`ఆర్ ఆర్ ఆర్` లేటెస్ట్ అప్డేట్!!
on Mar 28, 2019
జక్కన్న దర్శకత్వంలో ఎన్టీఆర్ కొమరం భీం గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మల్టీస్టారర్ లో ఎన్టీఆర్ కు జోడీగా డైసీ ఎడ్గార్ జోన్స్, చరణ్ కు జోడీగా అలియా భట్ నటిస్తోన్న విషయం కూడా ఇటీవల రాజమౌళి ప్రకటించిన విషయం కూడా తెలిసిందే. అయితే ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో మరో షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ లో హీరోయిన్స్ అలియా భట్, డైసీలు పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. తదుపరి షెడ్యూల్ నార్త్ ఇండియా లో జరపుకోనుందట. అలాగే ఈ షెడ్యూల్ లోనే బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, మరో కీలక పాత్రలో నటిస్తోన్న తమిళ దర్శకుడు సముద్రఖని కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అందుతోంది. కీరవాణి సంగీత సారథ్యంలో ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. భారీ బడ్జెట్ తో డి.వి.వి దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రాం వచ్చే ఏడాది జులై 30న విడుదల కానుంది.