శశి - ఇదివరకే నాతో ఎందుకు చెప్పలేదు? ఎంత అందంగా వుంది. ఎప్పుడూ వచ్చేదాన్ని, ఇక్కడికి ,నాకు తెలిస్తే, కల్లోకూడా ఇంత అందమయిన తోట వుందనుకోలేదు.
సుంద - నేనూ,మీరూ, సమానంగా ప్రేమించే విషయాలు చాలా వున్నట్టున్నాయే!
శశి - అందమయినధాన్ని చూస్తే నాకింక యేమి అక్కర్లేదు. అందం కోసం యిచ్చేస్తాను. ఈ లోకాంలోవున్న అందమయిన కట్టడాలూ, తోటలూ, పర్వతాలూ చూడాలని వుంటుంది. ఈ దేశములోనే చూడ్డానికి నోచుకోలేదు. ఈ లోకం వున్న అందమయిన మనష్యులందర్తోను స్నేహం చెయ్యాలని వుంటుంది. అంత అందమూ నాది కాకూడదూ? ఎన్ని సార్లో ఆకాశంలో యిట్లాంటి అందం చూసి ధాన్ని నాది అనుకుంటాను. కాని అప్పుడే పోతుంది. లోకంలో అంత అందమూ అంతే గావును!
సుంద - కాదు. మీ మొహం అందం ఎన్నడూ పోదు.
శశి - పోకేంలేండి, ఆగండి నాలుగు నాళ్ళు.
సుంద - నేను చూపిస్తాను లోకంలో సుందర ప్రదేశాలన్నీ రారాదూ? హిమాలయాల్లో మహారణ్యలు, స్వర్గాన్నంటే హిమవత్సిఖరాలు, గంగాయమునా నదీ తీరముల వనాలు, మలబారుసరోవరాలు,కావేరిప్రాంతములు. మీరు చూచి సంతోషించే సంతోషాన్ని నేనున్నూ పొందుతాను.
శశి - ఎట్లా? కృష్ణుడోప్పకోవద్దూ? ముసలివారిద్ధరో?
సుంద - లోపలికి రండి.
తన యిల్లునంతను అతడామెకు చూపెను.
శశి - ఈ పటములెక్కడివి? ఎంతందంగా వున్నాయి ? ఎక్కడ కొన్నారివి? అబ్బా!యీ పటాల్లో ఉన్నటు వంటి చోట్ల వుంటే ఎంత బాగుంటుంది! ఇంక విచారమనే మాట యేక్కడిది?
సుంద - మీతో ఎవరూ ఉండనక్కరలేదూ అక్కడ? ఈ పటాలు కావాలా మీకు?
శశి- వద్దు. ఈ పుస్తకాలన్నిట్లో ఏముంటుంది? ఇవన్నీ మీరు చదివినవే? ఇదంతా వైద్యమె?
సుంద - ఇవన్నీ కధలు.
శశి - అన్ని కధలా? అన్ని చదివారూ? మికేన్నో కధలు వచ్చి ఉండాలి. ఒకటన్నా ఎన్నడూ చెప్పారుకారేం ?
సుంద - మీకంత యిష్టమనుకోలేదు.
శశి - మిరన్ని అట్లానే అనుకుంటారు. మీరు సంగీతం పాడిందాకా నాకంత యిష్టమన్న సంగతి తెలిసింది? ఈవాళ పాడరూ వొకసారి!
సుంద - రాణి ఆజ్ఞాపిస్తూ వుంటే సేవకుడు చేయకండా వుండగలడా? భోజనమ్తేన పిమ్మట అని శలవా?
ససి - (నవ్వుచు ) సరే. ఎంత మంచి వాసన వేస్తోంది. ఇట్లాంటి బంగళాలో వక్కళ్ళూ వుండడం బహుకష్టం . నిద్ర వచ్చేస్తోంది.
సుంద - ఈ బంగాళా అందం నాకు యీరోజున తెలుస్తోంది. పడిన కష్టం ఫలితానికి వచ్చింది. మీ యిష్టం నచ్చినప్పుడు రండి. నేనే పనిమీద నున్నా మిరువచ్చి మీదిలాగే వుపయోగించుకోవచ్చును.
శశి - మళ్ళా రానుగదా-
అని మరిచిపోయి జారి వచ్చెను.
సుంద - ఎందుకు?
శశి - ఏదో అట్లా అనిపించింది.
సుంద - మళ్ళారారా?మీరు నా యందు దయయుంచి రావడంవల్ల నన్ను క్షమించి నా తప్పు మరచినారనుకోన్నాను. కోపము పోలేదా?
శశి - నాకు కోపమసలు రానేలేదు.
సుంద - రానేలేదా, ఎంత అధృష్టవంతున్ని! శశి, శశి, నా మీద ప్రేమ ఉందా? నీకు కోపము రాలేదా?
అని ఆమె యేరుగకముందే ఆమెను కౌగిలించుకొని ముఖమును ముద్దు పెట్టుకొనెను. శశిరేఖ వడలంతయును వనకేను. నిశ్చేష్టితయ్తే నిలువబడెను. కండ్లనీరు కారుచుండెను.
సుంద - ఎందుకు దుఃఖము? శశి, నా మనోహరి, ఎందుకు చెప్పవూ?
శశి - కృష్ణునికి అపరాధము కాదూ? నన్ను నమ్మిన అతన్ని యిట్లా మోసపుచ్చడమా? అది నా మనస్సు కాల్చి వేస్తోంది.
సుంద - ఇన్నాళ్ళూ నువ్వతనిదానివ్తే యుండలేదూ?ఇంకా ఎందుకతనికి?
శశి - ఇట్లాంటి మాటలు నాతో చెప్పొద్దు.
సుంద - కాని వొకటి చెప్పవూ? అతని విషయం అట్లా వుంచి నా ప్రేమ నికిష్టమేనా?
శశిరేఖ తల యుగించెను. "నా శశి " యని అతడమె వక్షమును తనకదుముకుని నోటి పై మెడపై ముద్దులు పెట్టుకొనెను.
సుంద - శశి, నన్నొక్కసారి ముద్దు పెట్టుకోవూ?
శశి - వొద్దు.
అని అతనిని తోసికొని బయటకువచ్చి తోటలో కుర్చీలో కూర్చుండెను. సుందరరావు వెనకగానున్న కుర్చీలో కూర్చుండెను. ఆమె మనసు భగ్గుమని మండిపోవుచున్నది తానుచేసిన పనిని గూర్చి ఆలోచింప ప్రయత్నించేనుగాని , ఆలోచనా శక్తీ పోయినటుల తోచెను. కొట్టుకొను ప్రతి నాదితోను పరువెత్తు తలపులే. కృష్ణుని కేంతకష్టము కలుగునో అణు తలపు మాత్ర మామే మనసును సలసల మాడ్చుచుండెను. వంట సిద్ధమ్తెనది.
