అంత పెద్ద రచయిత్రి ని కాదు విజ్జీ. మాతృ భాష మీదున్న మమకారం కొద్దీ అప్పుడప్పుడు రాయాలనిపిస్తుంది. అందులోనూ వీటికోసం ఈ మధ్య చాలా వెబ్సైట్, అప్స్ వచ్చాయి. చక్కగా ఆన్లైన్ లో రాయొచ్చు. తీరిక దొరికినప్పుడు, ఇదిగో ఈ బుడుగులు నిద్రపోయినప్పుడు, కాస్త సమయం దొరికినప్పుడు, అప్పుడప్పుడు కొన్ని కవితలు, కధలు రాస్తుంటాను. ఇవి కేవలం నా తృప్తి కోసం అంది శశిరేఖ.
అక్కా ఈ మధ్య సీరియల్ ఏదో మొదలు పెట్టినట్టున్నావ్ ఎలా ఉంది అన్నాడు వినీల్ ఉత్సాహంగా.
ఏదో రాస్తున్నాను రా. పాఠకులకు నచ్చాలిగా. నేనేమీ అంత గొప్ప రచయిత్రిని కాదు. ఎదో వానాకాలం రాతలు నావి. కొందరికి నచ్చుతుంది. చాలామందికి నచ్చదు. నచ్చనివాళ్ళు కొందరు కామ్ గా ఉంటారు. కొందరు మొహంమీదే అబ్బే ఏం బాగాలేదు అని విమర్శ చేస్తారు. అంతటి తో ఊరుకోరు. రేటింగ్ ఐదు కి ఒకటి ఇచ్చి చూస్కో మా తడాఖా అంటారు. దాంతో ఏముంది రేటింగ్ సరాసరి కిందకి జారుతుంది. తమాషా ఏంటంటే తెలుగు తెలియని పరభాషా పాఠకులు కూడా పనికట్టుకుని ప్రతి ఎపిసోడ్ కి ఒకటి చొప్పున వేస్తారు. అందుకనే నేను అవేమీ పట్టించుకోను. నాకు తోచినది రాస్తాను. చదవడం చాలా ఈజీ నే. రాయడం అంటే చాలా కష్టం. దానికి ఎంతో ఓపిక, సమయం కావాలి, మంచి కథ ఎన్నుకోవాలి, పాత్రలను సృష్టించాలి, ఒక చక్కటి టైటిల్ పెట్టాలి, ఇలా ఎన్నో అంశాలు ముడిపడివుంటాయి. సినిమా లానే ప్రతి ఒక్కటి బ్లాక్ బస్టర్ కాలేదు. కొన్ని హిట్ అవుతాయి. అఫ్ కోర్స్ చాలా ఫట్ అవుతాయి.
అబ్బా నీ రచనా వ్యాసంగంలో చాలా తతంగం ఉందక్కా. ఇంత కష్టమని ఊహించలేదు సుమా. నిజమే నువ్వన్నట్లు రాయడం చాలా టఫ్ జాబ్ అన్నాడు. రాయగలగడం ఓ వరమైతే, ఆసక్తిగా చదివించగలగడం ఓ భోగం అన్నాడు వినీల్. అక్కా ఎలా ఉందే ఈ కాప్షన్ అన్నాడు నవ్వుతూ.
ఓహ్ నీక్కూడా మంచి కొటేషన్స్ వస్తున్నాయిరా. నువ్వు కూడా రాస్తావేంటి అంది నవ్వుతూ శశి.
ఆమ్మో వద్దక్కా. ఇప్పుడు నాకున్న పనులు చాలు. అస్సలు టైం లేదు అన్నాడు భయపడుతూ.
ఇప్పుడు బుజ్జిగాడి లిస్ట్ లో విజ్జీ కూడా చేరిందిగా మరి అంది శశి నవ్వుతూ.
విజిత, వినీల్ ఫ్రెష్ అప్ అయ్యి ఎయిర్పోర్ట్ కి బయలుదేరారు.
విజితకి బొట్టుపెట్టి చీర, పండు తాంబూలం ఇచ్చింది. విజిత శశి కాళ్లకు దణ్ణం పెట్టింది.
