Previous Page Next Page 
శశిరేఖ పేజి 16

సుంద - భోజనానికి లేవండి.
శశి -  నా కక్కర్లేదు. క్షమించండి.
సుంద - ఇది న్యాయమేనా? పైగా ఇంటికివచ్చి పస్తు  పడుకుంటారా?
శశి - సరేలేండి, పదండి. నిద్రగా వుంది.
శశి భోజనము నేమాత్రమును చెయ్యలేదు. ఆమె కొరకేంతో జాగ్రత్తగా వంట చేయబడెను. సుందరరావు ముఖము చిన్నపోయినది.   భోజనము తరవాత తాంబూలము వేసికోనుచు, నక్షత్ర కాంతికింద  తోటలో కూర్చుండిరి. శశిరేఖ   చామంతి పువ్వులను చీల్చి రేకులను వెదజల్లు చుండెను.
శశి - శెలవు. పొద్దు పోయింది! వెడతాను.
సుంద - రాణి సేవకున కిచ్చిన ఆజ్ఞను మరచిందా?
శశి - చాలా పొద్దుపోయింది. ఇంకోసారి.
సుంద - మీ యిష్టము. నన్ను నిరాశ చెయ్యడం న్యాయమని తోస్తే-
శశి - సరేలెండి.
శశిరేఖ కూలబడినది. సుందరరావు ఫిడేలు తెచ్చుట కింటిలోనికి పోయినాడు.రివ్వున చల్లనిగాలి విచుచున్నది. చీకటియందు  చెట్లుఇటునటు అ శాంతితో కదులుచున్నవి.  దూరమున పొదల ఆకుల చీకటిలో మిణుగురు
పురుగులు మేరయుచున్నవి.  జాజిపువ్వులవాసన వింత తలపులను మనసున పుట్టించుచున్నది. తల పైనక్షత్రములు దీపములవలె  మండుచున్నవి. ఆరుద్ర నక్షత్రముల గుంపు ఏదో వింత యుద్రేకమును పోడమ చేయు చుండెను.
సుందరరావు ఫిడేలు వాయింపజోచ్చెను. ఆహ యేమి  వాయిద్యము!ఎచటనో దాగి చిన్నప్పుడు మరచిన సుఖ  ధుఃఖముల జ్ఞప్తికితెచ్చు  గానము.
హృదయాకాశామున  సన్నని మబ్బులవలె  యావరించిన యాదర్శముల  వ్యక్తికరించు గానము. నిగూడములగుసర్వ విధములగు నుద్రేకముల నూతన  తిక్షనత్వమున  వెలిగించు గానము. సర్వస్వరముల యందము నొకటి
గూర్చి కంఠమాలికలవలె  యర్పించు గానము. సర్వదుఖఃములను, సందేహములను  ఆలోచనలను,భయములను వదలి
జీవితమును ప్రేమ దేవతాపాధముల  బలియిమ్మని  యుత్సహించుగానము, లోకమున సౌంధర్యముకన్న మించిన దేదియులేదని, వేనోళ్ళ భోదించు గానము.పుణ్యము,పాపము, కర్తవ్యము,  విధి, అధికారము, ఆజ్ఞ, ప్రతిష్ట, పవిత్రత అనునవి మనుజోడు సృజించుకొన్న మాయ  భూతములే కాని ఇంకేమియు కావనియు,సత్యము ప్రేమయే ప్రేమింపదగినది ఒక్క నిముష మ్తెనను సౌందర్యమేనని,  సుందరస్వరముల వర్ణించు గానము. "ప్రేమించు,ప్రేమించు, ఒక్క నిముశామునక్తెనాను సర్వమును  ప్రేమ హొమమున దగ్ధము చేయుమ"ని ప్రోత్సహిందు గానము. సౌందర్యము నశించుచున్నట్లుకనబడినను, తిరిగి తిరిగి హృదయముల మూర్చనందించుట కుద్బవమగు ననియు, సాయంత్రపు ఆకాశ వర్ణములు ఉధయమునను, పున్నమినాటి  వెన్నెల అమావాస్య నక్షత్ర  కాంతియందును, స్త్రి సౌంధర్యము శిశువునను,  మలయమారుతాము శతలత్వము హిమమున, ఆవిర్భావించునని    యాస పుట్టించు గానము. అట్టి,గానము నతడు ధ్వనింప చేసెను. శశిరేఖ  వడలు మరచినది.ఆనందమున  పరవశాత్వము   నోందినది. మనుష్యులోకమునకు, కష్టసుఖములకు,  స్ధూలజడత్వములకు, అది దూరమగునేదో      మహా  సుందర  లోకమున తిరుగుచుండెను. ఒక గంట, రెండు గంటలు,  మూడు గంటలు దాటినవి. ఇంకను సుందరరావు వాయించుచునే యున్నాడు. నిశ్చలతచే నామె యట్లె పరుండెను. గంటలు కొట్టిన చప్పడుకాగా, శశిరేఖ అదిరిపడిలేచెను.
