సమంత వంద కేజీలు ఎత్తింది!
on Mar 7, 2020

సమంత సన్నగా, సన్నజాజి పువ్వులా సుకుమారంగా కనిపిస్తారు. కానీ, చాలా స్ట్రాంగ్ అండీ బాబు! వ్యక్తిత్వం పరంగా మాత్రమే కాదు, వ్యక్తిగానూ సమంత స్ట్రాంగ్. ఎంత స్ట్రాంగ్ అంటే వంద కేజీల బరువును అవలీలగా ఎత్తేసే అంత! సమంత ఫిట్‌నెస్ సీక్రెట్ వర్కౌట్స్ అన్నది తెలిసిందే. అప్పుడప్పుడూ జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న వీడియోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. శుక్రవారం సాయంత్రం ఆమె ఒక అలాగే జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న వీడియోస్ పోస్ట్ చేశారు. తొలుత 40 కేజీల వెయిట్ లిఫ్ట్ చేసిన సమంత, తర్వాత 100 కేజీలను ఎత్తారు. సన్నజాజిలాంటి సమంత అంతంత బరువులు ఎత్తారంటే నమ్మశక్యంగా లేదు కదూ! ఇక, సినిమాల విషయానికి వస్తే... తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో ఒక హీరోయిన్ గా నటిస్తున్నారు. అందులో నయనతార మరో హీరోయిన్. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో మరో సినిమా ఉంది. 'ఫ్యామిలీ మాన్ 2' వెబ్ సిరీస్ షూటింగ్ కంప్లీట్ చేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