ఒరేయ్ బుజ్జీ నువ్వు కూడా విజ్జీ తో కలిసి దణ్ణం పెట్టు. ఇద్దరినీ కలిపి ఆశీర్వదిస్తా అంటూ శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని ఇద్దరినీ దీవించింది శశి.
థాంక్స్ శశి అంది విజిత.
మీ జాతకాలు కుదిరేట్లు చేసే బాధ్యత నాది. ఇక్కడ నేను నా దగ్గర కంప్యూటర్ లో ఒకమారు చెక్ చేసుకుని రేపు సాయంత్రానికల్లా నాన్నగారికి పంపుతాను వాట్సాప్ లో. ఇక మీ ప్రయత్నం మీది అంది శశి.
థాంక్స్ అక్కా అన్నాడు వినీల్.
అందరికీ బై చెప్పి ఇద్దరూ కారులో బయలుదేరారు.
వచ్చేప్పుడు ఫ్లైట్ లో అవార్డు తాలూకు ఫొటోస్ అండ్ వీడియోస్ వెబ్సైటు లింక్ ఫ్లైట్ ఎయిర్ హోస్టెస్ ఇద్దరి మొబైల్ కి పంపింది.
అది ఓపెన్ చేస్తే చాలా ఫొటోస్ వీడియోస్ ఉన్నాయి. ఆమ్మో ఇవి సోషల్ మీడియా లో కానీ, పబ్లిష్ కానీ అయితే కొంపలంటుకు పోతాయి.
చూడు విజ్జీ ఒక్క చిన్న పొరపాటు వల్ల ఎంత పని జరిగిందో అన్నాడు వినీల్.
లీవ్ ఇట్ నీల్. అయిపొయింది కదా. ఇవి ఎక్కడా మీడియాలో రాకుంటే చాలు అంది.
ఎందుకైనా మంచిదని ఆ నెంబర్ కి ఫోన్ చేస్తే ఎయిర్ హోస్టెస్ లిఫ్ట్ చేసింది హాయ్ సర్ అంటూ.
ఫోటోలు, వీడియోలు ఎక్కడా పబ్లిష్ చెయ్యొద్దని చెప్పాడు ఆ అమ్మాయికి. మరీ మరీ రిక్వెస్ట్ చేసాడు.
ఆవిడ సరేనని హామీ ఇచ్చింది.
అమ్మయ్య ఒక పెద్ద గండం తప్పింది అన్నాడు వినీల్.
మరి ఇది అంది తన పొట్టపై చెయ్యి పెట్టుకుని వినీల్ వైపు చూస్తూ.
అబ్బా ! నేను పెద్ద తప్పు చేసాను విజ్జీ. మొదటి సారి నా జీవితంలో తొందర పడ్డాను. ఈ రోజుకూ బాధపడుతున్నాను. దానికీ ఏదైనా ఉపాయముంటే డాక్టర్ గా నువ్వే చూడు ప్లీజ్ అన్నాడు.
ఆమ్మో ! అలా అబార్షన్ అవి నేను చేయించుకోను నీల్ అంది.
సరే. ఆలోపు పెళ్ళికి ముమ్మరంగా ప్రయత్నం చేద్దాం అన్నాడు. అతనికి చాలా గిల్టీ గా ఉంది. పెళ్లిలోపు ఈ విషయం బయటపడిందంటే ఆమ్మో ఆ ఊహ తలచుకుంటేనే భయంగా ఉంది వినీల్ కి. తనకు చాలా తలవంపులవుతుంది.
వీలు చూసుకుని నేను మా డాడీకి మన విషయం చెప్తాను మీరేం వర్రీ అవకండి అంతా సవ్యంగానే జరుగుతుంది అంది.
ఓకే అన్నాడు మనసులో దేవుడిని తలచుకుంటూ పెద్ద మొక్కే మొక్కుకున్నాడు.
ఇద్దరూ ఫ్లైట్ లో చిన్ననాటి స్కూల్ కబుర్లు నెమరువేసుకున్నారు. హాయిగా నవ్వుకున్నారు.
విజిత నీల్ చేతిని తన చేతుల్లోకి తీసుకుని అలానే పట్టుకుంది ఫ్లైట్ దిగేవరకు.
వినీల్ కాదనలేదు. అలా ఎందుకో విజితకి అర్ధమయ్యి మనసులో నవ్వుకుంది.
ఎయిర్పోర్ట్ కి విజిత వాళ్ళ కారు వచ్చింది.
