Facebook Twitter
అవన్నీ వొట్టి జ్ఞాపకాలే

అవన్నీ వొట్టి జ్ఞాపకాలే

- డా.సి. భవానీదేవి.

అవన్నీ వొట్టి జ్ఞాపకాలే !
పుట్టిన ఇల్లు, చదివిన స్కూలు
ఆడుకున్న స్నేహితులు,ఊగిన ఊడలు
పూలిచ్చిన చెట్లు,పళ్ళు ఇచ్చిన వృక్షాలు
అన్నీ ఫోటోల్లాంటి జ్ఞాపకాలే !

బాల్యన్ని దోచుకున్న మావూరు
ఇప్పుడు కూలిన ఇల్లయ్యింది
మారిన స్కూలయ్యింది
మోడైన చెట్టయింది
బీడయిన నేలయ్యింది
శివుడులేని శిధిలాలయమయింది
పక్షులు ఎగిరిపోయినప్పుడు
దుఖంతో తలొంచి
తల్లి వృక్షమయింది

అయినా
పచ్చని స్మృతి మైదానంలో
పదిలమైన జ్ఞాపకాల పుటలు
అమ్మ బొమ్మంత సజీవంగా
ఆవిరి కాని స్వప్నంలా
కడదాకా నాతోనే !