Previous Page Next Page 
శశిరేఖ పేజి 17

శశి - కాదు, నేనుపోవాలి, వదలండి. అయ్యో , అయ్యో,వదలండి నేను వుండను. తప్పు. నేను వోప్పకోను. వదల మంటంలేదూ?నేను వుండను. నేను బతకను. అయ్యో.
అని అరచి  అతనిని తోసివేసి  తలుపు దగ్గిరకు వడిగానడిచెను. సుందరరావును మెల్లగా వెంట  వెళ్ళేను. అతనికి వళ్ళు  తెలియుటలేదు.శశిరేఖ వేల్లుటతోడనే అతనికి పిచ్చియేత్తినట్లయ్యేను. ఇంతలో రాత్రి పిట్టవకటి కెవ్వున యరచి శశిరేఖ  దగ్గరగా ఎగిరెను. శశిరేఖ అరచి వెనుకకు సుందరరావు కౌగిలిలోకి వరిగెను.
సుంద - ఏమిలేదు. ఎందుకు భయము? నేను లేనూ? ఎందుకు వణుకుతావు?
శశి - నేను ఒక్కత్తేనూ వెళ్ళలేను,నన్ను మీరు తీసుకువెళ్ళండి ఇంటికి వెడతాను.
సుంద - శశి, నా మిద ప్రేమలేదూ?రా,చూడు, ఈ రాత్రి నిన్ను వదలను.పోనిను.శశి, నన్ను వదలగలవూ? వదలగలవూ?  శశిరేఖ గజగజ వడకు చుండెను. ఆమె మనసామెకు తెలియదు. సుంధరరావామెను  యుపిరాదకుండ మాట్లాడానిక  కౌగలించుకొని,ముద్దు  పెట్టుకొనెను. అతని చేతులు ఆమెను కఠినముగ- కత్తితో కోసినట్లే అంతటను తాకుచున్నవి.
సుంద - రా, ఇంక సందేహించకు.రా. ఈ రాత్రి నిన్ను వదలు తానా, నిన్నిక్కడ   బలవంతంగా నిలిపిస్తాను గాని?
శశి - అయ్యో! రాను,రాను, నామీద దయలేదూ? నన్ను వదలరూ? నేను వెళ్ళాలి, అయ్యో!
సుందరరావామె  మెడను గట్టిగా అదిమి ముఖమును ఊపిరాదకుండ ముద్దుచే  నింపివేసెను.
సుంద - నామీద దయలేదూ? సరే, అంత అయిష్టమయితే!
అని  పెనుగులాడు  శశిరేఖను  వదలి దూరముగ  పోయెను.  శశిరేఖ దగ్గరకువచ్చి అతనిని కౌగాలించకోనేను.
శశి- మిమ్మల్ని వదల్లేను. అయ్యో! వదల్లేను.  నన్ను రానియ్యకండి  దగ్గరికి.నన్ను  తీసుకుని వెళ్ళరూ ? నా మనోహరా,నువ్వే నాకు. ఇంక ఎవరులేరు.మీరు లేంది బతకలేను. రండి రండి, ఇంకెందుకు?      సుందరరావతి   యానందమున ఆమెను   యింటివ్తేపునకు  లాగెను.  పెద్ద  జుట్టు విడి ఆమెను కప్పివేసినది. కళ్ళు కనపడవు.
సుంద - అమ్మా!ఎంత దయ నామీద!
శశి - వద్దు, ఇది తప్పు,  జన్మమంతా మీ దాసినౌతాను. కాని నన్నడక్కండి.  నాకు శక్తిలేదు.బలంలేదు. నన్ను  పోనీండి, నమస్కారము చేస్తాను.
సుందరరా వామెమాటల నర్ధము చేసికొను స్దితిలోలేడు. ఆమె మెడ పై చేయివేసి దగ్గరకు లాక్కొని అడ్డుముగానున్న పడకకుర్చి తగిలి ఆమెను తనతో లాగుకొని దానిపై బడెను.
సుంద - ఇంక మాట్లాడకు.ఇట్లా చూడు.శశి,నా దానవైనావా? ఎంత సౌఖ్యము. నా దానివి.నాదానివి .      అని చేతిని ఆమె వక్షము చుట్టూ వేసెను.
శశి - అయ్యో!కృష్ణా........
ఇంక మాట్లాడకండ రెండు పెదవు లమేస్వరము  నాపెను. చల్లని గాలి వీచెను.పువ్వుల వాసన చుట్టుకోనెను. నక్షత్రములు  ప్రకాశించెను. గాడంధకారము.
                                                                               7   
           
తెల్లవారుచున్నది.  అయిదుగంటలయినది. చల్లని, బడలికలు పోగొట్టు గాలి విచుచుండెను. కోత్తపువ్వులు పూచి  వనమంతయు  అలంకరించినవి.  సన్నముత్యములవలే ఆకులను పువ్వులను మంచు అలంకరించినది. చామంతి,  జాజి,  గులాబీ,పారిజాతము,గన్నేరుపువ్వు లాతోటలో తలలుయూచు చెట్ల పై  ఉయ్యలలూగుచున్నవి. ఆకాశము నుండి గులాబీరంగు   భూమియంతయు కొత్త వస్త్రమువలె  నలంకరించినది.
సుందరరావు పడకగదిలో శశిరేఖ లేచి కూర్చుని తోటవ్తేపు చూచుచున్నది.ఆమె కప్పగొన్న సన్నని యుత్తరియమునుండి  సున్నితము, సుకుమారమును, మృదువునగు  నామె శరిరమంతయును,కానవచ్చుచుండెను.   నున్నని భుజములను, దానిపై  సన్నని ముడతలులేని మెడయును, సౌందర్యమును  పూజించు కవులను  సహితమును అనిమిషులను చేయగల వంపులు తిరిగిన ఆ వక్షమును నల్లని వెంట్రుకలు కప్పచుండెను. ఎర్రగ నలిగిన పెదవి యూరక వాడకుచుండెను. ఆమె మనసిచటలేదు.
రాత్రినుండియు గడచిన  సంగతులన్నియు  తలపునకు వచ్చుచున్నవి. కృష్ణుని తలంచుకోన్నపుడెల్ల ఆపరాని   దుఃఖము పొర్లి పొర్లి వచ్చెను.ఆ గవాక్షమును  అల్లుకోనిన రాధామనోహరి పువ్వుల  వాసనను గాలి లోపలికి కొనివచ్చుచున్నది.సూర్యుని  లేకిరణములు మంచుముత్యముల  వివిధ వర్ణములతో మెరిపించుచున్నవి. కృష్ణుడిసరికి తన కోరిక్తేసిద్ధముగా  నుండును గాబోలు అణు తలపు శశిరేఖ మనసునకు వచ్చినది.తన  స్ధితిని తలచుకొని వేధననాపజాలక మూల్గుచు, నిద్రిచుచున్న సుందరరావు సంగతే మరచి,వెనుక నాతని పైబడెను. అతడును "ఏమి" అనుచు ఉలికిపడి లేచి,ఆమెను తననానుకోను  నటుల కూర్చుండపెట్టి.
"ఎందుకట్లా పడ్డావు?"
శశి -ఏమిలేదు.
సుంద - నాతో చెప్పు. ఏడవకు.ఎందుకూ ఏడుపు?
శశి - నేనిప్పడింటి కెట్లా వెళ్ళను?
సుందరరా వాలోచించుచు అయిదు నిముషములు కూర్చుండెను. 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS