సుంద - అవును. వెళ్ళొద్దు. ఇక్కడేవుండు.
శశి - అయ్యో. కృష్ణుడేమంటాడు?నన్ను విడిచి ఒక్క నిమిషం వుండలేడే! నన్నిక్కడచూచి బతగ్గలడా?అతని దుఃఖము చూస్తే నేనుండగలనా?
సుంద - మరి చేసేదేముంది? పోనీ, అతనిదగ్గరికే వెళ్ళు. ఇక తప్పకపోతే.
శశి - ఇక కృష్ణుడి మొహం ఎట్లా చూడను? వెళ్ళి మాత్రం ఏమి లాభం? ఇంక అతని పాదాలు ముట్టుకోడా -నికతేనా అర్హరాలినా?అయినా మిమ్మల్ని వదలగలనా?
సుంద -నన్నోధల్లెవా?
శశి - ఇంకా అడుగుతారా? వదల గలిగిన దాన్నవుతే యిట్లా యెందుకవుతాను?
సుంద - అయితే ఇప్పుడు మా ఇద్దరిలో నెవరిని వదలవా ఏమిటి? శశిరేఖ ఊరుకున్నది.
సుంద - అతనితో ఇదంతా చెప్పడమెందుకు?అతనిదగ్గిరే ఉండు. నాతోనుస్నేహముగా ఉండు.నా కంతకన్నఏమి అక్కరలేదు?
శశి - కోపముతో అతనిని విదిలించుకొని లేచినది.
శశి - నా సంగతంతే అనుకోన్నారా? మీమీద కృష్ణునికన్న ఎక్కువ ప్రేమకలిగి నన్ను బలవంతపరచినది కాని, లేకపోతే నాచిటికిన వ్రేలు తాకనిచ్చేదాన్నా మిమ్మల్ని? ఎప్పుడు మీ దాన్నయినానో, అప్పడే కృష్ణుడు నా జివితములోంచి తొలిగిపోయినాడు. ఇంక కృష్ణుడితో ఉండలేను. మిమ్మల్ని వదలనూలేను. కృష్ణుడితో ఉన్నా ఒకవేళ మిమ్మల్ని నాదగ్గిరకు రానిస్తానా? నా ప్రాణము ముందు పోవాలి కాని? ఆడవాళ్లంటే ఆదములని మీ అభిప్రాయము కాబోలు. నామీద ఇంత నిచ మ్తెన అభిప్రాయమున్నప్పుడు మీకు నామీద యేమిటి?నేను ఎక్కడిక్కోక్కడికి వెడతాను.
సుంద - శశి, నా తెలివితక్కువను క్షమించు. నన్నేమి చెయ్యమంటావో ఆజ్ఞాపించు.
శశి - మనమిక ఈ వూళ్ళో ఉండకూడదు. మనము కంటికి కనబడకుండా ఉంటే పాపము కృష్ణుడు నన్ను
మరచిపోవడం సులభ మవుతుంది.
సుంద - నేనేట్లారాను? బదలి తెప్పించుకుని రావాలి.
శశి - మరి ఇప్పుడు కృష్ణుడు వచ్చి పిలవడా? ఏమి చెయ్యను?
సుంద - పోనీ నాలుగురోజులక్కడ ఉండు.
శశి - ఎట్లా ఉండను? నేనతని ఇంట్లో ఉండడం మికిష్టమేనా?
సుంద - మరేమీ చెయ్యను?
శశి - నేనై నా వెళ్ళిపోతాను. బదలి అయిన తరువాత మీరు రండి.
సుంద - ఎక్కడికి వెడతావు?
శశి - ఎక్కడికైనాను.
సుంద - తరవాత కృష్ణుడు వచ్చి నీ వెక్కడని నన్నడిగితే?
శశి - అవును. అదొక యిబ్బంది.
సుంద - అదికాదు. వెళ్ళేటట్లయితే మనమిద్దరము వెళ్ళాలి. శలవుకి రాశేశి నేనుకూడా ఈ వాళే వస్తాను మధ్యాహ్నము రైలులో వేడదాము. సామానంతా పంపమని వెనకనుంచి వ్రాస్తాను.ఎవరికీ తెలియ కూడదు వేడుతున్నామని.
శశి - సరే. మరి సాయంత్రము వస్తున్నామని ఇప్పుడే కృష్ణుడికి చిటి వ్రాస్తాను.
మధ్యాహ్నము ఒంతిగంటైనది. సుందరరావు బయటకు పోయి యుండెను. అవసరమైన వస్తువు లోకపెట్టేలో సర్ది శశిరేఖ గదిలో కాగితము కలము ముందుంచుకొని ఆలోచించుచు కూర్చుండెను.
