Facebook Twitter
ఆకాశం

 

ఆకాశం

 


ఆకాశంలో ఆ కారుమబ్బులేమిటి?
ఆ ఉరుములు మెరుపులు ఎందుకో?
కుంభవృష్టివర్షమా! కాదు! కాదు! మరి?
కారుమబ్బులు కావు అవి
ఛిద్రమైన అబల  బ్రతుకులో
మనసులో నిండిన కారుమబ్బులా
లేక పిడుగుపాటువలన వచ్చిన కారుచిచ్చులా?
అబల అనే విశ్వంలో
కండ్లు అనే ఆకాశంలో
కారుమబ్బులు వ్యాపించి వర్షిస్తున్నాయా
ఆమె ఆర్తనాదాలనే ఉరుములు
ఏమీ చెయ్యలేక గర్జిస్తున్నాయా!
ఆమె కండ్లలోని మెరుపులు
మబ్బు చాటున మెరుపుతీగలా
భయంభయంగా చూస్తున్నాయా?
ఓహో! ఉదయించే  సూర్యుడికన్నా
అస్తమించే సూర్యుడు ఎర్రగా వున్నాడా?
ఆకాశం రక్తసిక్తమై వీక్షిస్తున్నదా!
యుగపురుషుడు వస్తాడని
సబలుడై అబలలను రక్షిస్తాడని
ఎగతాళి చేసి  నవ్వుతున్నదా..

ఎస్‌.కె.పద్మావతి
సాహితీ కిరణం మాసపత్రిక సౌజన్యంతో