Previous Page Next Page 
రాజ హంస పేజి 22

 

    "దిలీప్ కోపమొచ్చిందా?"
    "ఊహు ప్రేమించిన వాళ్ళ మీద కోపం రాదు"
    "మరి?"
    "ఏం లేదు"
    "దిలీప్! యిలా వుంటే ఎంతసేపయినా కదలాలనిపించటం లేదు గాని.....తప్పదు కాబట్టి వెనక్కి తిరిగి వెళ్ళిపోదామా?"
    "అయిష్టంగానే "నీ యిష్టం" అని పెదవుల మీద మరోసారి గట్టిగా చుంబించి చేతులు ఆమె మీద తీసేసి స్టీరింగ్ మీద వేశాడు. కారు రివర్స్ చేశాడు.
    "దిలీప్ మెల్లిగానే పోనియ్ ఊరోచ్చాక చెప్పు" ఆమె ప్రక్కకి జరిగి క్రిందికి వొరిగి అతని వొడిలో తల పెట్టుకుని పడుకుంది.
    ఈ సృష్టికి ....
    "యిలాంటి అనుభావాలవల్లె , ఈ అనుభూతుల వల్లే ఎప్పటికప్పుడు నిత్య నూతనంగా శోభిల్లుతోంది.
    ఓ అరగంట దాటింది.
    "రాజా" అని పిలిచాడు.
    "ఊ" అంది మగతగా.
    "నిద్ర పోతున్నావా?"
    "ఊహు ఈ నిద్రలో ఏం సుఖం వుంది దిలీప్. మనల్ని మరచిపోవటం తప్ప. ఈ నిషాని అనుభవిస్తున్నాను"
    "ఊళ్లోకి వచ్చాం. మళ్ళీ జనం మధ్యలోకి...."
    లేచి కూర్చుని కొంచెం దూరంగా జరిగి జుట్టు సవరించుకుంది.
    "రాజా! హోటల్ కి వెళ్ళి డిన్నర్ తీసుకుందామా?"
    ఆమె తల ఊపింది.
    పది నిమిషాలు గడిచాక పెద్ద హోటల్ ముందు కారాపాడు.
    ఏ.సి రూంలో కొంచెం ఏకాంతంగా వున్న టేబిల్ సెలక్టు చేసుకున్నాక యిద్దరూ ప్రక్క ప్రక్కన కూర్చున్నారు.
    "డిన్నర్ ఆర్డర్ చేశాడు.
    మొదట సూప్ వచ్చింది" స్పూన్ తో యిద్దరూ కొంచెం కొంచెం తీసుకుంటున్నారు.
    "రాజా! రేపు హైదరాబాద్ వేడుతూన్నాను."
    "వెళ్ళి"
    "మరో పదిరోజులు పోయాక వస్తాను"
    "అంతవరకూ ....నువ్వు లేని ఈ వూరిని ఎలా భరించమంటావు?"
    "ప్రేమలో ఎంత విషాదముందో చూశావా?"
    "ఆ విషాదంలో నిషా వుంది. థ్రిల్ వుంది."
    "కాని నువ్వు ప్రక్కన వున్న నిషా థ్రిల్ యింకా గొప్పగా వుంటుందేమో"
    "దిలీప్! నువ్వు నన్నే డిపిస్తున్నావు"
    ఇరవై నిమిషాల తర్వాత యిద్దరూ బయటి కొచ్చారు.
    కారు యింటి సమీపంలో కొచ్చాక అతని చేతిని ముద్దు పెట్టుకుని , బయటకు దిగింది.
    "దిలీప్ లెటర్ రాయి"
    "నీకు యింట్లో యిబ్బంది...."
    "కేర్ చెయ్యను"
    

                                                       *    *    *

    పాండురంగ నిద్రపోలేదు. అన్నం కూడా తినలేదు. అనిల్ మంచం మధ్యలో అమాయకంగా నిద్రపోతున్నాడు.
    కాళ్ళకు సంకెళ్ళు వేసినట్లాగిపోయి, ఒక్కక్షణం వాడి ముఖంలోకి చూస్తూ వుండిపోయింది. ఒక్క క్షణం అంతే.....మనసు రాయి చేసుకుని లోపలి గదిలోకి వెళ్ళి పోయింది. బయటకు రాబోయిన భావతరంగాలు నిర్ధాక్షిణ్యంగా అణిచి వేయబడ్డాయి.
    డ్రస్ మార్చుకుని వచ్చాక "యింకా లైటేందుకు?" అని స్విచ్ ఆఫ్ చేయ్యబోయింది.
    "చూడూ!" అన్నాడు పాండురంగ. అతని గొంతు చాలా,మెత్తగా వుంది.
    "ఏమిటి?"
    "నువ్వేమీ అనుకోకపోతే....నీతో కొంచెం మాట్లాడాలి."
    "నాకు నిద్ర వస్తోంది. అయినా ఏమేమిటో మాట్లాడుకోవటానికి మూడ్స్ కూడా లేవు."
    "కాని....అవసరమైనప్పుడు , అవన్నీ కొంచెం ప్రక్కకి పెట్టాలి"
    అతని ముహంలోకి విసురుగా చూసింది. 'అలాగా అన్నట్లున్నాయి ఆమె చూపులు.
    మంచం మీద కూర్చుని "ఆ ఏమిటో  మాట్లాడండి అంది.
    ఆమె పెడసరి ధోరణి చూస్తే అతనికి మాట్లాడాలనిపించలేదు. కాని ఎప్పుడో ఒకప్పుడు అవకాశం తీసుకోక తప్పదు.
    సాధ్యమైనంత సౌమ్యంగా "చూడూ" అన్నాడు.
    "నాపేరు చూడూ కాదు"
    అతను దెబ్బతిన్నాడు. అయినా సహనం కోల్పో దల్చుకోలేదు. "చూడు రాజహంసా" అన్నాడు.
    "ఆ చూస్తున్నాను చెప్పండి"
    "మనమిద్దరం భార్య భర్తలం అవునా?"
    "అనుకోవాల్సి వస్తుంది. పెళ్ళి అనే తంతు జరిగింది కాబట్టి."
    "పోనీ అందుకోసమైన ఒప్పుకోవాలి కదా"
    "సరే ఒప్పుకుంటున్నాను. మీరు నా మెళ్ళో తాళి కట్టారు కాబట్టి - మీరు నా భర్త, నేను పెళ్ళాన్ని, అయితే ఏమిటి?"
    "కాని మనమిద్దరం ఏ ఒక్క విషయంలోనూ అలా ప్రవర్తిచటం ;లేదు."
    'అది నాకు తెలీదు"
    "తెలీదంటే ఎలా? పోనీ నేనిప్పుడు చెబుతున్నా గనక తెలుసుకో."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS