ప్రియుడికి స్ట్రాంగ్ డోస్ ఇచ్చేసిన ప్రభాస్ హీరోయిన్..!
on May 18, 2016

ప్రభాస్ పక్కన యాక్ట్ చేసే సమయానికి కంగనాకు పెద్ద ఆఫర్లు లేవు. ఒక సాదా సీదా నార్మల్ హీరోయిన్. కానీ ఇప్పుడు మాత్రం బాలీవుడ్ లో రోజుకోసారైనా ఈ భామ మీద న్యూస్ వస్తుంటుంది. లేదంటే అక్కడి జనానికి టైంపాస్ అవ్వదు. అంతలా అక్కడ ఫ్యామస్ అయిపోయింది. ఇక ఇప్పటికే హృతిక్ తో వివాదంలో ఉన్న కంగనాను చేతబడులు చేస్తుందని, సైకో అని ఆమె ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అధ్యయన్ సుమన్ రకరకాల విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇన్నాళ్లూ వీటిపై నోరు మెదపకుండా ఉన్న కంగన ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో అతనిపై శివాలెత్తిపోయింది.
నేను వచ్చింది ఒక మారుమూలు ప్రాంతమే. అంత మాత్రాన చేతబడులు చేయించేదానిలా కనిపిస్తున్నానా..అతను చెప్పగానే మీరంతా నమ్మేస్తారా..? ఒకవేళ నేను అలాంటివే చేసి ఉంటే, ఈ పాటికే చుట్టుపక్కలైనా ఎవరికైనా తెలిసుండాలి కదా..ఎవరైనా చెప్పారా..? నా దగ్గర ఉన్నది నా కళ్లు చేసే మాయ మాత్రమే. అవే అతన్ని కూడా ఆకర్షించాయి. అతని సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి నేనెలా కారణం అవుతాను..? అతని నటనలోనో, కథల్లోనో, అతనిలోనో లోపం ఉండాలి తప్ప ఆ ప్లాపులకు నేను కారణం అంటే ఎలా..? అంటూ కంగనా ఫైర్ అయింది. ఈ వివాదాల నుంచి కంగన ఎప్పటికి బయటపడుతుందో అని ఎదురుచూస్తున్నారు ఆమె ఫ్యాన్స్..
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



