర్ష్య!" అడిగేడు.
"మీదే ఈర్ష్య కాకపోతే!" హేళన ధ్వనించింది ఆమె కంఠస్వరంలో.
"ఈర్ష్య నీది, మీ నాన్నది. మీ బ్రతుకు ఏమిటో గడిచిన రోజులు ఏమిటో నాకు తెలుసు"
"కృష్ణమౌళీ!" గట్టిగా అరిచింది.
"యింకా గట్టిగా అరువు. యిల్లు అదిరిపోయేలా అరువు. నీకు మీ నాన్నకు పిచ్చెక్కిపోతుంది. ఆ పిచ్చిలో నిజం కక్కెస్తారు" అన్నాడు కోపంగా.
"నా ఇంట్లో ప్రవేశించి నన్నే అంటారా? మీ పని చెపుతాను. ఆడది అంటే అబలకా"దంటూ చెయ్యి పైకి ఎత్తి కొట్టబోయింది.
అతను ఆ చేతిని గట్టిగా పట్టుకున్నాడు.
అతని కళ్ళలో కోపం, కసి, కక్ష చెలరేగసాగాయి.
రెండో చెయ్యి పైకి ఎత్తింది.
ఆ చేతినీ గట్టిగా పట్టుకొన్నాడు.
ఆమె బలమంతా ఉపయోగించి ఒక్క తోపు తోసిందియ అతను క్షణంసేపు అలా నిలబడి చూసి చప్పున ఆమె చెయ్యందుకొని దగ్గరకు లాక్కున్నాడు.
"ఛీ ఛీ మర్యాద లేకుండా" అంటూ అతని చెంప వాయించడానికి ప్రయత్నించింది.
అందుకతను అవకాశం ఇవ్వలేదు. దగ్గరకు యింకా దగ్గరకు లాక్కున్నాడు.
అంతే.
యిద్దరూ క్షణంసేపు అలా ఉండిపోయారు.
ఇద్దరికీ ఆ సమయంలో ప్రపంచం ఒక్కసారి ఆగిపోయినట్టు అయింది.
ఇంద్రసేనకి తను ఎక్కడ ఉందో ఏమిటో గ్రహించుకునే స్థితిలో లేదు.
మనసు మొద్దుబారిపోయింది.
శరీరం అంతా ఎలాగో అయిపోయింది.
ఒంటిలో శక్తి అంతా హరించుకుపోయినట్లు అయింది. కళ్ళు అప్పగించి అతనివేపు అలాగే రెప్పవాల్చకుండా అయోమయంగా మతిపోయినట్టు చూడసాగింది.
కృష్ణమౌళి నవ్వాడు.
ఇంద్రసేన రోషంగా ముఖం తిప్పుకుంది.
అతని చేతిల్లో బొమ్మలా మాటా పలుకూ లేకుండా అలాగే వుండిపోయింది.
