ఆదాయం - 14 వ్యయం - 11 రాజపూజ్యం - 5 అవమానం - 6
గురువు ఉగాది నుండి 1-6-2026 వరకు సప్తమస్థానంలో సువర్ణమూర్తిగా సంచరించును. తదుపరి 31-10-2026 వరకు అష్టమస్థానంలోను, ఆ తరువాత ఉగాది వరకు మళ్లీ సువర్ణమూర్తిగా సంచారము చేయును. శని ఉగాది నుండి మరల ఉగాది వరకు చతుర్థస్థానంలో లోహమూర్తిగా సంచరించును. రాహు–కేతువులు ఉగాది నుండి 5-12-2026 వరకు నవమస్థానంలో సువర్ణమూర్తులుగా, తదుపరి ఉగాది వరకు కూడా సువర్ణమూర్తులుగానే సంచారము చేయును. ఈ రాశి స్త్రీ–పురుషులకు, ముఖ్యంగా వ్యవసాయదారులకు అనుకూలత ఉంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలలో ఉన్నవారికి, లాయర్లు, డాక్టర్లు, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులకు, అన్ని మతముల వారికి ఇది మిశ్రమ కాలము. గురువు అష్టమస్థానం, రాహు ప్రభావం వలన అనారోగ్య సమస్యలు కలిగే సూచనలు ఉన్నాయి. ఆకస్మిక ధనవ్యయం జరుగవచ్చు. తల్లి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. గ్రహస్థితులు వ్యతిరేకంగా ఉన్నందున నవగ్రహ ప్రదక్షిణలు, జపములు, దానములు చేయుట అత్యవసరం. శనికి తైలాభిషేకం, నువ్వులు, నలుపు వస్త్రం, అష్టోత్తర–సహస్రనామములు చేయించి, గొర్రెబొచ్చు, నలుపు గొంగళి, తోలు చెప్పులు, ఇనుప గరలు, నలుపు గొడుగు దానం చేయుట శుభం. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ధనం వచ్చినా ప్రతి విషయంలో అనుకూలత ఉండదు. భార్యాభర్తల మధ్య విరోధాలు తలెత్తే సూచనలు ఉన్నవి. మాటలను తగ్గించి, సహనంతో వ్యవహరించినచో గృహశాంతి ఉంటుంది. ప్రభుత్వ పరంగా, అధికారుల వలన మానసిక ఒత్తిడి కలగవచ్చు. నోటి మాటలను అదుపులో పెట్టుకోకపోతే పోలీస్ సంబంధిత కేసులు, కోర్టు చిక్కులు
ఎదురయ్యే అవకాశమున్నది. ప్రతి నిమిషం జాగ్రత్తఅవసరం. ఎవరు ఏమి చెప్పినా వెంటనే నమ్మరాదు.
ఉద్యోగస్తులకు పై అధికారుల వలన సమస్యలు కలుగవచ్చు. లంచగొండివారి విషయంలో దాడులు, విచారణలు వంటి మాటలు వినిపించినా వాటిని నమ్మి భయపడవద్దు. మీ గృహంలోని వాస్తుదోషములకు పరిష్కారం చేయుట అవసరం. పంచభూతాలు, అష్టదిక్పాలకులు, నవగ్రహాలు – ఈ మూడింటిని దృష్టిలో ఉంచుకొని చేసే పూజలు భగవంతునికి నేరుగా చేరతాయి. చిన్న వ్యాపారాలు నష్టాల వైపు వెళ్లే సూచనలు ఉన్నాయి. సంతానం వలన సమస్యలు, ఆకస్మిక యాక్సిడెంట్లు సంభవించే అవకాశమున్నది. రియల్ ఎస్టేట్ రంగం కొంత పుంజుకుంటుంది.
ఆదాయం ఉన్నా కుటుంబ విషయాలలో అనేక అవరోధాలు ఉంటాయి. ఇది ఆర్భాటాలకు అనుకూల సమయం కాదు. జాయింట్ వ్యాపారాలలో ఉన్నవారికి ఆటుపోట్లు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. నక్షత్రాలవారీపరిహారములు:మూల నక్షత్రం వారు జాతి వైఢూర్యముధరించి, వినాయక, సరస్వతి, చిత్రగుప్తుల అష్టోత్తరములు చేయాలి. ఉలవలు దానం చేయుట శుభకరం. పూర్వాషాఢ నక్షత్రంవారు వజ్రం ధరించి, జనాకర్షణ దేవి గజలక్ష్మీ దేవికి కవచం చదవాలి. లక్ష్మీదేవికి కనకధార స్తోత్రం పారాయణ చేయాలి. ఉత్తరాషాఢ నక్షత్రం వారు జాతి కెంపు ధరించి, సూర్యదండకం, ఆదిత్య హృదయం, సూర్యకవచం, సూర్యనమస్కారములు చేయుట వలన అనారోగ్య సమస్యలు నివారణ కలుగును. మహాన్యాస రుద్రాభిషేకం అత్యంత అవసరం. జన్మనక్షత్రానికి ప్రస్తుతం అనుకూలం కాని గ్రహాన్ని ఆరాధించుట వలన పట్టు విడుపులు, పంతాలు తగ్గుతాయి. అమావాస్య రోజున పితృదేవతలకు తర్పణలు ఆచరించాలి. యోగ, ధ్యానం, ఆక్యుప్రెషర్, ఆయుర్వేద వైద్యంతో అనేక వ్యాధులకు ఉపశమనం లభిస్తుంది. అదృష్ట సంఖ్య– 3.



