నేనలా చేస్తే... చైతన్య చంపేస్తాడు
on Feb 13, 2020
అక్కినేని నాగచైతన్య, సమంత హ్యాపీ కపుల్. లవ్లీ కపుల్ కూడా! హీరోగా నాగచైతన్య, హీరోయిన్ గా సమంత బిజీ బిజీ. ఇద్దరూ సినిమాలు చేస్తున్నారు. సినిమా చేసేటప్పుడు బోలెడు టెన్షన్స్ కామన్. వీటన్నిటి మధ్య వర్క్ లైఫ్, పర్సనల్ లైఫ్ ను ఎలా బ్యాలన్స్ చేసుస్తున్నదీ ;లేటెస్ట్ ఇంటర్వ్యూలో సమంత చెప్పారు. "సాధారణంగా సాయంత్రం ఆరు గంటల తర్వాత నేను షూటింగులు చేయను. అవాయిడ్ చేస్తా. ఒక్కసారి నేను ఇంటికి వెళ్లిన తర్వాత నా టైమ్ అంతా నాగచైతన్యకు కేటాయిస్తా. గేటు దాటి ఇంటిలోకి అడుగు పెట్టేటప్పుడు సినిమాలో నేను చేసే క్యారెక్టర్ ను బయట వదిలేస్తా. లేదంటే అంతే సంగతులు. ఇంటిలో సినిమాలో క్యారెక్టర్ లా బిహేవ్ చేస్తే... చైతన్య చంపేస్తాడు. ఇంటిలో నాకు నేనులా ఉండాలి" అని సమంత చెప్పారు. అదీ వాళ్ల హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సీక్రెట్ అన్నమాట. సినిమావాళ్లు మాత్రమే కాదు... సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవాళ్లు ఎవరైనా వర్క్ లైఫ్ టెన్షన్స్ పక్కన పెడితే పర్సనల్ లైఫ్ లో హ్యాపీగా ఉండొచ్చు.