సాలిళ్లు తిరుపతి
27-1-03
రఘుగారికి నమస్తే,
మీ వుత్తరం అందింది. యెంతో కాలానికి మిమ్మల్ని చూశాను కదా; చాలా చాలా బాగా అనిపించింది.
అన్ని యేవి యెప్పుడు జరగాలో అప్పుడు జరుగుతాయి.
వేసవికాలం వానాకాలం అసౌకార్యం. వేసవి దుర్చారం. తిరుపతిలో మరి. తిరుపతిలో చలికాలం అతి సులభంగా భారించవోచ్చు. వొక రకంగా ఆహ్లాదకరం.
సంగీతం కచేరిలో పక్కవాధ్యాలలో వొకప్పుడు మోర్సింగ్ కప్పు బెక బెక వుండేదికాదు. (యిప్పుడు కూడా అరుదుగానే లెండి). హిందిలో సంగితదర్శకుడు రవి చాలా మంచి బాణీలిచ్చాడు. కాని రావాల్సినంత పేరు రాలేదు.
సితార్ ది తంత్రినాదం. వీణది మానవకంఠస్వరం. సితార్, యిటివాలి శతాబ్దాలలోనిది. వీణ, చరిత్రకందనంతటి పురాతనం. గోటువాద్యం నాకు అసహ్యం. గోటు, అపభ్రంశపు వీణ. యివ్వాళ తెల్లారే ముందు క్తెరాలి చానల్లో ఆవిడెవరో బాగా పాడింది, శుద్ధ ధన్యాసి. నాకు బాగా నచ్చిన రాగాల్లో శుద్దధన్యసోకటి.
స్వప్నం, అమూల్యాపూర్వనిది. యెంతటి ఆనందమ్తెనా, స్వప్ననందానికి సరితూగదు. మధుర స్వప్నాలు లుప్తమ్తేతే యెంతటి నిస్సారమో! LSD స్ధితి, స్వప్ననందంగా వుంటుందేమో నాకు తెలియదు. (కాని LSD అవాస్తవంతో పాటు అసహజం హానికరం శిదిల హినస్దితి) వాస్తవం కాకపోయినా; స్వప్నం,సహజం, వుత్తేజస్దితి.
వొఠినాదం కూడా నన్ను ముగ్ధుణ్ణి చేస్తుంది. పాశ్చాత్యధారం లేని భారతీయ సంగితమంతా నాకు ప్రాణం. శుభకార్యాలకి వాడే షహ్ నాయ్ నాదంలో విషాదం వుంది!
వివిధభారతి మంచి ఆకాశవాణి కేంద్రం అనే చెప్పొచ్చు. SW transmis- sion power యింక పెంచాల్సి వుంది!
వారం వారం రాత్రి రేడియోలో అఖిల భారత సంగిత కార్యక్రమం వింటుంటాను. తిరుపతి FM రిలే చేస్తుంది. కొన్ని బాగుంటాయి.
రసయోగుల్తేన అజ్ఞాత శిల్పుల ప్రాచిన భారతీయ శిల్పం, ప్రపంచంలోనే అనితర సాధ్యం. ఆ శిల్పం, భారతీయ సంస్క్రుతికి రుజాగ్రస్తం. న్యూనత భావంతో బాదపడుతోంది - అజ్ఞానంగా .
యెవరూ పలికించని జగత్తులోని సంగీతం ఎప్పుడో తప్ప వినటం సాధ్యపడదు. సాదారణంగా యెవరన్నా పలికించిన సంగీతమే వినగలను. శాస్త్రం తెలిసి,అలవాటుగా వల్లించటంతప్ప, చాలా మంది విద్వాంసులకు నాకున్నంత యేకాగ్రత సాంద్రత,అనుభూతి తాదాత్మ్యం లేవనిపిస్తుంది. నాది మౌనం. శబ్దించకుండా నాదబ్రహ్మలకు ప్రణమిల్లుతాను.
నాదం,జగన్మూలం,వూపిరి.