వాలిన సూర్యడామే శిరోజములపై గవక్షములోనుండి దాని కల్లుకోనిన సూర్యకాంతము తిగే ఆకులలోనుండి మేరయుచుండెను. ఆ విశాల నేత్రముల నుండి కన్నీరు జలజల రాలుచుండెను.వెక్కివెక్కి వచ్చు దుఃఖముతో వక్షము కదలుచుండెను.వ్రాత ఒక్క అక్షరంమ్తెనను సాగలేదు. వ్రాయబోవునప్పటికి పోరలిపోరలి దుఃఖమువచ్చి కాగితము, చేతులు తదియుచుండెను తాను చేయబోవు పని న్యాయమా? తన కొరకు జీవితమును పాడుచేసుకొని,చదువు మధ్యలోమాని , కొడుకేంతో సంపాదించు నని గంపెడాశ పెట్టుకోనియుండు తల్లి దండ్రుల నిరాశపరచి,దరిద్రము ననుభవించుచు,తన వెంట సౌఖ్యమని ఎంచుకొని,తోడునీడగ పనిచేయున్నను తన వెంట శశి,శశి యని తిరుగుచు, ఒక్క నిమిషము కనుబడకపోయిన ఎక్కడెక్కడ యని తల్లదిల్లుచు,తనలోనే జీవితము నానందముగల కృష్ణుని వదలుట మంచిదా?ఈ వార్త విన్న తరువాత అతని కానంద -ముండునా? శాంతియుండునా? పిడుగుపడినట్లాతనిప్రాణము నలిగిపోదా?ఒక్కసారిఅట్టి సుగుణ నిధిని స్వార్ధత్యాగిని ష్కపట ని వర్తనుని, ప్రేమవిధిని, అమాయకుని, ఇట్లు వంచించి, నరకమున త్రోసిపోవుటకన్నక్రూరత్వముగాలదా?స్నేహితు లను, బంధువులను,సంఘముకు వదలిన ఇంకేమి కలదు అతనికి తనుగాక? తన ఆనంధముచే, పాధములచే, స్నేహముచే,మంత్రింపబడిన,ఆ నీళ్ళు,చెట్లు, పచ్చిక బయళ్ళు, కాలువలు అతడు చూచుచు,ఆ ప్రేమా దినముల జ్ఞాపకమున, ఎట్టుబ్రతుక గలదు?అతని నంతగా ప్రేమించునటుల కనపడిన తనే అతనిని మోసగించిన అతని హృదయము పగులదా? మనుష్యుల యందలి విశ్వాసము నశింపదా? విశ్వాసము, ప్రేమ, సంతోషముపోయి, అయ్యో ఎట్టి అధమ జీవితమున కూలునోకదా?అటు పై అతను బ్రతికి ఎందుకు? బ్రతకక ఎందుకు? కానీ ఏమి చేయవలెను?ఎట్లు తిరిగి అతని దగ్గరకు పోయి యుందగలదు? తనకు శాంతి యుండగలదు?తనకు శాంతి యుండునా? ఇంక ఆ యింటి పనులు చేయుచు తృప్తినంది యుండగాలదా? హృదయాకాశామందు? క్రొత్త ఆధార్శములు,క్రొత్త ప్రేమవేషములు యుదయించినవి.ఇంక తన విధి వెనుక బోయి తిరవలయును .పూర్వజన్మమును వదలవలయును. నిర్మలము,అమాయకము,వెన్నెలవలె స్వచ్చమునగు కృష్ణుని ప్రేమను వదలి,గూడము, తిక్షణమునగుయీ సుందరరావు ప్రేమను నమ్మి పోవలసినదే. ఎప్పటికిని కృష్ణుడు తనవాడు.అతనిని నమ్మిన ఇంక సంశయమక్కర లేదు. భయములేదు. తనకు బాధ కలుగచేయుటకన్న ప్రానములన్తేనను వదలును.కాని సుందరరావు జూచిన సర్పమును చూసిన రితినిభుయము.ఎంత మంచిగా నున్నను ఇపుడు ఏ నిమిషమున ఎదురు తిరిగి కాటు వేయునో నమ్ముటకువీలులేదు. కాని ఆ భయమే, ఆ మోహమే నామెనాకర్షించుచుండెను.ఆ మహా విషపు మోహమున మ్రాగ్గిపోవలసినదే ఆ మహా మంత్రమును ఆ ఇంధ్రజాలమును, తన ప్రేమ నాహుతి చేయవలసినదే.తాను ప్రేమతో నాటలాడు దినములు దాటిపోయినవి. ప్రేమను పౌడవలె నాలింగనము చేసికోనవలసిన సమయము వచ్చినది.ఇంకపూర్వపుజివనము పనికి రాదు. సంశయరహితముగ జీవన వర్ధిని కొట్టుకొను పోవుటకు సిద్ధముగ నుందవలసినదే.
