Previous Page Next Page 
ప్రేమతో ....వడ్డెర చండీదాస్ పేజి 16

   
                                                                                                                        తిరుపతి
                                                                                                          28-3-03
    రఘుగారికి నమస్తే,
    మీ వుత్తరం అందింది. DAL ప్తె మీ రచన గురించి వాళ్ళు లేవనెత్తిన అంశాలకు విస్తారంగా రాయటం త్వరలో పూర్తి చెయ్యండి -తోందరపడకండా.
    ఆ మధ్య రంగనాయకమ్మ రామాయణ విషవృక్షం  చదివాను.
    కన్యాశుల్కం యిప్పడేక్కడా లేదు తెలుగుదేశంలో. అది రాసిన కాలంలోనే వుత్తర సర్కారాంద్రాలో  తప్పలేదు. పుస్తకాన్ని మదింపు చేసేటప్పుడు ఆ సమకాలిన స్ధితిగతులను  తప్పక పరిగణనలోకి తీసుకోవాలి.
    రామాయణాలు చాలా వున్నాయి. అన్నిటిలోనూ వాల్మికి రామాయణం యెంతో కొంత వుంది. అసలు  రామాయణ ప్రతి లభ్యంకాదు. ప్రక్షిప్తాలెన్నో అతిశయోక్తి  అలంకారలెన్నో .
    వాల్మికి రామాయణంలోని కవిత్వత్వం అటుంచి; ఆనాటి కాలమాన స్ధితిగతులను పరిగణనలోకి తీసుకోవాలి మదింపుచేసేటప్పుడు. వుదాహరణకి- సింహాసనం కోసం తండ్రిని కొడుకు, పెద్ద కొడుకును రెండో కొడుకు చంపటం వాడుకలో వుంది. రామాయణంలో యిందుకు విరుగుడుగా  సూచితమ్తెంది. అలాగే రాజుకి  బహుభార్యత్వం ,  భార్యల విభేదాల  వల్ల  కుటిలత్వల వల్ల  సమస్యలు. వాల్మీకి యీ విషయాన్ని యెంత అవాంఛనియమో వంటి వాటిని సూచించాడు.
    మార్క్పిస్టూలు  నిశితంగా చూస్తారు గాని  ఒకే చిన్న కంతలోంచి చూస్తారు. విస్త్రత పరిధి వాళ్ళకిలేదు.
    (మనలో మాట వాల్మికి రామాయణం భక్తి కావ్యంగా విస్తారంగా వాడుకలోకి వొచ్చింది. భక్తికి రిజనుండదు. అది నమ్మిక.  ఏ దేవాలయమ్తెనా వుండొచ్చు వుండకపోవచ్చు గాని రామాలయం లేని వూరుండదు!)
    యీ మధ్య DD chennai లో గాయత్రిగారి వీణ విన్నాను. వయసు పెరిగింది. ప్రావిణ్యం పెరిగింది. అధ్బుతం. మహదానందంగా అనిపించింది. యిప్పుడు వాయిస్తున్న వాళ్ళలో ఆమెతో సరిపోల్చటానికెవరూ లేరనిపిస్తుంది. నాకంటే చిన్నద్తేనా; ఆమెకి నా వినమ్ర పాదాభివందనం.
    తిరుపతి రేడియో F.M.వినాటానికి ఆహ్లాదంగా వుంటుంది. రోజూ హరివిల్లు అని ముప్పావుగంట సినిమా పాటలు వేస్తారు. వినటానికి ప్రయత్నించి వినలేక- వినటం విరమించాను. నిర్వాహకులు చింబోతులు. వాళ్ళ దగ్గిర అన్ని సినిమాల మంచి పాటలూ వున్నాయి. కాని రెండు డజన్ల చెత్తపాటలు రోజూ అవే అవే వేస్తుంటారు.
    కొందరికి కొన్ని సకారణంగానో  అకారణంగానో  యెందుకో నచ్చావు.BObbyహిందీ సినిమాలో "మ్తే షాయర్ తో నహి" పాట సహించలేను. రాగానే ఆప్ప్ చేస్తాను.
