Facebook Twitter
భయం.. భయం

భయం.. భయం

- డా. సి. భవానీదేవి


అప్పుడింక
సూర్యుణ్ణి చూస్తే కమలానికి భయం
చంద్రుడికి దూరంగా  నక్షత్రాలు పారిపోవాల్సిందే !
సూర్యోదయానికి పక్షుల జడుపు
తుమ్మెదల్ని చూసి పూవులు విప్పారావు

తెమ్మరలంటే చిగురుటాకుల గజగజ
వానకి భూమి,నీళ్ళంటే చేపలు
ఆమెకి అతడు, అంతా భయం భయం

కూరగాయల భయం ముసుగేసుకున్నై
రోబో కంప్యూటర్ల ఆలింగనాలు
రక్తం చిందించే ప్రేమలు
ఎయిడ్స్,ఆల్ట్రా,మాలిన్యాలు,కాలుష్యాలు

ప్రాణాంతక వైరస్లు, ఇన్పెక్షన్లు

మనిషిని చూస్తే తోటి మనిషికి భయం
ఇంకా ఈ నేలని చూసి
ఆకాశం కూడా భయపడి పారిపోతుందేమో !