తిరుపతి 20-12-02
రఘుగారికి,
నమస్తే.
టివిలో Music channels లో పాటలు పొరపాటున వకటి అరా తప్ప వెయ్యరు. About to రేలేఅసేడ్ or just released సినిమాల పాటల bits వొస్తాయి, కొన్నాళ్ళు repeatedగా. అదే విదానం మళ్ళి వొచ్చేవాటికి repeat అవుతూంటుంది. అవి సినిమా నిర్మతలిచ్చిన ప్రకటనలు.plus non-film ప్రకటనలు. ఆ ప్తెన అవి pay channels. పడమటి దేశాల్లో ప్రకటనలు తీసుకునే చానల్సు pay channels కాజాలవు. Extremely money - spinning! music channels కి music (of any type ) కి సంబందం లేదు.
ప్రకటనలు, Vjs nuisance లేకండా continuously గా 'SCV'లో (తమిళచానల్) సినిమా పాటలు వొస్తుంటాయి పొద్దుట నుంచి రాత్రి పొద్దుపోయే దాకా. music channelఅంటే అలా వుండాలి!
యేగురుకుంటూ గబగబా కాక, నాజూక్గా నిదానంగా నడిస్తే cat walk చాలా బావుంటుంది. చీరలో; models పొడగారులు కదా, మరి బావుంటుంది.
చిర;mystique Beauty.
వుత్తరాది ఆడవాళ్ళందరి వొంటి నుంచి పరిమళం వొస్తుందని నాకు తెలియదు. హిందీ సినిమా పాటల్లో హిరోయిన్లాందరి వొంటి నుంచి పరిమళం వొస్తుందదేమిటో!
అన్ని భాషల్లో అతి యిష్టమ్తెన వాళ్ళందరి గొంతుల కంటే - నూర్ జహ గొంతు యిష్టం. (పాకిస్తాన్ వెళ్ళిపోవటం దేశానికి తిరనిలోటు.)
ఆ మొన్న వుమామహేశ్వరరావు గారు వొచ్చాడు. ఆంధ్రజ్యోతి దిన పత్రిక తిరుపతి ఎడిషన్ హ్తేదరాబాద్ నుంచట. వ్యాసం తెలుగు చెయ్యండి.
యే కళాకృష్ణా తప్ప మగవాళ్ళు ఆడవేషం కడితే, నాట్యం యెంత బాగా వొచ్చినా, మొహాలు కొజ్జా మొఖాల్లా వుండి నాట్యం రాణించడు. నాట్యంలో పాటు, ముఖమూ ఆకృతి పసందుగా వుండాలి.
మీ నలుగురికి శుభాకాంక్షలు.
-వడ్డెర చండీదాస్.
తిరుపతి
29-12-02
రఘుగారికి, నమస్తే.
వ్యాసం, ICPR లో అచ్చయింది అందింది. దినపత్రికకి పెద్దదేగాని తెలుగు చెయ్యటమ్తేతే చెయ్యండి, చూద్దాం.
మీ నలుగురికి శుభాకాంక్షలు.
ps. తెలుగు చేసి ఆంధ్రజ్యోతి దినపత్రికలో వసంతలక్ష్మి గారికి నేనిమ్మన్నానని చెప్పి యివ్వండి ICPRలో అచ్చయిన కాపితో పాటు. మీరిక్కడ చేస్తున్నట్లు వుమామహేశ్వరరావుగారు చెప్పారట - అనండి. ఆమె బాలగోపాల్ భార్య అనుకుంటాను.
-వడ్డెర చండీదాస్.
తిరుపతి
12-2-03
రఘుగారికి,నమస్తే.
మేజర్ చంద్రకాంత్ సినిమాలో "పుణ్యభూమి నా దేశం నమో నమామి" అని పాడుతూ, పంచేలాల్చిలో కనిపించే NTR అధ్బుతం. అదే పాటలో అల్లూరి సీతారామరాజుగా అనితరసాధ్యం.
తరచులా కాక, తబలా మోత యెక్కువగా లేకపోతే సితార్ వినాటానికి వీలవుతుంది.
(మూడు నాలుగు దశాబ్దాలక్రితం) చలం పురూరవ మొదట రేడియోలో విన్నాను. అద్భుతం. ఆ తరవాత పుస్తకం చదివాను. చదివాక, విన్న అనుభూతి విలువ తగ్గలేదు!
Bank,Bag,cat, carrot, చాట వంటి పదాలలోని 'అ'కారం,'య'కారం కలిసినదానికి గుర్తుగా లిపిలో వొ వొత్తు యింతకాలంగా కల్పించి నియుక్తించని; వెనకటి A.P.సాహిత్య అకాడమి, అదికార భాషాసంఘం,తెలుగు విశ్వవిద్యలయంల అలసత్వమో అజ్ఞానమో తెలియదు. అతి సులభంగా చేసేపని!
ప్రసిద్ది గాంచిన అమర ప్రేమ కథలన్ని చారిత్రకాలు వాస్తవాలు. (ఐతే, జనంలో సాహిత్యంలో యెన్నో వుండొచ్చు) వాటికి తిసిపోకండా, కాల్పనిక కథ అని కాక,వాస్తవగాదలో వ్యవహారంలోకి వొచ్చింది దేవదాస్. డజనుసార్లు వెండితెర కెక్కింది మరొకటేది లేదు-రామాయణ భారతాలు తప్ప. శరత్ బాబు తన పదిహేడో యేట రాశాడు దేవదాసు!
హిందూస్తాని కర్నాటక సంగితాలు రెండూ సమంగా యిష్టం. ముఖ్యంగా, ఆలాపన - హిందూస్తానిలో యెక్కువ యిష్టం. సినిమా పాటలు -హిందీ, తెలుగు రెండూ వొకటే రకం; రెండు రకాలు కాదు.
ఘర్షణ సినిమాలో వాణి జయరాం పాడిన "వొక బృందావనం " పాట వినండి; చూడండి.
మీ నలుగురు శుభాకాంక్షలు.
-వడ్డెర చండీదాస్.
