English | Telugu

దానికి 100 కోట్ల గ్రాస్.. దీనికి 100 కోట్ల షేర్!

on Jan 18, 2020

 

మహేశ్ హీరోగా నటించిన 'దూకుడు' సినిమా సూపర్ హిట్ అయ్యిందనే విషయం మనకు తెలిసిందే. శ్రీను వైట్ల డైరెక్షన్‌లో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బేనర్‌పై ఆ మూవీని రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర కలిసి నిర్మించారు. ఇప్పుడు అనిల్ సుంకర సపరేట్‌గా ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్ బేనర్‌పై సినిమాలు తీస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన ఆ బేనర్‌పై మహేశ్ హీరోగా నిర్మించిన 'సరిలేరు నీకెవ్వరు' మూవీ సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాని 'బ్లాక్‌బస్టర్ కా బాప్' అంటూ ప్రమోట్ చేస్తున్నారు. శుక్రవారం రాత్రి వరంగల్‌లో ఈ సినిమా విజయోత్సవాన్ని నిర్వహించారు. ఇందులో 'సరిలేరు నీకెవ్వరు' 100 కోట్ల రూపాయల షేర్ సాధించిందంటూ పోస్టర్ ప్రదర్శించారు. 

ఈ సందర్భంగా అనిల్ సుంకర మాట్లాడుతూ 'దూకుడు' సినిమాకి 100 కోట్ల గ్రాస్‌ని తానే అనౌన్స్ చేశాననీ, ఇప్పుడు మొదటి వారంలోనే 'సరిలేరు నీకెవ్వరు' 100 కోట్ల షేర్‌ని అనౌన్స్  చేయడం సంతోషంగా ఉందనీ అన్నారు. "అందరూ మహేశ్ బాబు ఈ సినిమాలో మాస్ చేశారు, బ్లాక్‌బస్టర్ కావాలి అన్నారు. కానీ బ్లాక్‌బస్టర్ సరిపోలేదు, బ్లాక్‌బస్టర్ కా బాప్ అయింది. 'మైండ్ బ్లాక్' సాంగ్ ఒక్కటి చాలు.. సినిమా ఏ రేంజికి తీసుకువెళ్తుంది అనేదానికి. ఏడవ రోజు డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ప్రాఫిట్స్‌లోకి వచ్చారని వారి మొహంలో చిరునవ్వు తెలియజేస్తోంది. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చి మొదటి రోజు నుండి మాకున్న నమ్మకాన్ని కలెక్షన్స్ రూపంలో తీసుకువచ్చారు. మహేష్ బాబు అభిమానిగా నాది ఒకటే కోరిక. ప్రతి సినిమాలో ఒక మైండ్ బ్లాక్ సాంగ్ కావాలి. ఎందుకంటే థియేటర్ లో సినిమా చూస్తున్నప్పుడు సినిమా అంతా ఒక ఎత్తు, మైండ్ బ్లాక్ సాంగ్ ఒకెత్తు. అన్ని వయసుల వారు డాన్స్ వేస్తున్నారు" అని చెప్పారు అనిల్.  


Cinema Galleries



Latest News


Video-Gossips