శబరి, గుహుడు సరే. మరి నేను!

 

 

 

శబరి, గుహుడు సరే. మరి నేను!

 

 

డాసిన చుట్టమా శబరి? దాని దయామతి నేలినావు, నీ

దాసుని దాసుడా గుహుడు? తావకదాస్య మొసంగినావు నే

జేసిన పాపమో! వినుతి చేసిన గావవు గావుమయ్య! నీ

దాసులలోన నే నొకఁడ దాశరథీ! కరుణాపయోనిధీ!

 

శబరి నీ చుట్టమేమీ కాదు. అయినా ఆమె పట్ల దయ చూపించావు. ఇక గుహుడైతే నీ సేవకునికి సేవకుడు కూడా కాదు... అయినా అతని పట్ల కరుణవహించావు. మరి నేను చేసిన పాపమేమిటి రామయ్యా! నువ్వు నన్ను లెక్కచేయవెందుకనీ? నేను నీ దాసుడను రామయ్యా! దయచేసి నన్ను గుర్తించు.

 

...Nirjara