మహాభారతంలో ఈ వ్యక్తుల గురించి మీకెంత తెలుసు.!
మహాభారతంలో ఈ వ్యక్తుల గురించి మీకెంత తెలుసు?
మహాభారతం , రామాయణం అనేవి రెండు అత్యంత ప్రముఖమైన హిందూ ఇతిహాసాలు. మహాభారతాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ఇతిహాసంగా పరిగణిస్తారు. మహాభారతం కేవలం కృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు , దుర్యోధనుడు.. ఇలా చాలామంది మహాభారతం అనగానే వీరి గురించే మాట్లాడతారు. అయితే మహాభారతం అంటే వీరి కథలకే పరిమితం కాదు. మహాభారతంలో లెక్కలేనంత మంది యోధులు, వీరులు , పాలకులు ఉన్నారు. కానీ ధైర్యం, త్యాగం, జ్ఞానం కలిగి చాలామందికి తెలియని వ్యక్తులు కూడా ఉన్నారు. ఆ వ్యక్తుల గురించి బయటకు చెప్పుకునే కథలు, విషయాలు కూడా చాలా తక్కువ, నేటికాలంలో అయితే చాలామందికి అస్సలు తెలియదు కూడా.. ఆ వ్యక్తులు ఎవరో.. వారి గొప్పతనం ఏమిటో తెలుసుకుంటే..
దేవిక..
పాండవ పుత్రుడైన యుధిష్ఠిరుని మొదటి భార్య ద్రౌపది. ఈమె పాండవులకు అందరికీ భార్యగా పరిగణించబడుతుంది. కానీ యుధిష్టిరుడుగా పిలువబడే ధర్మరాజుకు దేవిక అనే రెండవ భార్య కూడా ఉంది. ఆమె శిబి చక్రవర్తి వంశానికి చెందిన గోవాసన రాజు కుమార్తె , స్వయంవరం ద్వారా యుధిష్ఠిరుని తన భర్తగా స్వీకరించింది. వీరికి యౌధేయుడు అనే కుమారుడు కూడా ఉన్నాడు, అయితే మహాభారత ఇతిహాసంలో అతని పాత్ర గురించి విపులంగా వివరించబడలేదు.
శ్రుత కర్మ..
ద్రౌపది , పాండవ సోదరుల కుమారులైన ఐదుగురు ఉపపాండవులలో శ్రుతకర్మ అందరికంటే చిన్నవాడు. ఇతను ద్రౌపది , అర్జునుడి కుమారుడు. తన తండ్రిలాగే, శ్రుతకర్మ కూడా గొప్ప విలువిద్య నైపుణ్యం కలవాడు. కురుక్షేత్ర యుద్ధంలో శౌర్యంతో పోరాడాడు. అయితే, అతను అశ్వత్థామ చేతిలో యుద్ధభూమిలో వీరమరణం పొందాడు.
సోమదత్త..
మహాభారత ఇతిహాసంలో సోమదత్తుడు కురు వంశానికి చెందిన భూరిశ్రవుడి తండ్రి. భూరిశ్రవుడు ఒక నైపుణ్యం గల యోధుడు , కౌరవులకు చాలా ముఖ్యమైన మిత్రుడు. తన హోదా ఉన్నప్పటికీ, అతను తరచుగా తనకంటే ఎక్కువ పేరున్న యోధుల ముందు వెనుకబడేవాడు. మహాభారత యుద్ధంలో అతని కుటుంబం కీలక పాత్ర పోషించిందని చెబుతారు.
బభ్రువాహనుడు..
బభ్రువాహనుడు మణిపూర్ రాజ్యపు యువరాణి చిత్రంగద , అర్జునుడి కుమారుడు. అతను తన తల్లి , మేనమామతో దగ్గర పెరిగి, తరువాత మణిపూర్ రాజ్యానికి రాజు అయ్యాడు. అతను యుద్ధంలో స్వయంగా అర్జునుడిని ఓడించాడు. అతని కథ చాలా ఆసక్తికరమైనది, అయినప్పటికీ దాని గురించి పెద్దగా ప్రస్తావించబడలేదు.
వృషసేనుడు..
వృషసేనుడు కర్ణుని కుమారుడు. ఇతను అత్యంత ధైర్యవంతుడు, సమర్థవంతుడు. కురుక్షేత్ర యుద్ధ సమయంలో, అతను కౌరవ సైన్యంలో ఒక పరాక్రమశాలి యోధుడిగా ఉండేవాడు , తన విలువిద్య నైపుణ్యానికి ప్రసిద్ధి చెందాడు. యుద్ధం జరిగే 17వ రోజున అర్జునుడి చేతిలో మరణించడానికి ముందు, అతను తనకంటే గొప్పవారైన పాండవ యోధులతో కూడా పోరాడాడు.
దేవకుడు..
దేవకి తండ్రి , యాదవ రాజు, కంసుడికి పినతండ్రి అయిన దేవకుడు మహాభారత కథలో ప్రధాన పాత్ర పోషించలేదు.. అయినప్పటికీ దేవకుడికి, శ్రీకృష్ణుడికి చాలా గొప్ప బంధం ఉంది. దేవకుడి గురించి కూడా ప్రస్తావన ఎక్కడా లేదు.
మలయధ్వజ పాండ్యుడు..
మలయధ్వజ పాండ్యుడు పాండవుల పక్షాన పోరాడిన ఒక శక్తివంతమైన దక్షిణ పాలకుడు. తన శౌర్యానికి, యుద్ధ పరాక్రమానికి అతను చాలా ప్రసిద్ధి చెందాడు. ప్రాచీన గ్రంథాలు యుద్ధ సమయంలో అతని సేవలను ప్రశంసిస్తాయి. అయితే మహాభారతం గురించి చూస్తే మలయధ్వజ పాండ్యుడిని గురించి ఎవరూ ఎక్కువ మాట్లాడరు, గుర్తు చేసుకోరు.
*రూపశ్రీ.