పొగరు బలం కాదు

 

పొగరు బలం కాదు

 

తగిలి మదంబుచే నెదిరిదన్ను నెఱుంగక దొడ్డవానితో

బగ గొని పోరుటెల్ల నతిపామరుడై చెడు టింతెగాక తా

నెగడి జయింపనేరడది నిక్కము తప్పదు ధాత్రిలోపలన్

దెగి యొక కొండతో దగరు ఢీకొని తాకిననేమి భాస్కరాపొగరుతో ఉన్న మనిషి తన స్థాయిని మరచి ఎవరితో పడితే వారితో పోట్లాడితే... పరాజయం తప్ప మరేమీ మిగలదు. పొట్టేలు పోయి పోయి కొండతో ఢీకొంటే దాని మాడు పగులుతుందే కానీ ఫలితం దక్కదు కదా!