సల్మాన్ "రేప్" స్టేట్ మెంట్ పై కంగనా సెటైర్లు...!
on Jun 23, 2016
సల్మాన్ తెలిసి అన్నాడో తెలియక అన్నాడో మనకి తెలియదు కానీ.. ఆయన చేసిన "రేప్" స్టేట్ మెంట్ మాత్రం ప్రస్తుతం చాలా రచ్చ చేస్తోంది. ఆఖరికి సల్మాన్ స్టార్ డమ్ కి సరితూగని యువ కథానాయికలు కూడా సల్మాన్ పై సెటైర్లు వేస్తున్నారు. నిన్న కంగనా రనౌత్ ఈ విషయమై స్పందిస్తూ.. "సల్మాన్ చేసిన కామెంట్ చాలా దారుణం" అని తిట్టేసి.. అందరం ఇండస్ట్రీకి చెందినవాళ్లమే కాబట్టి ఆయన్ను ఈ విషయమై ఇంక ఇబ్బంది పెట్టకుండా, ఈ మేటర్ ను ఇక్కడితో క్లోజ్ చేసేస్తే మంచిది అంటూ సూచనలు ఇచ్చింది. నిన్న ముంబైలో "కృతి" అనే షార్ట్ ఫిలిమ్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న కంగనా ఈ విధంగా సల్మాన్ పై కారాలు మిరియాలు నూరింది. మరి ఇప్పటికైనా సల్మాన్ ఈ విషయమై వివరణ ఇవ్వడమే లేక క్షమాపణలు చెప్పడమో చేస్తేగానీ ఈ గొడవలు ఆగేలా లేవు!

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
