"ఏమిటి రాకహంసా! ఎందుకు దిగాలుగా వున్నావు? ఏం కావాలో చెప్పు."
"నాకేం కావాలో మీరేం తెచ్చి యివ్వగలరు? అసలు జీవితమే నా చేతి నుంచి జారిపోయింది.
తాను అనుకున్నవి కొనిపించుకుంటూ, తన ధోరణిలో తాను ఉండటమే గాని, అతన్తో ఏనాడూ నవ్వుతూ, హాయిగా గడిపిన క్షణాలు లేవు.
అతనితో ఎక్కడికైనా బయటకు వెళ్ళాల్సి వస్తే నిర్ధాక్షిణ్యంగా నిరాకరించేది.
రాజహంసకు నెల తప్పింది.
"నో! నేను ఎబార్షన్ చేయించుకుంటాను. నాకప్పుడే పిల్లలు వద్దు - అసలు పిల్లలేవద్దు"
"రాజహంసా ప్లీజ్! నా మాట విను. పెళ్ళయ్యాక నిన్నే కోరిక కోరలేదు. అన్నీ నువ్వు చెప్పినట్లే నడుచుకుంటూ వచ్చాను. అమ్మ చాలా వంటరిగా ఫీలవుతుంది."
'అందుకని....మీ అమ్మకోసం నన్ను పిల్లల్ని కనమంటారా?"
"అలా అని కాదు. మన కోసం...."
"మనకోసమైతే యిప్పుడు నాకు అక్కర్లేదు."
"కాని ఆమె తల్లి, ఆమె తృప్తి ని కూడా చూడవలసిన బాధ్యత నాకుంది."
"నాకు లేదు."
ఈ వాదోపవాదాలతో కొన్నాళ్ళు గడిచిపోయింది.అతను బుజ్జగించాడు. బ్రతిమాలాడుకున్నాడు. ఆఖరికి కాళ్లు కూడా పట్టుకున్నాడు.
ఆమె అంగీకరించలేదు.
ఇలా కొంత కాలయాపన జరిగి చివరకు తిరుగులేని నిర్ణయంతో డాక్టరు దగ్గర కెళ్ళేసరికి "ప్రేగ్నన్సీ వచ్చిందని మీరు గుర్తించే సరికే లేటయింది. ఇప్పుడు నిర్ణయం తీసుకునేసరికి యింకా లేటయింది. ఈ దశలో టెర్మినెట్ చెయ్యటానికి వీల్లేదు" అని తేల్చింది.
రాజహంస నాలుగయిదురోజులు చాలా గొడవ చేసింది. అన్నం తినలేదు. అతను బ్రతిమలడటానికి దగ్గరకు వచ్చినప్పుడల్లా నిప్పులు గ్రక్కింది.
చివరకు కొడుకుని ప్రసవించక తప్పలేదు.
8
కొడుకు పేరు అనిల్.
ముద్దుగా, బొద్దుగా అందంగా చక్కగా వుంటాడు .
పాండురంగకు కొడుకంటే ఎంతో ముద్దు, ఎత్తుకుని గారాబం చేస్తూ వుంటాడు.
మీనాక్షమ్మగారికి మరీ ప్రేమ. వాడికి కొంచెం సుస్తీ వస్తే విలవిల్లాడిపోతుంది. అనుక్షణం వాడితోనే కాలక్షేపం.
రాజహంస అంటీ అంతనట్లుగా వుంటోంది.
వాడ్ని ఎప్పుడో గాని దగ్గరకు తియ్యదు. పిల్లవాడికి వీళ్ళు పోయ్యటం, పాలు త్రాగించటం యివన్నీ ఆమెకు తగని చిరాకు. మీనక్షమ్మగారే ఇవన్నీ చెయ్యటం ఆమెకు సుఖంగా వుంది.
ఒకసారి మీనాక్షమ్మగారికి జ్వరమొచ్చింది. మొదట మాములు జ్వరమనుకున్నారు గాని, అయిదారు రోజులకైనా తగ్గక పోయేసరికి డాక్టరు బ్లడ్ టెస్టులు అవీ చేయించే సరికి టైఫాయిడ్ అని తేలింది.
ఆమె మంచం మీద నుంచి లేవలేకపోతోంది.
"రాజహంసా ఆమ్మా బొత్తిగా లేవలేకపోతోంది" నువ్వు కొంచెం సపర్యలు చేస్తే బావుంటుందేమో" అన్నాడు పాండురంగ ధైర్యం చేసుకుని.
రాజహంస అతని వంక విసురుగా చూసింది. "ఈ సపర్యలూ అవీ చెయ్యటం నాకు చేతకాదు. ఇవన్నీ చెయ్యటం కోసం నేనీ యింటికి రాలేదు.
"నువ్వు చెప్పింది నిజమే అనుకో. కాని నువ్వీ యింటి కోడలివి. ఇంటి యిల్లాలుగా నీకెంత అధికారముందో సమయమొస్తే ....అంత బాధ్యత కూడా...."
"ఇలా జబ్బులు చేసిన వాళ్ళకు చాకిరీలు చేసే బాధ్యతా, దాంతో బాటు మీరన్న యింటి యిల్లాలు హోదా , అధికారమూ నాకు అక్కర్లేదు"
"రాజహంసా! ప్లీజ్! అంత కఠినంగా మాట్లాడకు. అత్తగారికి ఆపద సమయంలో సపర్యలు చెయ్యటం....."
"నన్ను రెచ్చగొట్టకండి. అంతగా కావాలనుకుంటే ఓ అయాను పెట్టుకోండి."
పాండురంగస్తబ్ధుడై చాలాసేపు నిస్సహాయంగా చూస్తూ వుండిపోయాడు.
ఆఫీసుకు పదిహేనురోజులు సెలవు పెట్టాడు. తల్లిని కంటికి రెప్పలా చూసుకుంటూ, మందులిస్తూ , అవసరమైన సపర్యలు చేస్తూ, అనిల్ బాగోగులు చూసుకుంటూ సతమతమవుతున్నాడు.
రాజహంస కష్టం మీద వంట మాత్రం చేసేది. అంత కన్నా యింకేం పట్టించుకునేది కాదు.
పాండురంగ లోలోపల ఏమి బాధపడ్డాడో గానీ, బయటకు మాత్రం ఏమీ వ్యక్తం చేసేవాడు కాదు.
రాజీపడటం , భరించటం యివే అతని జీవిత లక్ష్యలేమో.
కొడుకులానే కాదు, ఓ ఆడదానిలా తల్లికి సమస్త శుశ్రూషలూ చేశాడు.
* * *
రాజహంసకు యీ జీవితం బోర్ కొడుతోంది. నిద్ర లేవటం, కాఫీ, పుస్తకాలు, టి.వి. వి.సి.ఆర్ మధ్య మధ్య బయటకెళ్ళి సినిమాలు....
తన జీవితం నిరర్ధకమై పోతుందన్న కసితో ఆమె దహించుకు పోతోంది.
ఏదో చెయ్యాలి. ఏదో చెయ్యాలి. తనది కానీ జీవితం జీవిస్తున్న భావన ఆమెను కాల్చేస్తోంది.
ఓసారి బయట కెళ్ళినప్పుడు పాత స్నేహితురాలు ఊర్వశి ప్రియ కలిసింది. కౌగలించుకున్నంత
చ
పని చేసింది. ఇద్దరు దగ్గరలో వున్న ఐస్ క్రీం పార్లర్ కెళ్ళి ఐస్ క్రీం తింటూ చిన్ననాటి కబుర్లు చాలా చెప్పుకున్నారు.
