.png)
ఆమె తెల్లకాగితాలను తీసుకుని రెడీ అయింది. అతను చెబుతున్నాడు, ఆమె రాస్తోంది. గోవిందరెడ్డి కుర్చీలోంచి లేచాడు. ఛాంబర్లో అటూ-ఇటూ తిరుగుతూ చెబుతున్నాడు. ఆమె రాస్తోంది.
”మీరు లంచ్ తెచ్చుకున్నారా?”
”లంచ్ బాక్సా! తేలేదు సార్” అంది.
”అటెండర్ ని రమ్మని చెప్పాల్సింది” అన్నాడు.
వెధవ వేషాలు వేయడానికి సిద్ధపడి వచ్చినవాడు అటెండర్ ని రమ్మని చెప్పాడని స్వప్నకి తెలుసు.
”ఫ్లాస్క్ లొ టీ తీసుకొచ్చాను” అన్నాడు. అతనే రెండు కప్పుల్లో పోసి ఓ కప్పుని స్వప్నకి అందించాడు. ఆమె టీ తాగుతోంది. గోవిందరెడ్డి గుమ్మం వరకూ వెళ్ళి అటూ ఇటూ చూశాడు. టీ తాగి కప్పు పక్కన పెట్టింది.అతను వచ్చి ఆమె వెనక నించున్నాడు.
”చెప్పండి సార్.”
అతను చెబుతూనే ఆమెని శల్య పరీక్ష చేస్తున్నాడు. అతని కళ్ళు ఆమె శరీరంలోని భాగాలని చూడ్డానికి విశ్వప్రయత్నం చేస్తున్నాయి. అతనికి పాదాల కిందనించి వేడి పుట్టుకొస్తోంది. అది శరీరంలోని నరాల ద్వారా ఎగబాకుతోంది. నాలుకతో పెదాలని తడి చేసుకున్నాడు గోవిందరెడ్డి.
ఆమె మెడడమీదుగా చూశాడు. లోనెక్ బ్లౌజ్ లోంచి ఎత్తైన రెండు శిఖరాగ్రాలు. వాటి మధ్య లోయలా సన్నని చారిక. ఆ లోయలో ఒంటిపేట బంగారు గొలుసు మెరిసిపోతూ వేలాడుతోంది.అతని పిడికిళ్ళు బిగుసుకున్నాయి.
అతను విడుస్తోన్న ఊపిరి వెచ్చగా ఆమె మెడకి తగులుతోంది.
స్వప్న తల తిప్పి చూసింది. అతను ఏం చూస్తున్నాడో గమనించగానే తల కొట్టేసి నట్లయింది. పవిటని కంగారుగా సర్దుకుంది. ఒక్క క్షణం అజాగ్రత్తగా వున్నా అరక్షణం పరిసరాలను మరిచినా మగాడు ఎంత హద్దుదాటుతాడో అప్పుడే ఆమెకు అర్ధమైంది. ఆమె లేచి నిలుచుంది. అతని వేపు తిరిగి ఎదురుగా నించుంది. ఏ చెయ్యి తిరిగిన శిల్పో నిద్రాహారాలు మాని చేక్కినట్టున్న మనోహరమైన శరీర సౌష్టవం. ఎత్తులు… వంపులు… సొంపులు…. అతను గమనిస్తున్నాడు….
”నేను వెళతాను” అంది ముక్తసరిగా.
గోవిందరెడ్డి నవ్వాడు. ”ఇంత సేపయింది ఒక్క లెటర్ కూడ పూర్తికాలేదు. ఇది రేపు డిస్పాచ్ కావాలి. కూర్చో!” ఆమె భుజాలను గుచ్చి పట్టుకుని కుర్చీలో కూర్చోబెట్టాడు.
ఉద్యోగం చేసే ఆడవాళ్ళని మంచితనంతోనో, బెదిరింపులతోనో, అధికారంతోనో లొంగదీసుకోవడానికి, లైంగికవేధింపులకి గురిచేసే వాళ్ళు చాలామంది వుంటారు. కానీ పరువుకోసం, కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగాన్ని కాపాడుకోవడం కోసం ఆడవాళ్ళు కంటినించి కన్నీటినీ, గుండెల్లోని దుఃఖాన్ని బయటికి కనిపించనివ్వారు. మనసులో ఏవో చెడు ఉద్దేశం పెట్టుకునే తనని ఆరోజు ఆఫీసుకుకి పిలిచాడని స్వప్న అర్థంచేసుకుంది.
”టేక్ డిక్టేషన్ స్వప్నా! భయపడకు. ఇవన్నీ మామూలే!” అన్నాడు చాలా కాజువల్ గా.
ఆమె కింద పెదవిని పంటితో కొరుక్కుంది.