శశి - నేను వెడుతున్నాను.
సుంద - అప్పడే?
శశి ఇప్పుడు కొట్టింది పన్నెండు కదూ? ఇక నేను పోవాలి.
అని లేచెను. సుంధరరావును  లేచెను.
సుంద - వేదతావా? శశి? ఇదేనా ఆఖరుసారి? ఎట్లా బతకను? యీ చీకట్లో నన్ను వదలి పోవడం న్యాయమేనా?
తిరిగి చల్లనిగాలి విసరెను.జాజిపువ్వుల వాసన "వ్తెను"  వలె తల కేక్కునట్లు వచ్చుచుండెను.సంగితధ్వని  యింకను చెవుల వినబడు చుండెను.చుక్కలు మహాప్రకాశమున కండ్లు మిరుమిట్లు గోల్పుచుండెను.సుందరరావు శశిరేఖను  కౌగలించుకొని దగ్గరకు  లాగుకొన్నాడు. ఇద్దరి హృదయములను బాధ యేత్తుచుండునటుల  కొట్టుకోనుచున్నవి. వేడి నిట్టూర్పుతో   గట్టిగ నామె నదుముకోనేను.
సుంద -శశి. ఇప్పడేక్కడికి వేడతావు.ఆస్పత్రి తలుపులు మూశారు.నువ్వు యింటికి వెళ్ళి  వుంటావనుకుంటా -రు వాళ్ళు.ఎక్కడికి పోతావు? ద్తేవము నిన్ను నా దగ్గిరికి పంపింది తెలీడం లేదూ, శశి, శశి,సందేహ మెందుకు? రావూ? శశిరేఖ తల గిర్రని తిరుగుచుండెను.ప్రతి నరమున సంమేటవలె కొట్టుకోనుచుండెను. లోకమునందలి మహాఉద్రేకము  లన్నియు ఆమె శరీరము పోంగుచున్నటుల  తోచుచుండెను. తలపులులేవు.హృదయ చేతనములేదు. మనేకామదోళనములతో బ్రద్ధలగునట్లుండెను.అపరాధమే అనుమహా  విచారము ఒకమూల. అన్నియును నిర్లక్ష్యము చేయు  మహా ప్రేమాగ్ని వదలంతయును!ఆహ  ఎట్టిఆనందము. ఆ కౌగాలించుకోనిన చేతులు వంటినితాకి మండుచుండెను.ఆ హృదయము  తాకుడు నరనరమును పికుచుండెను.  మెడ పై యురము పై అతని  పెదవులు కాల్చుచున్నం ట్లుండెను.ఆ వేడి  యూపిరి ఆమె ముఖమంతయును కప్పచుండెను.
సుంద - ఈ నక్షత్రములు, యీగాలి, యీ పువ్వులు ప్రేమించ మని అరుస్తున్నాయి. తెలియడంలేదూ?నిన్ను  వొదిలి బతకలేను. వినపట్టాంలేదూ ప్రేమవాణి! ఇంక వదలను. రా, రా,నా శశి,  మనోహరి, నువ్వు నా దానవు.రా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS