నెట్టింట్లో సమంతను తిడుతున్నారు
on Aug 28, 2019
సమంత హాలిడేకి వెళ్లడం... అక్కడ ఫొటోలు దిగి నెట్టింట్లో పోస్ట్ చేయడం... కొంతమంది పనిగట్టుకుని సమంతపై కామెంట్లు చేయడం... తిట్టడం... ప్రతిసారీ జరిగే తంతే. ఈసారీ అందుకు అతీతంగా ఏమీ జరగలేదు. భర్త నాగచైతన్యతో కలిసి సమంత స్పెయిన్ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ దిగిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారామె. ఆలస్యం చేయకుండా ఓ వర్గం నెటిజన్లు రంగంలోకి దిగారు. 'నీకు పెళ్లి అయింది. ఏంటీ బట్టలు?' అని కొందరు. 'నువ్ తమిళనాడుకు చెందిన అమ్మాయివేనా?' అని మరికొందరు. 'భారతీయ సంస్కృతి ఏమైపోతుందో చూడండి' అని ఇంకొందరు. సమంతను టార్గెట్ చేస్తూ తిట్టడం ప్రారంభించారు. సమంతను సపోర్ట్ చేసేవాళ్ళు కూడా కొందరున్నారు. అయితే, సపోర్ట్ చేసేవాళ్ల కంటే తిట్టేవాళ్లు కామెంట్ సెక్షన్ లో ఎక్కువ హైలైట్ అవుతున్నారు. వాళ్లు విరుచుకుపడుతున్నది ఈ ఫొటో మీదే. అన్నట్టు... ఈ ఫొటో తీసింది నాగచైతన్య అని సమంత పోస్ట్ లో స్పష్టం చేశారు. అయినా తిట్టేవాళ్లు ఆగడం లేదు. గతంలో ఇటువంటి కామెంట్స్ చేసినవాళ్లకు సమంత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈసారి ఏం చేస్తారో చూడాలి.
Also Read