మృత్యు పంచకం.. ఈ ఐదు రోజులు చాలా ప్రమాదం!
మృత్యు పంచకం.. ఈ ఐదు రోజులు చాలా ప్రమాదం!
మృత్యు పంచకం జూన్ 6, 2026న సాయంత్రం 7:03 గంటలకు ప్రారంభమై, జూన్ 11న ఉదయం 8:16 గంటలకు ముగుస్తుంది. మృత్యు పంచకంలోని ఈ ఐదు రోజులు చాలా ప్రమాదకరమైనవిగా పరిగణించబడతాయి. అందువల్ల ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతారు. దీని గురించి వివరంగా తెలుసుకుంటే..
గరుడ పురాణం ప్రకారం, పంచకంలో ఎవరైనా మరణిస్తే వారి కుటుంబం, వంశం లేదా గోత్రానికి చెందిన మరో ఐదుగురు సభ్యులు తీవ్రమైన కష్టాలు, అనారోగ్యం లేదా మరణానికి గురయ్యే అవకాశం ఉంటుందట. అందువల్ల, ఈ పంచకాన్ని చాలా ప్రమాదకరమైన కాలంగా పరిగణిస్తారు.
శుభకార్యాలకు శనివారం మంచిది కాదని చెబుతారు, ఇక పంచకంతో కలిసినప్పుడు దాని ప్రభావాలు మరింత తీవ్రమవుతాయి. ఈ పంచకం మరణంతో సమానమైన బాధను కలుగజేస్తుందని చెబుతారు. అందుకే దీనిని మృత్యు పంచకం అని పిలుస్తారు.
పంచకం సమయంలో ఎవరైనా మరణిస్తే, మృతదేహంతో పాటు దర్బ లేదా పిండితో చేసిన ఐదు బొమ్మలకు అంత్యక్రియలు నిర్వహిస్తారట. దీనివల్ల ప్రమాదాలు, గాయాలు, వాదనలు లేదా గొడవలు జరిగే ప్రమాదం తగ్గుతుందట. మృత్యు పంచకంలో ఇనుము లేదా ఇతర వస్తువులను సేకరించడం మానుకోవాలని చెబుతారు.
మృత్యు పంచకం సమయంలో మృతదేహానికి అంత్యక్రియలు చేసే ముందు కొన్ని ప్రత్యేక ఆచారాలు పాటించాలని గరుడ పురాణంలో చెప్పారు. అలా చేయని పక్షంలో ఆ కుటుంబానికి కష్టాలు ఎదురవుతాయి. ఈ సమయంలో ఇతర కుటుంబ సభ్యులు ఐదు దర్బతో దిష్టిబొమ్మలను తయారు చేసి, వాటికి ముందుగా అంత్యక్రియలు చేయాలట.
పంచక మాసంలో వివాహిత స్త్రీలు తమ పుట్టింటి నుండి అత్తింటికి గానీ, అత్తగారింటి నుండి పుట్టింటికి గానీ వెళ్లకూడదట. వారు పంచకం రోజులలో ఒకేచోట ఉండాలట. ఈ సమయంలో ప్రయాణం చేయడం వల్ల ప్రమాదాలు జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెబుతారు.
కాబట్టి జూన్ నెలలో వచ్చే మృత్యు పంచకం రోజు పైన చెప్పుకున్న నియమాలు, జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది.
*రూపశ్రీ.