ఆదాయం - 8, వ్యయం - 11, రాజపూజ్యం - 3, అవమానం - 3

గురువుఉగాదినుండిది.1-6-2026వరకుదశమ స్థానమునతామ్రమూర్తిగాసామాన్య ఫలితములు ఇస్తాడు. తదుపరి 31-10-2026 వరకు లోహమూర్తిగా, ఆపై 24-1-2027 వరకు వ్యయస్థానమున తామ్రమూర్తిగా, అనంతరం మరల ఉగాది వరకు ధన సంబంధమైన సంచార ఫలితములు కలుగజేస్తాడు.శనిఉగాదినుండిమరలఉగాదివరకు సప్తమ స్థానమునలోహమూర్తిగా సంచరిస్తాడు. రాహు-కేతువులు ఉగాది నుండి 5-12-2026 వరకు రజతమూర్తులుగా, తదుపరి ఉగాది వరకు కూడా రజతమూర్తులుగానే సంచారము చేయుదురు. ఈ రాశి స్త్రీ-పురుషులు, ముఖ్యంగా రైతు సోదరులు, విత్తనములు చల్లుటలో అత్యంత జాగ్రత్త వహించవలెను. వృత్తి, వ్యాపార, ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితములు కలుగును. లాయర్లు, డాక్టర్లు, కాంట్రాక్టర్లు,రాజకీయనాయకులు,బిగ్ఇండస్ట్రీస్వారు, స్మాల్ కాంట్రాక్టర్స్ ఈకాలములో జాగ్రత్తగా వ్యవహరించవలెను. రాత్రి-పగలు లాగ కొన్ని నెలలు వ్యతిరేకత, కొన్ని నెలలు అనుకూలతగా ఫలితములు కనిపించును. ధన విషయంలో ఇబ్బందులు ఎదురగలవు. ఉద్యోగస్తులకు బదిలీలు, ఏసీబీ దాడుల సూచనలు ఉన్నవి. గ్రహబలం లేకపోవడం, వాస్తు దోషములు ఉండుట వలన కొందరు ఉద్యోగులు సమస్యలలో చిక్కుకొనగలరు.

వెండి, బంగారం, రాగి, ఇత్తడి వంటి లోహముల వ్యాపారస్తులకు అధిక ధనలాభములు కలుగును. ఇనుము, సిమెంట్, కంకర, టింబర్ వ్యాపారములకు సామాన్య లాభములు. కిరాణా, ఫ్యాన్సీ, కూరగాయలు, పూల వ్యాపారస్తులకు మోస్తరు లాభములు కలుగును. ఈ రాశి వారు ప్రతి శనివారం శనిభగవానునికి తైలాభిషేకము చేయవలెను. నువ్వులు కడిగి ఎండపోసినవి 1¼ కిలో, నలుపు వస్త్రము 2½ మీటర్లు సమర్పించి, అష్టోత్తర సహస్రనామాలతో అర్చన చేయవలెను. నువ్వుల నూనె లేదా ఆవనూనెతో దీపారాధన చేసి, ఆ నూనెను ఆలయములో దీపములకు వినియోగించుట శుభప్రదము. ఇలా ఆచరించుట వలన ఉపమహేశ్వర అనుగ్రహము కలిగి,ఆర్థికంగా సంతృప్తి లభించును.ఒకశనివారంచేసినమార్పును గమనించి,ఈ సంవత్సరములో 8 శనివారములు ఆచరించవలెను. విద్యార్థులకు మంచి ర్యాంకులు సాధించే అవకాశములు కలవు.

వాత సంబంధ, చర్మ సంబంధ వ్యాధులు ఉన్నవారికి పరిష్కార మార్గములు ఉన్నవి. దీర్ఘవ్యాధులు కలవారు కూడా ఈ పరిహారములు ఆచరించవలెను. యోగధ్యానం, ఆక్యుప్రెషర్ వలన ఆరోగ్యం మెరుగుపడును. ఉత్తర నక్షత్రం వారు జాతి కెంపు ధరించి, ఆదిత్య హృదయం పారాయణము, సూర్యభగవాన్ కవచం చదవవలెను. ఆదివారం గోధుమలు దానం చేయుట వలన అనేక సమస్యలకు పరిష్కారము కలుగును. హస్తనక్షత్రం వారు ముత్యం లేదా ముత్యాల హారం ధరించి, దుర్గాదేవికి కుంకుమతో అష్టోత్తర సహస్రనామ అర్చనలు చేయవలెను. చిత్తనక్షత్రం వారు పగడం ధరించి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు చేయించవలెను. మంగళవారం 450 గ్రాముల కందులు నానబెట్టి గోవుకు దానం చేయుట శుభప్రదము. వివాహ దోషములు, భార్యాభర్తల అన్యోన్యత లోపములు ఉన్నవారు దుర్గాదేవికి ప్రత్యేకంగా కుంకుమతో అష్టోత్తర సహస్రనామ అర్చనలు చేయించవలెను. నవగ్రహ ఆరాధన వలన మనోనిగ్రహము కలుగును. ఏ విధమైన సమస్య ఉన్నను ఈ విధముగా ఆచరించి ఆనందముగా జీవించగలరు. అదృష్ట సంఖ్య– 6.


More Rasi Phalalu 2026 - 2027