ఇంటికి చేరేప్పటికీ టైం ఎనిమిది కావొస్తోంది.
తన బ్రీఫ్ కేస్ తీసుకుని ఇంట్లోకి వెళ్ళబోయాడు వినీల్.
మా ఇంటికి రండి ప్లీజ్. ఇవాళ మా ఇంట్లోనే డిన్నర్ చేద్దురు అంది విజిత.
బాగా అలసటగా ఉంది విజ్జీ. జస్ట్ పండ్లు తినేసి పడుకుంటాను. బై అని చెప్పి లోపలికెళ్ళాడు.
****
స్నానం చేసి, ఫ్రూప్ట్స్ తినేసి తొమ్మిదికల్లా మంచమెక్కాడు వినీల్. తన ఆఫీస్ పెండింగ్ పనులు చూద్దామనుకుని కూడా ఓపిక లేక బాగా నిద్ర వస్తుండటంతో లైట్ ఆఫ్ చేసి పడుకున్నాడు.
పది గంటలకు మొబైల్ మోగుతోంది.
ఇప్పుడెవరు చేస్తున్నారు అంటూ మొబైల్ తీసి చూసాడు. విజిత కాల్ చేస్తోంది.
ఈ టైములో ఎందుకు అయ్యుంటుంది అని లిఫ్ట్ చేసాడు.
నీల్ ! నువ్వు అర్జెంటు గా మా ఇంటికి రావాలి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు వచ్చారు. డాడీ కంగారుగా ఉన్నారు. ప్లీజ్ అంది.
వస్తున్నాను విజ్జీ. కంగారు పడకు. ఏమీ ఉండదు. నేను చూసుకుంటాను అని చెప్పాడు.
డ్రెస్ వేసుకుని పరుగు పరుగు న విజిత వాళ్ళింటికి చేరాడు.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి ఓ ఐదు మంది వచ్చారు. ఇంట్లో సోదా చేస్తున్నారు.
వెంకటరాజు గారు కంగారుగా ఉన్నారు. ఆయనది లేవలేని పరిస్థితి.
మీరు కంగారు పడకండి సర్. నేను చూసుకుంటాను అని చెప్పాడు వినీల్.
ఆఫీసర్స్ ని అడిగాడు విషయం ఏంటని.
విజి ఇండస్ట్రీస్ లో మనీ లాండరింగ్ జరుగుతోందని తమకు ఇన్ఫర్మేషన్ వచ్చిందని అందుకే తాము వచ్చామని వారెంట్ చూపించారు.
వినీల్ తన అన్నయ్యకు ఫోన్ చేసాడు. అతను బెంగళూరు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లోనే కమీషనర్. సీనియర్ ఐ ఏ స్ ఆఫీసర్ అతను. అన్ని వివరాలు అన్నయ్యకి చెప్పాడు.
వినీల్ అన్నయ్య అక్కడికి వచ్చిన ఆఫీసర్ కి ఫోన్ ఇవ్వమని చెప్పాడు.
అతనితో చాలా సేపు మాట్లాడాడు.
ఫోన్ పెట్టేసినతరువాత ఆ ఆఫీసర్ వినీల్ కి చెప్పాడు. ఇప్పటికైతే మా ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ ఏమీ దొరకలేదు . ప్రస్తుతానికి వెళుతున్నామని, రెండు రోజుల్లో వస్తామని చెప్పాడు.
వినీల్ అతన్ని రిక్వెస్ట్ చేసి వాళ్ళకొచ్చిన ఇన్ఫర్మేషన్ కాపీలు తీసుకున్నాడు.
వాళ్లకు థాంక్స్ చెప్తూ ఇది ఎవరో కుట్రపూరితంగా చేసుంటారు సర్. నేను దీని వెనుక ఎవరున్నారో ఈ రెండు రోజుల్లో నేను పట్టుకుంటాను అని ప్రామిస్ చేసాడు.
సరే అని వాళ్ళు వెళ్లిపోయారు.
ఆ హఠాత్ పరిణామానికి వెంకటరాజు గారు చాలా డల్ అయిపోయారు. ఇదేంటి ఒకదాని మీద ఒకటి ఇలా ఇబ్బందులు వస్తున్నాయి అని బాధపడుతున్నాడు.