    నా ఆరోగ్యం కొంత కొంత మెరుగవుతోంది. నొప్పి తగ్గినట్లే.
    మీ నలుగురికి శుభాకాంక్షలు
                                                                                                       -వడ్డెర చండీదాస్.

                                                                                                       సాలిళ్ళ తిరుపతి
                                                                                           14-4-03
    రఘుగారికి నమస్తే,
    వివిధభారతి రేడియోలో  కిశోరి అమోన్ కర్ ని  వింటుంటే, మీకు వుత్తరం రాయాలనిపించింది.
    ఆర్నెల్లక్రితం ఆమె పేరు మర్చిపోయాను. రెండు వారాలక్రితం గుర్తొచ్చింది. వెనకటిలా కాక, కొన్ని పేర్లూ విషయాలూ సడన్ గా మర్చిపోతాను. కొన్ని నిమిషాలకో కొన్ని గంటలకో కొన్ని రోజులకో కొన్ని నెలలకో మళ్ళి సడన్ గా గుర్తొస్తుంటాయి.
    యేసుదాస్  కర్నాటక సంగిత కచేరిలిస్తుంటాడు. రికార్డులిస్తాడు. అతని గొంతు లోని సహజ మృదుత్వం మాయమౌతుంది- యాతనపడి పాడటంవల్ల. యీజ్ వుండదు. అతను శాస్త్రీయ సంగీతం  పాడకపోవటం మంచిది. మనం వినకపోవటం మంచిది.
    అభిరుచి వుంటే-సంగీతం; శాస్త్రం తెలియకపోతేనే యెక్కువ గాడంగా తాదాత్మ్య యంగా  అనుభూతించాటానికి  అవకాశం యెక్కువగా వుంటుంది. శాస్త్రం తెలిస్తే సాంకేతికాలు అక్కడక్కడ కొంచెం కొంచెం అడ్డుపడితే పడొచ్చును.
    వారంవారం అఖిలభారత  సంగిత కార్యక్రమంలో కూడా కొందరు చవటలే. యేంత్తేనా  సంగీతం కదా వింటుంటాను.
    కువ్తేట్ విమోచన కోసం తరవాత-యిటివాలి అమెరికా రెండు యుద్దాలలో మొదటి యుద్దాన్ని సమస్త ప్రపంచం సమర్ధించింది; రెండో యుద్దాన్ని వ్యతిరేకించింది. ఐనా....న్యాయమో  అన్యాయమో వక్క వ్యక్తి తన దేశమంతటి సౌభాగ్యాన్ని శాంతిని క్షేమాన్ని కాంక్షించి, అవుదార్యంగా అశాంతిగానె  మౌనిలా దేశం విడిచివెళ్ళిపోయి వుంటే తన దేశం కకావికలుగా సర్వనాశనం కాకపోయేది.
    రాజ్  క  పూర్  తీసిన సినిమాల కథలు నాకు నచ్చావు. వుదాహరణకు  'సంగమ్' పాటలు బావుంటాయి. సినిమాల చిత్రీకరణ బావుంటుంది. నాకు దిలీప్ కుమార్  యిష్టం.
    తెలుగు భాషకి సరితూగేలా చిత్ర లేత గొంతుతో; పదాలను    అత్యంత మృదువుగా  వుచ్చరిస్తాయి ఆమె పెదవులు.(మరింకే భాషలోనూ ఆమె గొంతూ వుచ్చారణ యిలా వుండవు).
    ఆ మొన్న తెల్లారే ముందు క్తెరళీయుల యేషియానేట్ చానల్ లో అతనెవరో  బిలహరి- దొరకునా యిటువంటి సేవ -చాలా బాగా పాడాడు. మంచిగానం వింటే మనసు ఆనందంతో పరవశించి పొంగిపోతుంది పిచ్చిగా!
    మీ నలుగురికి శుభాకాంక్షలు.
                                                                                                        -వడ్డెర చండీదాస్.

                                                                                                      
                                                                                                               తిరుపతి 
                                                                                                             28-4-03
    రఘుగారికి నమస్తే,
    మీ వుత్తరం అందింది. మీ చలం మ్తెదానం వ్యాసాల పుస్తకానికి ముఖచిత్రం అది నచ్చితేనే వేయించండి. నచ్చకపోతే చంద్రకి అప్పగించండి.
    సంజయ్ లీలా బన్సాలి కొత్త హిందీ దేవదాస్ మీరు చూశారు కనక దాని మిద కొంత రాయాలనిపించింది,  నిన్న టివి లో రెండో సారి చూశాక.
    బెంగాలి హిందీ తెలుగు -మూడు భాషలలో (స్తెగల్ దేవదాస్ తో సహా) నేను చూసిన అన్ని దేవదాస్ సినిమాలూ శరత్ బాబు నవల నాదారం  చేసుకున్నాయి. కొత్త దేవదాస్ నావాలకి సంబందం తెగిపోయింది.యిది Uprooted generation కనక యాభయ్ కోట్లు పెట్టుబడి లాభాలతో వసూల్తెంది.
    యీ సినిమా చూడటానికి ముందు శరత్ బాబు దేవదాస్ ని మారిపోవాలి. సినిమా అంతా కళ్ళు మిరుమిట్లు కోల్పుతూ వుంది. దేవదాస్ ది వక పల్లెటూరి జమిందారి  మహాళ్ళలా  లేవు. వెనకటి రాజప్రసాదాలను  తలపింపజేస్తున్నాయి. చంద్రముఖి నివాసం కూడా ఆ తీరులోనే వుంది.
    సినిమా ఆద్యంతం ఐశ్వర్యంతో   తులతూగుతూంది. యింపోర్టేడ్ పడవ కార్లు తప్ప; అన్నిటికి బంగారం పూత పూసినట్లుంది.
    బాన్సాలి శరత్ బాబు నవలకి తిలోదాకాలిచ్చినట్లే  అనుకొవొచ్చు. మరి ఆ పేరూ ఆ కాలం పాత్రలూ కొంత కథా దేనికి; cash చేసుకోటానికి కాకపోతే!
    శరత్ బాబు దేవదాస్, సినిమావాళ్ళ కోసం పుట్టినట్లనిపిస్తుందసలు. బన్సాలి నవలనంటిపెట్టుకునే సొంతంగా  చాలా చాలా కల్పనలతో "గొప్ప దేవదాస్" తియ్యలనుకున్నట్లనిపిస్తుంది. గొప్ప దేవదాస్ తయరవలేదు. కాని  దర్శక ప్రతిభ మాత్రం తెలుగు సిని రంభోరువులంత ఘనం. బన్సాలి గొప్పగా తీశాడు. గొప్ప దేవదాస్ తియ్యలేదు. గొప్ప నటన కోసం చూడకపోతే, గొప్ప సినిమా వక సినిమా గా  గొప్పది.  "దేవదాస్ సినిమా " గా  గొప్పది కాదు.
    దీన్లో అన్ని తెలుగు నాట్యతార మంజుభార్గవి పాదాలంత పెద్దవి. అన్ని అంతా రాజరికాల స్ధాయిలో జరిగాయి. దుస్తులు మల్లీశ్వరి  పాటలంత గొప్పగా వున్నాయి.
    మనందరిలో కళ్ళు సాధారణంగా నల్లరంగులోనో  తేనేరంగులోనో  వుంటాయి. అలాకాక పిల్లికళ్ళు ఐతే ప్రత్యేకం చెబుతుంటారు. పార్వతివి  పిల్లికళ్ళని శరత్ బాబు  చెప్పనందున ఆమెని పిల్లికళ్ళు కావనే అనుకోవాలి. ఐశ్వర్యరాయ్  పిల్లికళ్ళు, పార్వతికి యెబ్బెట్టుగా వున్నాయి. (నల్ల కాంటాక్ట్  లెన్స్ లు పెట్టొచ్చుకదా!)
    దృశ్య  చిత్రీకరణ గురించి ప్రత్యేకం చెప్పుకోవాలి - ఖరీదుగా.
    తాగటమూ కన్నీళ్ళు తప్ప. షారుఖ్ ఖాన్ ముఖంలో  తాగుబోతుతనమూ లేదు విషాదమూ లేదు. చిధ్రత్వం  వుంది.
