Previous Page Next Page 
శశిరేఖ పేజి 21

సుంద - ఇవన్నీ నీవు కవివలె వర్ణిస్తున్నా ననుకోంటావు  గావును. నేను తప్పఇంకెవరూలేరువినడానికి! ఒక్కసారతని మాట కెదురు చెప్పదు శశిరేఖ. ఎంత వెక్కిరించదు.అవి విననట్లే యురకుండును.
శశి - అబ్బా ఎంత బాగుందండి ఈ గుడి.ఇట్లా దగ్గిరగా కూర్చోరూ? ఎవరూ లేరుగా? ఎంత మాంచి గాలి.రారూ?
ఆమెయే అతని దగ్గిరగాపోయి కూర్చుండెను. అతని భుజము పైచేయి వేసెను.
సుంద - అసలే చమటగా ఉన్నది.ఉండు సరసాలు చాల్లే.
శశి - ఈ రాళ్ళను పైకి ఎట్లా ఎత్తరో  కదా! ఎంత బాగా చేక్కారండి?ఎంత గర్వంగా వుండేదో ఈ పనివాళ్ళకి కాబోలు!అంతా రాజుల అనుగ్రహము.ఒక్క మందిరము ఒక్కగుడి తయారయిందంటే ఎంత సంతోషంతో ఎంత ఉత్సవాలు చేసేవాళ్ళో కదా?
సుంద- ఏదో ఒకటి చేసేవాళ్ళు. ఎందుకట్లా వాగుతావు?
శశి - ఇవి చూస్తే ఆనందం కలగాడంలేదూ? ఆనందం కాదు. ఏడుపు వస్తోంది. అయ్యో! అన్ని పాడుపడ్డాయికదా?నిజంగా మహ రాజ్యమ్తే ఉండాలి ఇది. ఇక్కడంతా స్తేన్యాలుండేవి కాబోలు! వాళ్ళు పనిలేక హాయిగా పడుకువేవాళ్ళు . ఈ మందిరం చూడండి. ఆడవాళ్ళుదీనిమిద  వుండేవాళ్ళు.ఆఖరుసారి  తురకలు నాశనం చేసేటప్పుడు , తుట్టేలో యీగావలె ఒక్క మొగవాడు సంరక్షించేవాడు లేక ఎంత అడలిపోయినారో కదా!ఈ చెరువులు చూడండి. ఎన్ని ఉద్యానవనాలు ఉండేవో!
సుంద - ఇంకా  ఎక్కువ వాగినవంటే నేను ఒంటరిగా వెడతాను.
శశిరేఖ పోరాలివచ్చు తలపులను లోపల కుక్కుకోనేను.
సాయంత్రము తుంగభద్ర వడ్డున మెట్లమీద కూర్చుండిరి.నది వరదలలో నుండెను. నదిమధ్య ఎనుములవలె  స్దిరముగనుండుపరత్వ శిలల తాకి యాడుచు నవ్వుచు ప్రవాహము పొంగి పోరాలుచుండెను.
శశి - చూడండి. పూర్వము ఇక్కడ ఎంత శోభగా ఉండివుండాలో! అక్కడ వంతెన  వుండేదిట. ఈ గట్టున గుళ్ళూ  ఇళ్ళూ ఉండేటపుడు స్త్రిలు  పూజాద్రవ్యాలు పుచ్చుకొని గుళ్ళకి వేడుతూవుంటే, పిల్లలు ఆడుకుంటూ వుంటే వడ్డునంతా  మనకుమల్లె అనేకమంది చల్లగాలికి కూర్చునివుంటే, చాతయిన వాళ్ళు తోలు పడవల్లో యీ ప్రవాహంలో ఆడుతూవుంటే, వూరంతా  విజయధ్వజాల్తో నిండివుంటే, ఎంత బాగుండేది!అప్పుడు మనమూ, మన రాజ్యము, అని గర్వపడుతూవుంటే ఎంత గొప్పగా వుండేది!మన యుద్ధాలు, మన దండయాత్రలు, మన యుద్ధ సన్నద్దాలు, ఎంత తమాషాగా ఉండేది!
సుంద -మళ్ళి మొదలు పెట్టవూ?పోదాంపద యింటికి. ఇంత దూరం నిమాటవిని వచ్చాను బుద్ధిలేక.
శశి - ఇంకొంచెం సేపుండరూ? మళ్ళి ఎప్పడోస్తామో!
సుంద - వస్తావా రావా, నే నోక్కన్నే వెళ్ళనా?
ఇద్దరును కమలాపురము బంగళాకు వెళ్ళిరి. భోజనమ్తెన  తరువాత సుందరరావు బయట కూర్చున్నాడు. శశిరేఖ గదిలో అద్దము ముందు నిల్చుని యున్నది.స్నానముచేసి తలలో పువ్వులు పెట్టుకొని సౌందర్య దేవతవలె కనబడుచున్నది. ఆలోచించునట్లేయుండి,చివరకు సుందరరావు దగ్గరకుపోయి కూర్చుండెను.
సుంద - ఎవరూ లేరుగా చూడ్డానికి?ఎందుకా షోకు?
శశి - ఏవ ఎవరూ లేరూ?
సుంద - తెలివికి సంతోషించారు.
శశి నిధ్ధర్రావటాంలేదూ?
సుంద వొస్తోంది.
శశి అయితే రండి.
సుంద పరుపు బయట పడేయ్యి. వసారాలో పడుకుంటాను.
 శశి - లోపల పడుకోరూ?
సుంద - నీ కెందుకాసంగతి?
శశి - పడుకోరూ? నే నడుగాతున్నాననన్నా!
సుంద -పో!  నా కసహ్య మెస్తోంది. నీ  మాటాలూ నీ వెషాలూ!
శశిరేఖ మెల్లగా లేచి లోపలికి వెళ్ళేను. దినము తరవాత దినమిదియే తటస్దించుచుండెను. శశిరేఖ ప్రేమయే  ఆహారము. అది లేకుండిన ఆమెకు శాంతిలేదు. తనవలన ఏమి నేరమో ఆమెకు తెలియదు. సర్వ విధములు నాతని సంతోష పెట్టకూచెను. అతడు తనతో ప్రేమగా మాట్లడకూడదా? పూర్వమువలె తాన్నోకసారి  యదరింపరాదా?అతనికి తన ప్రాణమునుగూడ  యిచ్చుటకు సంసిద్ధమై యుండెను. కాని తన పైదయతో నొక్క చూపైన చూడడే! ఆమె కొక్కొక్క దిన మొక   మరణముగా నయ్యును.అతనిపైతన కెంత ప్రేమ !అత డోక్కసారి మీద చెయ్యివేసి మంచి మాటలాడినా చాలదా? అదియే కరువయ్యేనా? ప్రేమ కానపడియే కదా అతనిని కోరినది? కాని యేమియును తెలియని చంటిబిడ్డవలె విచారించుట తప్ప శశిరేఖ  కేమియును తెలియదు.  అతడు గాక జీవితమున తనకేవ్వరు?ప్రేమలేక ఆమెకు జీవితము భారముగ తోచెను. శాంతిలేదు. సౌఖ్యములేదు.ఆపరాని దుఃఖముతో  మంచము పైబోర్లపడి వెక్కి వెక్కి యేడ్చేను. ఈ విధముగ రాత్రులు గడుపుట ఆమెకు మామూలే, ఏమియు నేరుంగుటకు లక్ష్యపెట్టక  సుందరరావు నిద్రించుచుండ, ఆమె మాత్రము రాత్రంతయు నిద్రలేక పయికిచప్పడైన నాతనికి కష్టము కలుగునేమోనని, లోపలనే ఏడుపు గ్రుక్కుకోనుచు జాగారము చేయుట ప్రతి రాత్రియు జరుగుచుండెను.తెల్లవారి  సిద్ధముగా  నన్నియు నుంచక ప్రోద్దేక్కి లేచిన చివాట్లు తప్పకపోయెను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS