ఫైనల్ షూటింగ్ దశలో `ఎఫ్2`
on Dec 4, 2018
విక్టరీ వెంకటేష్ , మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందుతున్న మల్టీస్టారర్ చిత్రం ` ఎఫ్ 2`. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అనే క్యాప్షన్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా వస్తోన్న ఈ చిత్రంలో వెంకటేష్ సరసన తమన్న, వరుణ్ తేజ్ సరసన మెహరీన్ నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అన్నపూర్ణలో జరుగుతోంది. షూటింగ్ ముగింపు దశలో ఉంది. సుప్రీమ్, రాజాది గ్రేట్ చిత్రం తర్వాత దిల్ రాజు బేనర్ లో అనిల్ రావిపూడి డైరక్ట్ చేస్తోన్న చిత్రం కావడంతో ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. హ్యాట్రిక్ చిత్రంగా మలచడానికి దర్శకుడు అనిల్ రావిపూడి అహర్నిలు శ్రమిస్తున్నారు.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ చిత్రం సింగిల్స్ ఈ నెల మూడోవారంలో నుంచి ఒక్కోక్కటి రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.