Read more!

సుభాషితం - (Subhashitam) స్నేహితులను బట్టే వ్యక్తిత్వం

 

సుభాషితం - (Subhashitam)

స్నేహితులను బట్టే వ్యక్తిత్వం

 

జాడ్యం ధియో హరతి సించతి వాచి సత్యం

మానోన్నతిం దిశతి పాప మపాకరోతి

చేతః ప్రసాదయతి దిక్షు తనోతి కీర్తిం

సత్సద్గతిం కథయ కిం న కరోతి పుంసాం

 

సజ్జనుల సహవాసం నిజం చెప్పే అలవాటు చేస్తుంది. బుద్ధి మాంద్యాన్ని తగ్గిస్తుంది. గౌరవం పెంచుతుంది. తప్పులను సరిచేస్తుంది. కీర్తిప్రతిష్టలను ఎలా పెంచుకోవాలో, బుద్ధిని ఎలా వికసింపచేసుకోవాలో నేర్పిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, మన స్నేహితులను బట్టే మన వ్యక్తిత్వం, గుణగణాలు ఉంటాయి. కనుక మంచివారితోనే కలిసి ఉండే ప్రయత్నం చేయాలి.