వెంకీ మామ అతిథిగా `మజిలీ`
on Mar 28, 2019
శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య, సమంత జంటగా నటించిన చిత్రం మజిలీ. పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో మజిలీ పై మంచి అంచనాలే ఉన్నాయి. దానికి తోడు ఇటీవల విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా నాగచైతన్య, సమంత మధ్య ఎమోషన్ సీన్స్ , చైతు రఫ్ లుక్ బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఆడియో కూడా అందరిని ఆకట్టుకుంటుంది.
ఇదిలా ఉండగా ఏప్రిల్ 5వ తేదీన సినిమా విడుదల నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు చిత్ర యూనిట్. ఇప్పటికే చైతు, సామ్ ఇద్దరూ పలు ఇంటర్వ్యూ ల్లో పాల్గొని సినిమా పై ఆసక్తిని పెంచుతున్నారు. ప్రమోషన్స్ లో భాగంగానే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు దర్శక నిర్మాతలు. మార్చి 30 తేదిన హైదరాబాద్ లో `మజిలీ` ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విక్టరీ వెంకటేష్ రానున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన్ రావాల్సి ఉంది.
మరోవైపు వెంకీ , నాగచైతన్య కలిసి ప్రస్తుతం వెంకీమామ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రాశిఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు అతిథిగా వస్తే `మజిలీ` సినిమాతో పాటు పనిలో పనిగా వెంకీమామ సినిమా ప్రమోషన్ కు కూడా వర్క్ అవుట్ అవుద్దని ఆలోచిస్తున్నారట.
మజిలీ సినిమాను షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గరపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హిందీ నటి దివ్యంశ కౌశిక్ మరోక కీలక పాత్రలో నటిస్తుంది. రావు రమేష్ , పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, తనికెళ్ళ భరణి, రవి ప్రకాశ్, కరణ్ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు గోపిసుందర్ పాటలు అందించగా థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.