శశిరేఖ మాత్రము ఒకసారి పొడమిన ప్రేమ సుందరరావు పైపోలేదు. అతని ముఖమును, తెలివిని,శక్తిని చూచినపుడేల్ల ఆమె కాశ్చర్యము. అతని ధనము తనకు సమస్త సౌఖ్యముల నిచ్చుచుండ, ఆమెకు మిగుల గర్వము.కాని సుందరరావామె యెడల చూపు అనరాదము హృదయమును వేదన పరచుచుమడెను. అయినను ఆమె కథని పై కోపమే మత్రమునులేదు. అతనిని నమ్మి వచ్చితినేయను చింతయునులేదు.దిన దినమును ఏమియును క్రోత్తలేక, జివనరహితముగ నడుచు కాలముకన్న అతని క్రూరత్వముతో కూడుకొన్నాను, యీ భయంకర జీవనమే ఆమె కుత్తమముగ తోచాను. అనేకమంది నోవ్కర్లున్నను శశిరేఖయే యింటిపని నంతను స్వయముగ చూచి, సుందరరావున కేక్కడును విసుగుకలగ చేయకుండ ప్రయత్నించుచుండెను.కాని అతనికి తృప్తిలేదు. ఒకనాటి సాయంకాల మతడాస్పత్రినుండి యింటికి వచ్చెను.
శశి - ఈవాళ హంపికి వెళ్ళడం వుందా?
సుంద - తెలిదు.
శశి - పోనీండి, ఇంకోసారి వేల్లోచ్చును. నాకీ వేళ వంట్లో సరిగ్గాలేదు.
సుంద- ఎప్పుడూ ఏదో వకదాన్తో మూల్గుతో వుంటావు.నివోళ్ళు బాగుండలేదని నేను నా ప్రయాణం మానుకుంటాను గావును. తెల్లారకట్టే వెళ్ళాలి.
శశి - ఎందుకంత కోపంగా వుంటారు?
ఎంతో భద్రముగా బట్టలు వేసుకొని తల దువ్వుకొని ఎవడ్తెన చూచినంతనే మోహించునంత యందముగా కనుపడుచూ , ఆమె యతని కోరకు వేచియుండి యుండెను.
సుంద - పాడుదేశం వచ్చాం. ఎంత హాయిగా వుండేది గోవింద పురములో. ఈ మూర్ఖము,పెంకేతనము ఎక్కడా చూడము ఈ జనులు మనుష్యులో, పశువులో తెలిదు. ఉండడానికి ఇల్లన్నా మంచిదిలేదు.
శశి - పోనీండి. ఎట్లాగో ఓలాగు ఉన్నాంగా.
సుంద - ఉన్నాము. వాళ్లకేమో? ఆమె మీ భార్యేనా అని అడుగుతారు. కాదని అనుమనంతోచి మన్ని ఇంట్లోంచి పొమ్మన్నారు. ఆ దేశంలో గవర్నమెంటు యిల్లుండేవి. ఇక్కడ అవన్ని లేవు.
శశి - పోనీండి. వెళ్ళిపోదాం.
సుంద - నీకేం చేపుతావు. ఎక్కడికి వెడదాం? వాళ్ళు అసలు అనుమానం ఎందుకు పడాలి? ఏదో నువ్వె చెప్పి వుంటావు. లేకపోతే నీ టక్కులూ వేషాలూ చూసి, వాళ్ళు అనుమానపడి వుంటారు.
శశి - నన్నెవరు పలకరిస్తున్నారు, నేను చెప్పడానికి?
సుంద - లేకపోతే ఆ పశువు కృష్ణుడు రాసివుంటాడు వీళ్ళకి, ఓర్వలేక.
శశి - ఆయన అల్లాంటి వాడుకాడు.
సుంద - అతన్ని నా ముఖం ముందు వెనక వేసుకు రావడం బహ బాగావుంది. అతని దగ్గరకు వుందకపోయినావూ, నన్నిట్లా ఎడిపించాకపోతే?
శశి రేఖ సుందరరావు దగ్గరకు వచ్చి మెడచుట్టును చెయ్యివేసి.
శశి - ఎవరో విసికిస్తారు మిమ్మల్ని అందుకనే ఇట్లా అవుతారు మీరు అంది.
సుంద - ఈ మునిసిపలు సంఘమంత బుద్దిహినుల్ని ఎక్కడా చూడలేదు నేను. నేను వాడి నౌకర్ని కాబోలును .వంగి సలాములు చెయ్యలేదని చ్తెర్మానికి కోపం. అందరి కాళ్ళు పట్టుకొని నాలుగు వోట్లు తెచ్చుకొని నాలుగురోజులు పట్టపగలు వెలగపెట్టేవాడిక్కూడా అంత పొగరే! ఇంక తక్కినవాళ్ళు చెప్పనే అక్కర్లేదు.వాళ్ళింట్లో ఎవరికన్నా జబ్బుగా వుంటే నేనేమో కంక్కోంటూ వాళ్ళుచుట్టూ తిరగాలిట. ఒకడు వచ్చి ఎంఎం మందులున్నాయో చూపించు ఆస్పత్రిలో అన్నాడు.తెలిసినట్టే వాడికి!అవతలికి నడవమంన్నాను. అందుకని వాడికి నామీద కోపం.
శశి- బాగానే వుంది! మంచివాడే దొరికాడు!పోనిద్దురూ! ఈ పాడుపని మానేద్దురూ, మన ప్రేమ ఉందిగా ఇంకేం కావాలి మనకి!
సుంద -ప్రేమ నీకు రేపు భోజనం పెడుతుంది!పిచ్చి మాటలు రెండు నేర్చింది ఎక్కడో.
శశి - నామాట వినరూ? ఇట్లా చూడండి.ఈ చిర బాగుండ లేదూ? ఆవాశ సాయంత్రం....
సుంద నూరుమంది చూశాను, ఇంతకంటే బాగా కట్టుకొన్న వాళ్ళని. నీకు చాతాకాదు వాతాకాదు.
శశిరేఖ నుండి ఆనందం అనుభవించడం సుంధరరావునకుచేతకాదు.ఆమె ఆత్మ, మనసు అతని కర్ధముకావు. అందుచేత ఆమె కష్టపడడం చూడడంలో ఆనందము సంపాదింప మొదలు పెట్టెను.
తెల్లవారి హంపికి వెళ్ళిరి.శశిరేఖ సౌందర్యమును పూజించు మహా భక్తురాలు. సృష్టియందుగాని మనకులయందు గాని సౌందర్య మామెకు వేర్రినేత్తించును. హంపియం దవచ్చిన బయళ్ళను, రాళ్ళగుట్టను చూచుటతోడనేఆమె కతి యానందము కలిగెను. సుందరరావామెను వెక్కిరించుచున్నాను, ఆమె సంతోష మణగక పైకి ప్రవహించుచుండెను. ఆమె కానందము కలిగిన కొలధిని అతనికి కోపమేక్కువగును.
శశి - ఇక్కడ ఈ గాలేదో సంతోషము కలిగిస్తోంది. ఈ స్ధలము నందే ఏదో మహాత్మమున్నది.చూచండి ఈ చేక్కడము.ఏ కోండనో ఇక్కడ చెక్కివెశారు.పురముమధ్య ఇట్లాంటివివుంటే ఎంత ఆనందంగా వుండేదో? ఆహ!
