Previous Page Next Page 
ఖజురహో - 1 పేజి 6

వాన చినుకులతో తడితడిగా వుంది ఆకాశంటూరిస్ట్ బంగారాలో దిగిన లిన్ దార్టన్ కిటికీ తలుపులు తీసాడు. “ఖజురహో’’ ఇలాకా అంతా చినుగులు పడుతూనే వున్నాయి. వాన చినుకులతో అభ్యంగన స్నానం చేసిన ఖజురహో శిల్పాలు ముసిముసిగా నవ్వుకుంటున్నట్టు అస్పష్టంగా అగుపిస్తున్నాయి. తనింక శిల్పాల దగ్గరకెళ్ళలేదు, స్పర్శించలేదు, పలుకరించలేదు. అప్పటి ప్రధాన శిల్పాచార్యుడు శీలభద్రుడు, అపురూప సౌదర్యరాషి భవాని – వీరిద్దరి శిల్పాలు ఇక్కడే ఎక్కడో కొలువు తీరి వుంటాయి.

“నాకు కూడా తెలియదు గాలించాల’’న్నాడు గైడు. తను డాక్ బంగళాలో దిగగానే గైడుగా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం పిళ్ళై తనకు తానుగా పరిచయం చేసుకుని ఖజురహో పరిసరాల గురించి చక్కగా వర్ణించాడు.

కల్లాకపటం తెలియని వ్యక్తిగా కనిపించాడు. తల్లిదండ్రులతో పోట్లాడి చిన్నతనంలోనే మద్రాసు నుండి పారిపోయి వచ్చాడు. తనకు చారిత్రిక ప్రదేశాలంటే ఇష్టమంటాడు. ఢిల్లీ లోని ఎర్రకోట, ఆగ్రా, ఫతేపూర్ సిక్రీ. గ్వాలియర్ కోటల్లాంటి చోట్ల గైడ్ గా పనిచేస్తూ ఇక్కడ స్థిరపడ్డాడు. దాదాపు 30 సంవత్సరాల నుండి ఇక్కడే వుంటున్నాడు. చెప్పి చెప్పి బాగా పందిపోయాడు.

యాభయ్యేళ్లుంటాయి. పొట్టిగా, సంనకల్లు, లావు పెదాలు, నల్లని దేహచాయ, బట్టతలతో విచిత్రంగా అగుపిస్తాడు పిళ్ళై. గైడ్ గా పనిచేస్తూ చాలా భాషలు నేర్చుకున్నాడు. ‘మద్రాస్ టీ స్టాల్’ దగ్గర పర్యాటకులు చాలా మంది ఉంటారు. అది పిళ్ళైదే. మద్రాసు నుండి ఆండాళ్ అనే అమ్మాయి, ఆవిడ తమ్ముడు నల్లతంబిని వెంటబెట్టుకు వచ్చాడు. వారే టిఫిన్, టీ ఏర్పాట్లు చూసుకుంటూ ఉంటారు. అక్కడ చారిత్రిక విశేషాలను గురించి కథలుగా అల్లి చెప్పడం పిళ్ళై విశిష్టత. ఎంత ఇస్తే అంత, ఎక్కువ ఇవ్వమని అడగడు. ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు.

మద్రాసు టీ స్టాల్లోని ఇడ్లీ, టీ అక్కడ చాలా ప్రసిద్ధి. తను అక్కడ ఉండేంతవరకూ ఎక్కడికీ వెళ్ళవద్దని లిం దార్టన్ పిల్లిని కోరగా సరేనన్నాడు. “మీ గురించి చెప్పండ’’ని మాటిమాటికీ అడిగేవాడు. ఒకరోజు లిన్ దార్టన్ యిలా చెప్పాడు.

“నేను పుటింది ఒకటికి, పెరిగింది మరొకరి ఒడిలో. ఊపిరి పీల్చుకుంది అమెరికాలు, చెప్పుకోవడానికి చాలామంది వున్నా ఎవరి దారి వారిదేనన్న నిజం తెలుసుకోవడానికి ఎక్కువ కాలం పట్టలేదు. తీరికలేని పనులతో డాడి బిజీ, తీరని కోరికతో మమ్మి బిజీ. వారిద్దరి మధ్య మిగిలిపోయిన ఒంటరి జీవితం నాది. తెగిన గాలిపటం ఏ కొమ్మకు తగులుకుంటుందో చెప్పలేం. ప్రస్తుతం నీ చేతికి చిక్కాను’’ అంటూ నవ్వాడు లిన్ దార్టన్.

“దొరవారు నిండా నల్లమైండ్వారుగా ఉండారు. మీ ప్రోగ్రాం చెప్పండి. నాను బై ఆల్ మీన్స్ నిండా కో ఆపరేషన్ ఇచ్చి తోడుగా ఉంటా’’ తమలపాకుకు నున్నం పట్టించి దాన్ని నోటిలో ఓ ప్రక్కకు తోసేశాడు పిళ్ళై.

“చూడు పిళ్ళై! ఖజురహో శిల్పాలంటే మా విదేశీయులకు చాలా ఇష్టం. ఈ శిల్పాలు నిజంగా ఫెంటాస్టిక్. నీరవతను కప్పుకున్న ఈ అందమైన శిల్పాల వెనుక ఏదో విషాదం, మరేదో అర్థంకాని రహస్యం దాగుందని నా మనసు చెబుతోంది. నీవు చాలా ఏళ్లుగా ఇక్కడ వుంటున్నావు. ఇక్కడ వింత సంఘటన ఏదైనా జరిగిందా?’’

“విచిత్రమా అంటారా? ఈ కోయిల్ నిండా రహస్యందా ఉంది. శీలభద్ర, కుట్టి భవానీ రెండు పెరియమూర్తులు ఎక్కడో ఉండాలి, వెదికిదా పట్టుకోవాలి. నాన్ తప్పకుండా దానిని పట్టుకునిదా నిద్రపోను’’

“అది సరే ముందు వారిద్దరి కథ చెప్పవా?’’

“ఒందు ఫారిన్ సిగరెట్ ఇచ్చుకోండి. కథ మొదలుపెట్టుతా. దొరవారు మంచిగా వినండి.’’

అంటూ ఖజురహో శిల్పాల వెనుక దాగిన విచిత్ర కథను పిళ్ళై ప్రారంభించాడు. భాష మారింది-కథయిలా మొదలైంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS