మహేశ్ ఛాతీ చూపించేశాడు!
on May 18, 2020

ఇప్పటివరకూ మహేశ్ టాప్‌లెస్‌గా కనిపించలేదు. సినిమాల్లోనూ షర్ట్ లేకుండా కనిపించడానికి ఎప్పడూ ఇష్టపడలేదు. ఆ విషయంలో చాలా మొహమాటస్తునిగా అతను పేరు తెచ్చుకున్నాడు. '1.. నేనొక్కడినే' సినిమాలో డైరెక్టర్ సుకుమార్ ఒక బాత్‌రూమ్ సీన్ క్రియేట్ చేశాడు. అందులో మహేశ్ షవర్ కింద స్నానం చేస్తూ కనిపించాలి. అప్పుడు కూడా ఫ్రంట్ నుంచి టాప్‌లెస్‌గా కనిపించడానికి ఒప్పుకోలేదు మహేశ్. దాంతో వెనుక నుంచే మహేశ్ వీపును చూపిస్తూ షాట్ తీశాడు సుకుమార్. అలాంటి మహేశ్‌ను ఇప్పుడు ఆయన భార్య నమ్రత షర్ట్ లేకుండా చూపించేసింది. రీల్ లైఫ్‌లో కాకుండా రియల్ లైఫ్‌లో అతడిని టాప్‌లెస్‌గా చూపించిన ఘనతను సొంతం చేసుకుంది నమ్రత.
తమ ఇంట్లోని స్విమ్మింగ్‌పూల్‌లో కూతురు సితారతో కలిసి మహేశ్ ఈత కొడుతుండగా తీసిన ఫొటోను తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసి, 'Getting ready for a lap!! My water babies' అంటూ కాప్షన్ పెట్టింది. అంటే.. ఆ ఫొటోను పెట్టినందుకు, తనను ప్రపంచానికి అలా చూపించినందుకు మహేశ్ ఏమైనా అంటాడేమోనని, దానికి సర్దిచెప్పుకోవాల్సి వస్తుందనీ ఆ కాప్షన్ రాసుకొచ్చిందనుకోవచ్చు. ఏదేమైనా ఫ్యాన్స్ మాత్రం ఆ ఫొటోలో మహేశ్‌ను చూసి తెగ సంబరపడుతున్నారు. ఇలాంటి ఫొటో కోసం ఇన్నేళ్లుగా ఎదురు చూస్తున్నామంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇంతదాకా ప్రపంచానికి చూపించకుండా దాచుకున్న మహేశ్ ఛాతీని చూపించినందుకు నమ్రతకు థాంక్స్ చెప్తున్నారు. అదీ సంగతి!

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



