బాలీవుడ్ వైపు వెంకీ చూపు !!
on Jun 3, 2019
ఇతర భాషల సినిమాలు ఎక్కువగా తెలుగులో విక్టరీ వెంకటేష్ రీమేక్ చేసి సక్సెస్ సాధిస్తుంటారు. ఆయన లిస్ట్ లో అలాంటి సినిమాలు చాలానే ఉన్నాయి. ఇక అందులో బాలీవుడ్ సినిమాలు అయిన `బాడీ గార్డ్`, గురు చిత్రాలు ఎంత సక్సెస్ సాధించాయో తెలిసిందే. ఇక తాజాగా విడుదలైన `దే దే ప్యార్ దే` సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకుంటున్నారని సమాచారం అందుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రీమేక్ హక్కులను తీసుకోవడానికి సురేష్ బాబు రంగంలోకి దిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను బాలీవుడ్లో అజయ్ దేవగన్ హీరోగా నటించగా, టబు, రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్స్ గా నటించారు. మరి తెలుగులో వెంకీ సరసన హీరోయిన్స్ ఎవరు నటించనున్నారు ఏంటి? అసలు ఈ సినిమా తెలుగులో రీమేక్ చేయాలన్న వార్తలో నిజమెంత ఉన్నది తెలియాలంటే ఇంకా కొంత కాలం వెయిట్ చేయాల్సింది. ప్రజంట్ వెంకటేష్ , నాగ చైతన్య కలిసి `వెంకీ మామ` చిత్రంలో నటిస్తున్నాడు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. బాబి దర్శకత్వలో సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Also Read