ఎంజీఆర్ కోసం ఎనిమిది లుక్స్ ట్రై చేశాడు
on Jan 18, 2020

'తలైవి'లో ఎంజీఆర్ పాత్రలో అరవిందస్వామి ఆహార్యానికి సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, సీఎం ఎంజీఆర్ ను అచ్చుగుద్దినట్టు అరవిందస్వామి దింపేశాడని సోషల్ మీడియాలో పొగడ్తల వర్షం కురుస్తోంది. ఈ లుక్ రావడం కోసం ఒకప్పటి అమ్మాయిల కలల రాకుమారుడు, 'రోజా' హీరో చాలా కష్టపడ్డాడట.
జయలలిత జీవితం ఆధారంగా రూపొందుతోన్న సినిమా 'తలైవి'. ఎ.ఎల్. విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. జయలలితగా కంగనా రనౌత్ నటిస్తున్నారు. ఎంజీఆర్ జయంతి సందర్భంగా సినిమాలో ఆయన పాత్ర పోషిస్తున్న అరవిందస్వామి లుక్, టీజర్ శుక్రవారం విడుదల చేశారు. ప్రేక్షకులు చూస్తున్న లుక్ మొదట అనుకోలేదు. ఈ లుక్ రావడానికి ముందు అరవిందస్వామి ఎనిమిది లుక్స్ ట్రై చేశాడని దర్శకుడు ఎ.ఎల్. విజయ్ చెప్పారు. అంతే కాదు... అరవిందస్వామి ఒకసారి డెంటిస్ట్ దగ్గరకు కూడా వెళ్లారట. ఎందుకంటే... ఆయన పళ్లవరస, ఎంజీఆర్ పళ్లవరసలా ఉండాలని ప్రయత్నించారట. క్యారెక్టర్ కోసం అంత డెడికేషన్ తో అరవిందస్వామి వర్క్ చేశారు. ఎంజీఆర్ పాత్రకు ఆయన తప్ప మరొకరు సూట్ అవ్వరని, ఈమాట ఎందుకు చెబుతున్నానో సినిమా విడుదల తర్వాత ప్రేక్షకులకు తెలుస్తుందని దర్శకుడు చెబుతున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