    అన్ని సినిమాల్లో పార్వతిగా  అందరికంటే సావిత్రి బావుంది. చంద్రముఖి గా, వ్తెజయంతిమాల.
    చాలా ఖరిద్తెన చిత్రమేగాని చిత్రం మొత్తంలో యెక్కడ్తెన; బాపు సీతాకల్యాణంలో  జయప్రదలా  ముగ్ధమోహనంగా  ఎమ్తేనా కనిపిస్తుందేమోనని చూశాను. నిరాశే దక్కింది.
    పార్వతి పెళ్ళికి ముందుకి, తాగటం మొదలెట్టాకా దేవదాస్ స్వభావంలో చాలా తేడా వుంది. బన్సాలి ఇది గుర్తించినట్లులేడు.
    తెలుగు సినిమా రాజమకుటంలోని,  సడిచేయ్యకే  గాలి, సడి చెయ్యకే పాటంత నిస్సవ్వడిగా  దేవదాస్ కి ఎదురుగా  కూర్చున్న చంద్రముఖి; ప్రశాంతంగా,సౌమ్యంగా, అనుకంపనగా  వొ మాట చిన్నగా సూచిస్తే నానా రాభాసగా గాజు సామాను పగలగొడతాడు.యిది తాగటం మొదలెట్టిన తరువాతి  దేవదాస్ స్వభావానికి వ్యతిరేకం. ఆమె అవాక్కయిపోతుంది.
    పార్వతి చంద్రముఖి కలిసి నాట్యం చెయ్యటం బన్సాలి కల్పనా ప్తెత్యనికి  పరాకాష్ట.
    కథలో  వొ విలన్ని చొప్పించటం దేవదాస్ ని యీ కాలం సినిమాలా చేసే యత్నం అనుకోవాలి.
    కొంత మెలోడ్రామా కూడా చొప్పించాడు.
    పార్వతి భర్త, అంత పెద్దపిల్లల  తండ్రిలాగా అనిపించడు. మరికొంత వయసున్నట్లుగా  బాన్సాలి చూపెట్టాల్సింది.
    నర్మగార్బాంగా  వుండాల్సిన సంభాషణలు; అచ్చూ యీ కాలం వాచాలత సినిమాల్లోలాగానె  వున్నాయి.
    యిలాంటి వెన్నో వున్నాయి,గొప్ప సినిమాగా  చేసేందుకు. కాని యివేవి గొప్ప "దేవదాస్" సినిమాను చేయ్యజాలవు.
    యీ కాలపు టేక్నికాలిటిస్  ననుసరించి  చిత్రీకరించినా కొన్ని కథకి పాత్రలకి నప్పవు.
    సంజయ్  లీలా బన్నాలి ఈ కాలాన్ననుసరించి సినిమా బాగా తీశాడు. అవార్డులు రావోచ్చు. కాని దేవదాస్ తియ్యల్సినట్లుగా లేదు.
    కాని బాగా తీశాడు. చాలా బాగా తీశాడు. బన్సాలి దేవదాస్ నయనానందకరం.
    గ్రీష్మ హిమాలయాలంత; వార్షుక నయగారా అంత; శ్రావణ మిసిసిపి అంత; కల్లోల సాగారమంత; మెక్సికో వుగ్ర అగ్నిపర్వతాలంతా; అరకులోయలో  శరద్వెంనేలంత; నాయనానందకరం, బన్నాలి దేవదాస్ .  నయనానందకరం. నాయనానందకరం. నయనానందకరం -అని అనేసే వుందును, బన్సాలి కొంత భిన్నంగా యెదిగి వుంటే!
    యేంత్తేనా  దేవదాస్ కదా ద్రుష్యనందకరంగా  వకసారి చూడొచ్చు.
    యిలా రాస్తుపోతే  యేన్త్నేనా  వుంటాయి. యింతటితో ముగిస్తాను.
    అన్ని సినిమాలూ చూశాక  మళ్ళి మళ్ళి అంటాను: A N R అధ్బుతం; అనితరసాధ్యం -అని .
    మీ నలుగురురికి శుభాకాంక్షలతో
                                                                                                                    -వడ్డెర చండీదాస్.       


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS