కంగనా తేలిపోయింది... అరవిందస్వామి లుక్ పేలిపోయింది
on Jan 17, 2020
దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితంపై తెరకెక్కుతోన్న బయోపిక్స్ లో 'తలైవి' ఒకటి. దివంగత నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ ప్రస్తావన లేని జీవితం అసంపూర్ణం. జయలలితకు ఆయనే రాజకీయ గురువు. నటిగా ఆమె ఎదుగుదలలో ఆయన పాత్ర ఎంతో ఉంది. అటువంటి ఎంజీఆర్ పాత్రకు తలైవి చిత్రబృందం అరవిందస్వామిని తీసుకుంది. నేడు (శుక్రవారం) ఎంజీఆర్ 103 వ జయంతి సందర్భంగా అరవిందస్వామి లుక్ ను విడుదల చేశారు. ఆ లుక్ చూస్తే అచ్చం ఎంజీఆర్ లా అరవిందస్వామి ఉన్నాడంటే అతిశయోక్తి కాదు. సినిమాలో ఆయన లుక్ పేలిపోయింది. సూపర్ హిట్ అన్నమాట. అయితే... జయలలిత లుక్ మాత్రం ఇప్పటికీ విమర్శల పాలవుతోంది.
ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జయలలిత పాత్రను కంగనా రనౌత్ పోషిస్తోంది. ఆల్రెడీ ఆమె లుక్ ను విడుదల చేశారు. జయలలిత బొద్దుగా, లావుగా ఉండేవారు. ఆమె లా కనిపించడం కోసం బక్క పలచటి కంగనా రనౌత్ ప్రొస్థెటిక్ మేకప్ ను ఆశ్రయించారు. జయలలితగా కంగన లుక్ అసలు ఏమాత్రం బాలేదని ఇప్పటికీ విమర్శిస్తున్న వాళ్ళు ఉన్నారు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ ఏడాది జూన్ 26 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాలో కంగనా రనౌత్ ఏ విధంగా మెప్పిస్తారో చూడాలి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
