ఆదాయం - 5 వ్యయం - 14 రాజపూజ్యం - 6 అవమానం - 3

గురువు ఉగాది నుండి ది. 1-6-2026 వరకు భాగ్యస్థానమున రజతమూర్తిగా సంచరించి సామాన్య ఫలితములు ఇస్తాడు. తదుపరి 31-10-2026 నుండి దశమ స్థానమున తామ్రమూర్తిగా, అనంతరం 24-1-2027 వరకు లాభస్థానమున రజతమూర్తిగా, ఆపై మరల ఉగాది వరకు దశమ స్థానమున సువర్ణమూర్తిగా సంచారముచేయును. శని ఉగాది నుండి మరల ఉగాది వరకు షష్టమ స్థానమున సువర్ణమూర్తిగా సంచరిస్తాడు.రాహు–కేతువులు ఉగాది నుండి ది. 6-12-2026 వరకు సామాన్య ఫలితములు ఇచ్చి, తదుపరి ఉగాది వరకు సువర్ణమూర్తులుగా సంచరించుదురు. ఈ కాలములో ఆర్థిక లోటు నుండి కొంత ఉపశమనం కలుగును. ఈ రాశి స్త్రీ–పురుషులు, రైతు సోదరులకు సామాన్య ఆదాయం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులకు నిల్వ ధనము ఎక్కువగా ఖర్చు అవుతుంది. లాయర్లు, డాక్టర్లు, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించవలెను. ఎవరికీ హామీలు ఇవ్వరాదు. బిగ్ ఇండస్ట్రీ వారికి అనుకూలంగా ఉంటుంది. స్మాల్ ఇండస్ట్రీ వారికి సామాన్య లాభములు మాత్రమే. గురు–శని–రాహు గ్రహాలు పూర్తిగా అనుకూలంగా లేకపోవుట వలన గ్రహ కలయిక బలహీనంగా ఉంటుంది. తెలియని భయాలు, మిత్రులు విరోధులుగా మారుట, బంధువులతో విభేదములు కలగవచ్చు. ఉద్యోగస్తులకు ఏసీబీ సంబంధిత ఇబ్బందుల సూచనలు ఉన్నాయి.

వాస్తు దోషములు కలిగిన గృహాలలో నివసించువారికి కొంత అశాంతి ఉంటుంది. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదములు కలుగవచ్చు. వృత్తి, వ్యాపార రంగములలో అనుకూలత తక్కువగా ఉండి అవమాన సూచనలు ఉన్నాయి. సినిమారంగానికి సంబంధించిన వారికి సామాన్య ఫలితములు. ప్రతి విషయంలో ఏదో ఒక ఆటంకం ఎదురవుతుంది. ఈ దోషాలకు పరిష్కారంగా నవగ్రహ జపాలు, దానాలు చేయవలెను. అవకాశం లేనివారు 45 రోజులు ప్రతిరోజూ45 నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి. అనంతరం శివాలయంలో కాళ్లు కడిగి ప్రదక్షిణలు చేసి, మళ్లీ కాళ్లు కడిగి శివాలయం చుట్టూ 21 ప్రదక్షిణలు చేసి తీర్థం తీసుకొని ఒక నిమిషం కూర్చుని ఇంటికి వెళ్లవలెను. ఆర్థిక స్థితి అనుకూలించనివారు మహాన్యాస రుద్రాభిషేకం చేయించలేని పరిస్థితిలో “ఓం నమః శివాయ” నామజపం 108 సార్లు చేయవలెను. ఇది కొంత ఊరటనిస్తుంది. శ్రద్ధ, విశ్వాసంతో ఆచరించినపుడే ఫలితములు కలుగును. అనుమానం ఉన్నచో
అనుకూలత రాదు.ఎవరికైనా హామీలు ఇచ్చినచో చిక్కుల్లో పడగలరు. తక్కువగా మాట్లాడి, ఎక్కువగా పనిచేయుట వలన క్రమంగా మంచి రోజులు వస్తాయి.

చిత్తనక్షత్రం వారు పగడం ధరించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలు చేయాలి. ఓం శరవణభవ నమః జపం 1008 సార్లు చేయవలెను. స్వాతి నక్షత్రం వారు గోమేధికం ధరించి దుర్గాదేవి పూజలు చేయాలి. కుంకుమతో అష్టోత్తర సహస్రనామ అర్చనలు శుభప్రదం. విశాఖ నక్షత్రం వారు కనకపుష్యరాగం ధరించి దక్షిణామూర్తికి, సాయిబాబాకు పూజలు చేయాలి. గురువుకు శనగలు, గుగ్గిళ్లు ప్రసాదంగా స్వయంగా తయారుచేసి పంచాలి. ఇవి ఆచరించుట వలన మానసిక ఒత్తిడి తగ్గును. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగును. శత్రువుల బలం క్రమంగా తగ్గి ఒత్తిడి తగ్గుతుంది. ధ్యానం, యోగం, ఆక్యుప్రెషర్, అఖండ దీపారాధన, నిరంతర శ్రీరామ నామస్మరణ, ఇష్టదేవత పూజలు సంతృప్తిని ప్రసాదించును. అదృష్ట సంఖ్య– 6.


More Rasi Phalalu 2026 - 2027