1-2-03
యీ పూట మనసు, రీతిగౌళ రాగంలా పాకుతూ మగతగా వుంది. అంబానిన్ను వినా- అని వెనకేప్పాడో రేడియోకి బాలమురళీకృష్ణ అద్భుతంగా పాడిందిలాగా వుంది. తకదింతకగా వేగంగా చిందేస్తూ,వాతాపి గణపతిం భజే హం -అని ఆయన, చంబేయ్ లు అద్బుతంగా చేడిగుడి ఆడిన దాంతో కలిసి కదలలేకపోతోంది.
రాగాలు వివిధ మనసు పోరలకు సంబందించినవిగా అనిపిస్తుంది.
-వడ్డెర చండీదాస్.
తిరుపతి
15-2-03
రఘురాగికి నమస్తే,
మీ వుత్తరం అందింది. నా ఆరోగ్యం యింకా అలాగే వుంది. మీ వివరణ బావుంది గాని చాలా implicit క్లుప్తంగా వున్నట్లనిపించింది. త్వరలో మీ చలం వ్యాసాల పుస్తకం చూస్తాననుకుంటున్నాను.
మీ నలుగురికి శుభాకాంక్షలు.
-వడ్డెర చండీదాస్.
తిరుపతి
18-2-03
రఘుగారికి నమస్తే,
ఫస్టునుంచి అనారోగ్యం. యింకా కొంతకాలం యిలాగే వుండొచ్చు.
మీ నలుగురికి శుభాకాంక్షలు.
ps. మీ వుత్తరం అందింది. అన్ని సంతోషం కలిగించే సంగతులు రాశారు.మ్తెదానం వ్యాసాలు త్వరగా పూర్తి చెయ్యండి. (రాసే వోపిక లేదు)
-వడ్డెర చండీదాస్.
తిరుపతి
20-3-03
రఘుగారికి నమస్తే,
విలువ్తెనవాళ్ళు, జీవితం అర్ధంతరంగా ముగించుకున్నప్పడు; నా మనసు వికలమౌతుంది. విహ్వలమౌతుంది. వుదాహరణకి-గురుదత్ గితాదాత్ మీనాకుమారి మరిలిన్ మన్రో, అలాగే రేవతిదేవి.
యెక్కువగా ఆడవాళ్ళే యెందుకు ఆత్మహత్య చేసుకుంటారో తెలియదు. సోషియాలజీస్టూలు, స్తేకాలజిస్టూలు పరిశోధించి తేల్చాల్సిన విషయం.
నా అనారోగ్యం యింకా అలాగే వుంది. యేజింగ్ వల్లనట. వృద్దాప్యంలో కొందరికి యిలా వొస్తుందట. మందులు ఆపేశారు. రోజూ పొద్దుట సాయంత్రం అరగంట సెపు మెడకి వ్యాయామాలు, రోజుకి నాలుగు సార్లు నాలుగు అరగంటలు మెడకి వేడికాపడం. సమయం పడుతుండట.
గోదావరికి కావ్యదరణ యెక్కువ.
అందమ్తెనా ఆడవాళ్ళలో కొందరు చిర్నవ్వితే, వెన్నెల విరిసివట్లుంది.
క్రిష్టియనిటి ప్రచారానికి ఖర్చుచేసే డబ్బుతో కొన్ని దేశాలకి తిండిబట్టా వొస్తుంది.
ప్రపంచం ఆయుధాలమిద ఖర్చుచేసే ధనంతో ప్రపంచం అంతటికి సరిపడా తిండి వొస్తుంది.
తెలుగు రేడియో కేంద్రాలతో హ్తేదరబాద్ కి బద్ధకం లేదు. రోజూ గాత్రించటం రానివాళ్ళూ వాయించటం రానివాళ్ళూ వోస్తుంటారు. రేడియోలో ఐదేసి నిమిషాలకి వక రాగం ముగిస్తారు. (సినిమా పాటలా). వక రాగానికి అరగంట వుండాలి.
యాభయ్ ఏళ్ళ క్రితం చలం మహాప్రస్ధానానికి రాసిన యోగ్యతాపత్రం నోటికొచ్చు. (మహాప్రస్ధానం కూడా యిష్టమే.)
మీ నలుగురికి శుభాకాంక్షలతో
- వడ్డెర చండీదాస్
