ఆదాయం - 11 వ్యయం -5, రాజపూజ్యం - 2 అవమానం-  4

ఈ సంవత్సరంలో గురుడు ఉగాది నుండి 1-6-2026 వరకు తృతీయ స్థానంలో లోహమూర్తిగా సంచరించును. తదుపరి 2-6-2026 నుండి చతుర్ధ స్థానంలో రజితమూర్తిగా సంచరించును. శనిగ్రహము వ్యయ స్థానములో లోహమూర్తిగా సంచారము చేయును. రాహు-కేతువులు 5-12-2026 వరకు వ్యయస్థానములో ఉండి, ఆనంతరం ఉగాది వరకు తామ్రమూర్తులుగా సామాన్య ఫలితములతో సంచరించుదురు. 

ఈ రాశికి చెందిన స్త్రీ-పురుషులకు ఆదాయ వనరులు బాగుగా ఉండును. రైతు సోదరులు ముహూర్తబలముతో వ్యవసాయంలో అధిక దిగుబడులు పొందగలరు. వృత్తి, వ్యాపారములందు అనుకూల ఫలితములు కలుగును. వైద్యులు, న్యాయవాదులకు అనుకూలమైన రోజులు. కాంట్రాక్టర్లకు కలిసి వచ్చే కాలము. రాజకీయ నాయకులు లౌకిక భావనతో సంయమనంగా మాట్లాడగలరు. పెద్ద పరిశ్రమల వారికి అధిక లాభములు, చిన్న పరిశ్రమల వారికి సామాన్య లాభములు కలుగును. జాయింట్ వ్యాపారస్తులు మాటలలో చాలా జాగ్రత్త వహించవలెను. స్నేహితుడైనను ధనమును అప్పుగా ఇవ్వకుండుట శ్రేయస్కరం. తప్పనిసరిగా ఇవ్వవలసిన పరిస్థితిలో సరైన ముహూర్త బలంతో ఇచ్చినచో తిరిగి పొందగలరు. వెండి, బంగారం ధరలు నిలకడగా ఉండవు. సిమెంట్, ఇనుము, ఇసుక, కంకర వ్యాపారములకు కొంత డిమాండ్ ఏర్పడును. టింబర్ వ్యాపారం సామాన్యంగా సాగును. స్థిరాస్తులు సమకూర్చుకొనుటకు ఇది అనుకూలమైన కాలము. ఈ సంవత్సరంలో ప్రతి నిమిషము విలువైనదిగా భావించవలెను. ఉత్సాహము, మనోనిగ్రహము, ఆత్మవిశ్వాసముతో చేసిన కార్యములు అనుకూలంగా ఫలించును. ఆర్భాటములకు ఇది సమయము కాదు. భార్యాభర్తలు తక్కువ మాటలతో పరస్పర అవగాహనతో సంతోషంగా గడుపుదురు. శనిగ్రహ ప్రభావ నివారణార్ధం ఈ సంవత్సరంలో ఎనిమిది శనివారములు శని జపము చేయుట మంచిది. కిలో పావు ఎరుపు నువ్వులు కడిగి ఎండబెట్టి, అర మీటరు నలుపు వస్త్రము, ఒకటి పావు లీటరు నువ్వుల నూనెతో శనీశ్వరాభిషేకము చేయించి, స్వయంపాక దానము, తోలు చెప్పులు, ఇనుప గంటె, నలుపు గొడుగు, గొర్రె బొచ్చు గొంగళి దానములు ఇవ్వవలెను. శని మహాదశ లేదా అంతర్దశలు నడుచుచున్నవారు.

ఆరోగ్య విషయములో అత్యంత జాగ్రత్త వహించవలెను. కళాకారులు, టీవీ ఆర్టిస్టులు నవగ్రహ ప్రదక్షిణలు చేయుచు, వినాయకుడు, సరస్వతీ దేవికి పూజలు చేసి, మహామృత్యుంజయ హోమమును ప్రథమ కర్తవ్యంగా భావించవలెను. అశ్వని నక్షత్రజాతులు వైఢూర్యము ధరించి వినాయకుడు, సరస్వతీ దేవికి పూజలు చేయుచు, చిత్రగుప్త దేవాలయంలో పూజలు చేయండి. భరణి నక్షత్రజాతులు వజ్రము ధరించి గజలక్ష్మీ దేవి పూజలు చేసి కనకధార స్తోత్రము పారాయణం చేయవలెను. శ్రీచక్రమునకు కుంకుమతో ఒక మాల చేయుట శ్రేయస్కరం. కృత్తిక నక్షత్రజాతులు కింపు రత్నము ధరించి ఆదిత్యహృదయ పారాయణం చేయుచు ఆదివారం నియమాలు పాటించవలెను, యోగ, ధ్యానం, ఆక్యుప్రెషర్, ఆయుర్వేద చికిత్సల ద్వారా గ్రహదోషముల వల్ల కలుగు వ్యాధుల నివారణ జరుగును, నవగ్రహ జపములు, దానములు, ప్రదక్షిణలు, నిరంతరం శని ప్రభావ నివారణార్ధం మహామృత్యుంజయ జపము చేయవలెను. అదృష్ట సంఖ్య- 9.


More Rasi Phalalu 2026 - 2027