ఆదాయం - 5, వ్యయం - 5, రాజపూజ్యం - 7, అవమానం - 7

గురువు ఉగాది నుండి ది. 1-6-2026 వరకు లాభస్థానంలో తామ్రమూర్తిగా సంచరించి, తదుపరి ఉగాది వరకు వ్యయస్థానంలో సువర్ణమూర్తిగా సంచారము చేయగలరు. దీనివలన ఆరోగ్యం, ఆయుష్షు కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. శని ఉగాది నుండి మరల ఉగాది వరకు అష్టమస్థానంలో లోహమూర్తిగా సంచారము చేయుట వలన మానసిక ఒత్తిడులు, ఆలస్యములు కలుగవచ్చు. రాహు– కేతువులు ఉగాది నుండి 5-12-2026 వరకు సామాన్య ఫలితములు ఇచ్చి, తదుపరి ఉగాది వరకు తామ్రమూర్తులుగా సంచరించుచుసామాన్య ఫలితములతోపాటుఆధ్యాత్మికఆసక్తిని పెంపొందించగలరు.

ఈ రాశి స్త్రీ–పురుషులు, ముఖ్యంగా రైతు సోదరులకు ముహూర్తబలంతో అనుకూలమైన దిగుబడులు రావచ్చును. వృత్తి, ఉద్యోగ, వ్యాపారములలో ఆదాయం ఎంత వచ్చినా ఖర్చులు కూడా అంతే స్థాయిలో
ఉండును. లాయర్లు, డాక్టర్లు, కాంట్రాక్టరకు్ల ఇది అనుకూల కాలము. రాజకీయ నాయకుల మధ్య అభిప్రాయ భేదములు తలెత్తగలవు. భార్యాభర్తలు పరస్పర అవగాహనతో వ్యవహరించినచో విజయం సాధించగలరు. బంధుమిత్రుల కలయికతో ఆనందం, గృహయోగం కలుగును. అలంకారము, ఆర్భాటమునకు ప్రాధాన్యత ఇస్తారు. ఆధ్యాత్మిక విషయములపై ఆసక్తి పెరుగును. పెద్దపరిశ్రమల వారికి
అభివృద్ధిదిశగా అవకాశాలు కనిపించును. చిన్న పరిశ్రమల వారికి సామాన్య ఫలితములు. వెండి, బంగారం, ఇనుము, సిమెంట్, కంకర, టేకు మొదలైన వ్యాపారాలలో ధరల ఊగిసలాట అర్థంకాని
పరిస్థితులు కలుగును. అపరిచిత వ్యక్తుల వలన మోసములు జరిగే అవకాశమున్నది. ఆకస్మిక ధనలాభం ఆశించి ఎవరి మాటలు నమ్మకూడదు; నమ్మితే మోసపోవచ్చును. సమాజంలో గుర్తింపును పెంపొందించుటలో జాగ్రత్త అవసరం. ప్రతి విషయంలో తొందరపాటు వలన అనేక సమస్యలు తలెత్తుతాయి. ఆగి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం శ్రేయస్కరం. గ్రహ కలయికలలో వ్యత్యాసం వలన తెలియని ఒత్తిడి, ఆందోళన పెరిగి అనారోగ్య సమస్యలు కలుగవచ్చు. భార్యకు అనారోగ్యం, పిల్లలకు మానసిక ఒత్తిడి కలిగే సూచనలు ఉన్నాయి. గృహంలో ఉద్రేక భావాలు లేకుండా పిల్లలతో ప్రేమగా వ్యవహరించి వారిని మంచి మార్గంలో నడిపించాలి. స్వదేశంపై ఆసక్తి తగ్గి విదేశ వ్యామోహం కలగవచ్చు. వీరిని ఉద్రేకపరచరాదు.

అపరాలు, నిత్యావసర వస్తువుల ధరలు వ్యాపారస్తుల చేతిలో అనవసరంగా పెరిగే అవకాశమున్నది. కిరాణా, ఫ్యాన్సీ, స్టీల్, వస్త్ర, కూరగాయలు, పూల వ్యాపారస్తులకు ఆదాయం కనిపించినా ఆ ధనం ఎటుపోతుందో తెలియని పరిస్థితి ఉంటుంది. కారణం ఆర్భాట వ్యయం. తొందరపాటు మాటల వలన వాగ్వాదాలు జరగవచ్చు. గ్రహబలహీనత వలన జారిపడుట, యాక్సిడెంట్లు, ఎముకలకు సంబంధించిన
సమస్యలు కలుగవచ్చు. ఆకస్మిక పరిస్థితుల వలన ఖర్చులు పెరుగును. వాత సంబంధ వ్యాధులు ముఖ్యంగా స్త్రీలకు ఇబ్బందులు కలిగించగలవు.

నక్షత్రాల వారీ పరిహారములు: మఘ నక్షత్రం వారు జాతి వైఢూర్యము ధరించి, వినాయక, సరస్వతి, చిత్రగుప్తుల అష్టోత్తరాలు చేయవలెను. పుబ్బ నక్షత్రం వారు జాతి డైమండ్ ధరించి, లక్ష్మీదేవి పూజలు, కనకధార స్తోత్ర పారాయణ చేయవలెను. ఉత్తర నక్షత్రం వారు జాతి కెంపు ధరించి, ఆదివార నియమాలు పాటించాలి. ఆదిత్యహృదయం పారాయణ, సూర్యనమస్కారములు చేసి సూర్యారాధన చేయాలి. నవగ్రహ ప్రదక్షిణలు, జపాలు, దానాలు, మహాన్యాస రుద్రాభిషేకం చేయవలెను. గృహములో
అఖండ దీపం వెలిగించుట వలన మానసిక ఒత్తిడి తగ్గును. యోగ, ధ్యానం, ఆక్యుప్రెషర్, ఆయుర్వేద
చికిత్సల వలన నయముకాని వ్యాధి అనేది ఉండదు. సంపూర్ణఆరోగ్యం పొందగలరు. అదృష్ట సంఖ్య: 1.


More Rasi Phalalu 2026 - 2027