ప్రస్తుతం ఆ ఆలోచన లేదు
on Dec 4, 2018
కాజల్ అగర్వాల్ నటించిన లేటెస్ట్ సినిమా `కవచం`. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన ఈ చిత్రం ఈనెల 7న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా కాజల్ మీడియాతో మాట్లాడింది. ఆ విశేషాలు...
పెద్ద హీరోలతో చేస్తూ ఇలా అప్ కమింగ్ హీరోతో సినిమా ఒప్పుకోవడానికి కారణం?
ఇది ఒక కమర్షియల్ సినిమా. అందులో నా క్యారక్టర్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అందుకే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నా. సినిమా చూసాక మీరే అంటారు. కాజల్ ఓ మంచి క్యారక్టర్ చేసిందని.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురించి చెప్పండి??
సాయి చాలా మంచి హ్యుమన్ బీయింగ్ ఉన్న వ్యక్తి. సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాడు. ఈ సినిమా తన హార్డ్ వర్క్ కి కచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది. స్వతహాగా ఎదగాలనే ఫైర్ ఉన్న వ్యక్తి సాయి శ్రీనివాస్.
క్వీన్ రీమేక్ గురించి చెప్పండి?
నేను క్వీన్ రీమేక్ లో నటిస్తున్నా. పూర్తిగా లోకల్ లో సాగే సినిమా ఇది. ఎక్కువగా తమిళ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదలవుతుంది.
తేజ డైరక్షన్ లో మళ్లీ నటిస్తున్నారు ఎలా అనిపిస్తుంది?
ఆ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. నా కెరీర్ లో నే ఒక అద్భుతమైన రోల్ తేజ్ గారు నాకు ఆ సినిమా ద్వారా ఇచ్చారు. సవాలు తో కూడుకున్న పాత్ర అది. కచ్చితంగా ఆ చిత్రం నా కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది.
మీ పెళ్ళి ఎప్పుడు?
ఇటీవల దీపికా, ప్రియాంక పెళ్లిళ్లు చేసుకున్నారు. నాకు కూడా చేసుకోవాలనే ఉంది. కానీ ప్రస్తుతం నా కెరీర్ పీక్స్ లో ఉంది. ఇలాంటి సమయంలో దాని గురించి ఆలోచించడం లేదు.
భారతీయుడు-2 గురించి?
శంకర్ -కమల్ హాసన్ భారతీయుడు-2లో నటించే అవకాశం రావడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ప్రస్తుతానికైతే ఈ చిత్రం ఏమీ చెప్పలేను. త్వరలో నా పాత్ర గురించి రివీల్ చేస్తాను.